Upendra Dwivedi | ప్రపంచ పటంలో ఉండాలో లేదో వారే నిర్ణయించుకోవాలి.. పాక్‌కు ఆర్మీచీఫ్ వార్నింగ్
Upendra Dwivedi | పాకిస్థాన్ (Pakistan)కు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది (Army Chief Gen Upendra Dwivedi) మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. "ప్రపంచ పటంలో ఉండాలనుకుంటున్నారా..? లేక చరిత్రలో మిగిలిపోవాలనుకుంటున్నారా..?" అంటూ తీవ్రస్వరంతో హెచ్చరించారు.
Upendra Dwivedi | సీమాంత ఉగ్రవాదాన్ని పొంచి పోషిస్తోన్న దాయాది పాకిస్థాన్ (Pakistan)కు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది (Army Chief Gen Upendra Dwivedi) మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించడం కొనసాగిస్తే.. తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. "ప్రపంచ పటంలో ఉండాలనుకుంటున్నారా..? లేక చరిత్రలో మిగిలిపోవాలనుకుంటున్నారా..?" అంటూ తీవ్రస్వరంతో హెచ్చరించారు.
ఢిల్లీలోని మానెక్‌షా సెంటర్‌లో 'యూనిఫాం అన్‌వీల్డ్' (Uniform Unveiled) నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్‌లో ఆర్మీ చీఫ్ మాట్లాడారు. ఈ సందర్భంగా గతేడాది 'ఆపరేషన్ సింధూర్' (Operation Sindoor)కు దారితీసిన పరిస్థితులు మళ్లీ ఎదురైతే.. భారత సైన్యం ఎలా స్పందిస్తుంది అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. నేను ఇంతకు ముందు చెప్పింది మీరు వినే ఉంటారు.. పాకిస్థాన్ గనుక ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేయడం కొనసాగిస్తే తీవ్ర పరిణాలు తప్పవు. వారు ప్రపంచ పటంలో ఉండాలా..? లేదా చరిత్రలో మిగిలిపోవాలా..? అనేది వారే నిర్ణయించుకోవాలి" అని అన్నారు.
గతేడాది పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా మన దళాలు గతేడాది మే 7వ తేదీన పాక్‌పై ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. సరిహద్దు ఆవల ఉన్న పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై ఖచ్చితమైన లక్ష్యాలతో విరుచుపడ్డాయి. ఈ దాడిలో ఉగ్రస్థావరాలు ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత దాయాది కూడా మనదేశంపై దాడులకు దిగింది. ఆ దాడుల్ని మన సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇరు దేశాల మధ్య దాదాపు 88 గంటల పాటూ సైనిక ఘర్షణలు కొనసాగాయి. ఆ తర్వాత మే 10 సాయంత్రం ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ కుదరడంతో ఘర్షణలు ముగిశాయి. అయితే, అప్పటికే పాక్‌కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పాక్ కీలకమైన ఎయిర్‌బేస్‌లు చాలా వరకూ ధ్వంసమయ్యాయి.
Also Read..
ఐసిస్‌కు బిగ్ షాక్.. టాప్ కమాండర్ అబు బిలాల్ మినూకీ హతం.. ప్రకటించిన ట్రంప్
భారతీయ రైల్వేలో 11,127 అసిస్టెంట్ లోక్‌పైలట్ పోస్టులు.. సికింద్రాబాద్ జోన్‌లో ఖాళీలు?
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

PM Modi | దేశ భద్రత విషయంలో రాజీపడేది లేదు.. ఆపరేషన్ సిందూర్‌కు ఏడాది పూర్తైన వేళ ప్రధాని పోస్ట్
మే 7, 2026

China J-35AE Fighter Jet | డ్రాగన్ కొత్త మాస్టర్ ప్లాన్: పాకిస్థాన్ చేతికి చైనా ఫైటర్ జెట్స్!
మే 6, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



