త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stampede | ఆల‌యంలో తొక్కిస‌లాట‌.. 8 మంది భ‌క్తులు మృతి

Stampede | బీహార్‌లో ఘోర‌ ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఓ ఆల‌యంలో (Bihar Temple) తొక్కిస‌లాట (Stampede) జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది భ‌క్తులు మ‌ర‌ణించారు. మ‌ర‌ణించిన వారంతా మ‌హిళ‌లే కావ‌డం గ‌మ‌నార్హం.

D

National | Published On Mar 31, 2026, 11.43 am IST

Stampede | ఆల‌యంలో తొక్కిస‌లాట‌.. 8 మంది భ‌క్తులు మృతి
Advertisement

Stampede | బీహార్‌లో ఘోర‌ ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఓ ఆల‌యంలో (Bihar Temple) తొక్కిస‌లాట (Stampede) జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఎనిమిది మంది భ‌క్తులు మ‌ర‌ణించారు. మ‌ర‌ణించిన వారంతా మ‌హిళ‌లే కావ‌డం గ‌మ‌నార్హం. అనేక మంది భ‌క్తులు గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న న‌లంద (Nalanda) జిల్లాలోని బీహార్ ష‌రీఫ్‌కు ఐదు కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న మాఘ్రా గ్రామం (Maghra Village)లోని శీత‌లాష్ట‌మి ఆల‌యం (Sheetlaashtami Temple) వ‌ద్ద మంగ‌ళ‌వారం ఉద‌యం చోటు చేసుకుంది.

చైత్ర మాసంలో వ‌చ్చే చివ‌రి మంగ‌ళ‌వారం కావ‌డంతో ఆల‌యానికి భారీ సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లివ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఒక్క‌సారిగా ర‌ద్దీ పెరిగి తొక్కిస‌లాట‌కు దారి తీసింది. ప్ర‌మాద స‌మాచారం అందుకున్న వెంట‌నే పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. స్థానికుల సాయంతో క్ష‌త‌గాత్రుల‌ను స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఘ‌ట‌న‌కు సంబంధించిన దృష్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Also Read..

స్వ‌ల్పంగా పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. పెట్టుబ‌డిదారుల ఆస‌క్తి త‌గ్గిందా..?

హైదరాబాద్‌లో ఉన్న జయలలిత ఇల్లు సీజ్

ఇరాన్ నుంచి భార‌త్‌కు వ‌చ్చే విమానంపై అమెరికా దాడి

Advertisement

తాజావార్తలు

Advertisement