త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGSRTC | గ్రేట‌ర్ ప్ర‌యాణికుల‌కు ఆర్టీసీ షాక్‌.. పెరిగిన టీ 24 టికెట్ ధర

TGSRTC | గ్రేట‌ర్ ప్ర‌యాణికుల‌కు (Greater Hyderabad) టీజీఎస్‌ ఆర్టీసీ (TGSRTC) షాకిచ్చింది. ఓ వైపు మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం (Free bus For Women).. మ‌రోవైపు అర‌కొర స‌ర్వీసులు. మ‌హిళ‌ల‌తో కిక్కిరిసిపోతున్న బ‌స్సుల్లో సాధార‌ణ ప్ర‌యాణికులు ఎక్కాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు. అయిన‌ప్ప‌టికీ బ‌స్సు పాస్‌ ధ‌ర‌ల‌ను ఆర్టీసీ పెంచుతూ పోతున్న‌ది.

G

Hyderabad | Published On Mar 2, 2026, 9.42 am IST

TGSRTC | గ్రేట‌ర్ ప్ర‌యాణికుల‌కు ఆర్టీసీ షాక్‌.. పెరిగిన టీ 24 టికెట్ ధర
Advertisement

TGSRTC | త్రినేత్ర‌.న్యూస్‌: గ్రేట‌ర్ ప్ర‌యాణికుల‌కు (Greater Hyderabad) టీజీఎస్‌ ఆర్టీసీ (TGSRTC) షాకిచ్చింది. ఓ వైపు మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం (Free bus For Women).. మ‌రోవైపు అర‌కొర స‌ర్వీసులు. మ‌హిళ‌ల‌తో కిక్కిరిసిపోతున్న బ‌స్సుల్లో సాధార‌ణ ప్ర‌యాణికులు ఎక్కాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు. అయిన‌ప్ప‌టికీ బ‌స్సు పాస్‌ ధ‌ర‌ల‌ను ఆర్టీసీ పెంచుతూ పోతున్న‌ది. తాజాగా వివిధ ప‌నుల నిమిత్తం ఆర్టీసీ బ‌స్సుల్లో వెళ్లే ప్ర‌యాణికుల కోసం ప్ర‌వేశ‌పెట్టిన డే పాస్ టీ 20 టికెట్ (ట్రావెల్‌ యాజ్‌ యూ లైక్‌-T 24 Ticket) ధ‌ర‌ను పెంచింది. ఇప్పటివరకు రూ.130 ఉన్న టికెట్‌ ధరను రూ. 150కి పెంచింది. దీంతో ప్ర‌యాణికుడిపై ఒకేసారి రూ.20 భారం పడింది. అలాగే సీనియర్‌ సిటిజన్‌లకు రూ. 110 ఉన్న ధర రూ. 120గా మార్చింది. పిల్లలకు రూ. 90లుగా ఉండగా, రూ. 100 చేసింది. గ్రేటర్‌లో ఏసీ మెట్రో డీలక్స్‌ బస్సుల్లో 15 శాతం రాయితీ కల్పించామని గొప్పలు చెప్పుకుంటున్నఆర్టీసీ టీ 24 టికెట్‌ ధరలు పెంచి సామాన్యులపై భారం మోపింది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని సిటీ బస్సుల్లో 24 గంటలపాటు ప్రయాణించడానికి వెసులుబాటు కల్పించే టీ-24 టికెట్ ధ‌ర‌ను 2023, జూన్‌లో రూ.100కి పెంచింది. అప్ప‌టివ‌ర‌కు రూ.90గా ఉన్న‌ది. ఆ త‌ర్వాత దానిని రూ.130కి పెంచగా, ఇప్పుడు మ‌రో రూ.20 ప్ర‌యాణికుల‌కు వ‌డ్డించింది. దీంతో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణంతో ఇప్ప‌టికే ఇబ్బందిగా మారిన ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణం ఇప్పుడు మ‌రింత భారం కానున్న‌ది.

Advertisement
Advertisement