త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran Intelligence Minister | ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ల‌క్ష్యంగా ఐడీఎఫ్ దాడులు

Iran Intelligence Minister | మ‌ధ్య‌ప్రాచ్యంలో యుద్ధం 19వ రోజుకు చేరింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ కీల‌క నేత‌లే ల‌క్ష్యంగా ఐడీఎఫ్ విరుచుకుప‌డుతోంది.

D

International | Published On Mar 18, 2026, 3.54 pm IST

Iran Intelligence Minister | ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ల‌క్ష్యంగా ఐడీఎఫ్ దాడులు
Advertisement

Iran Intelligence Minister | మ‌ధ్య‌ప్రాచ్యంలో యుద్ధం 19వ రోజుకు చేరింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ కీల‌క నేత‌లే ల‌క్ష్యంగా ఐడీఎఫ్ విరుచుకుప‌డుతోంది. తాజాగా ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి (Iran Intelligence Minister) ఇస్మాయిల్ ఖ‌తీబ్ (Esmaeil Khatib)ను ల‌క్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసిన‌ట్లు (Israel Strikes) అంత‌ర్జాతీయ మీడియా వెల్ల‌డిస్తోంది.

మంగ‌ళ‌వారం రాత్రి జ‌రిగిన ఈ దాడి విజ‌య‌వంత‌మైన‌ట్లు ఇజ్రాయెల్ సీనియ‌ర్ నేత‌ల‌ను ఉటంకిస్తూ జెరూస‌లేం పోస్ట్ ధృవీక‌రించింది. అయితే, ఈ దాడిలో ఇస్మాయిల్ ఖ‌తీబ్ ప‌రిస్థితిపై ఎలాంటి వివ‌రాలూ వెల్ల‌డించ‌లేదు. ఇజ్రాయెల్ జ‌రిపిన దాడుల్లో ఇరాన్ జాతీయ భద్రతా మండలి (Supreme National Security Council) సెక్రటరీ, ఆ దేశ అత్యున్నత నేతల్లో ఒకరైన అలీ లారిజానీ (Ali Larijani) ఇజ్రాయెల్ అంతం చేసిన విష‌యం తెలిసిందే. బాసిజ్ (Basij) రెసిస్టెన్స్ ఫోర్స్ చీఫ్ గులాంరెజా సులేమానీతో పాటు ఇతర సీనియర్ నాయకులను కూడా లక్ష్యంగా చేసుకుంది. ఇలా ఇరాన్ కీల‌క నేత‌ల‌ను ఐడీఎఫ్ టార్గెట్ చేస్తూ దాడులు కొన‌సాగిస్తోంది.

ఇజ్రాయెల్ దాడుల్లో 10 మంది మృతి..

మ‌రోవైపు లెబ‌నాన్ (Lebanon)పై ఇజ్రాయెల్ దాడుల‌ను కొన‌సాగిస్తోంది. క్షిప‌ణులు, డ్రోన్ల‌తో విరుచుకుప‌డుతోంది. తాజాగా లెబ‌నాన్ రాజ‌ధాని బీరుట్ (Beirut)లో ఇజ్రాయెల్ జ‌రిపిన దాడిలో 10 మంది మ‌ర‌ణించిన‌ట్లు లెబ‌నాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

హ‌మాస్ క‌మాండ‌ర్ హ‌తం..!

హ‌మాస్ క‌మాండ‌ర్ యాహ్యా అబు ల‌బ్దాను అంత‌మొందించిన‌ట్లు ఇజ్రాయెల్ ప్ర‌క‌టించింది. అత‌ను హ‌మాస్ ఉగ్ర‌వాద సంస్థ స‌ప్లై విభాగానికి క‌మాండర్ అని తెలిపింది. హ‌మాస్ సైనిక విభాగానికి ప‌రిక‌రాలు, ఆయుధాల సేక‌ర‌ణ‌, ర‌వాణాకు బాధ్య‌త వ‌హిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. అయితే, ఇజ్రాయెల్ ప్ర‌క‌ట‌న‌ను హ‌మాస్ ఖండించింది.

కాల్పుల విర‌మ‌ణ‌ను విశ్వ‌సించం..

"ఇరాన్ కేవలం కాల్పుల విరమణను నమ్మడం లేదు. దానికి బదులుగా అన్ని రంగాల్లో యుద్ధం ముగియాలని కోరుకుంటోంది (ending the war). అంటే దీని అర్థం.. లెబ‌నాన్‌, యెమెన్‌, ఇరాక్‌, ఇరాన్ స‌హా ఈ ప్రాంతంలోని ఇత‌ర దేశాల్లో యుద్ధాన్ని ముగించ‌డం" అని ఆయ‌న వ్యాఖ్యానించారు. అల్-జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాదు, హ‌ర్మూజ్ జ‌ల‌సంధి గుండా ప్ర‌యాణానికి సంబంధించి ఇరాన్ ఒక కొత్త నిబంధ‌న‌ను రూపొందిస్తుంద‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న తెలిపారు.

Also Read..

మొజ్తబా ఖ‌మేనీ ఎక్క‌డున్నా.. వెంటాడి మ‌రీ అంతం చేస్తాం.. ఇరాన్‌కు ఇజ్రాయెల్ వార్నింగ్‌

అమెజాన్‌లో ఇక 1 గంట‌లోనే డెలివ‌రీ.. ముందుగా అక్క‌డే..

చైనాకు వెళ్లాల్సిన రష్యా చమురు నౌక యూటర్న్.. భారత్‌కు మళ్లింపు.. ఎందుకంటే?

Advertisement

తాజావార్తలు

Advertisement