KTR | లోక్‌సభలో బీఆర్ఎస్ సభ్యులుంటే తేజస్వి సూర్యతో క్షమాపణ చెప్పించేవాళ్లం : కేటీఆర్
KTR | బీఆర్‌ఎస్ ఎంపీ లోక్‌సభలో ఉంటే తేజస్వి సూర్యను నిలదీసి క్షమాపణ చెప్పించేవారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పాకిస్థాన్ ఏర్పాటుతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
భావోద్వేగాలను గాయపరిచేలా ఉన్నాయని చెప్పా..
ఈ అంశంపై తేజస్వి సూర్య తనకు ఫోన్ చేసి మాట్లాడారని కేటీఆర్ వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా అనుచితమని, అవి అనేక మంది భావోద్వేగాలను గాయపరిచే విధంగా ఉన్నాయన్నారు. ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని తాను ఆయనకు స్పష్టంగా చెప్పినట్లు వెల్లడించారు. “మీరు మాట్లాడింది చాలా తప్పు. చాలా మంది హృదయాలు గాయపడేలా మాట్లాడారు. ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఇది మీ వ్యక్తిగత అభిప్రాయమా లేక పార్టీ అభిప్రాయమా అనేది నాకు తెలియదు. కానీ మాట్లాడిన విధానం మాత్రం సరైంది కాదు” అని తాను తేజస్వి సూర్యకు గట్టిగా చెప్పినట్లు కేటీఆర్ వివరించారు.
బీఆర్ఎస్ ఎంపీలు లేకనే..
తేజస్వి సూర్య స్వయంగా తనకు ఫోన్ చేసి “బ్రదర్, నేను ఏదో అన్నాను.. మీవాళ్లు తప్పుగా అర్థం చేసుకున్నారు” అని చెప్పినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. అయితే, ఆ సమయంలోనే తాను స్పష్టంగా స్పందించినట్లు తెలిపారు. అంతకుముందు, పార్లమెంటులో తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మొత్తం 16 మంది ఉన్నప్పటికీ, ఇలాంటి వ్యాఖ్యలపై సరైన స్పందన లేకపోవడం పట్ల కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వారు అక్కడ కూర్చుని ఉత్సవ విగ్రహాల్లా వ్యవహరించారని విమర్శించారు. కనీసం బీఆర్‌ఎస్ ఎంపీ లోక్‌సభలో ఉంటే అక్కడికక్కడే స్పందించి తేజస్వి సూర్యను నిలదీసి క్షమాపణ చెప్పించేవారని స్పష్టం చేశారు. రాజ్యసభలో బీఆర్‌ఎస్ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్ రావు వెంటనే స్పందించి తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ పౌరుషం నిలబెట్టే బీఆర్‌ఎస్ ఎంపీలు లోక్‌సభలో లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని, ప్రజలు దీనిపై ఆలోచించాలని ఆయన కోరారు.
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్టు చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



