త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Russian Oil Tanker | చైనాకు వెళ్లాల్సిన రష్యా చమురు నౌక యూటర్న్.. భారత్‌కు మళ్లింపు.. ఎందుకంటే?

రష్యా నుంచి ముడి చమురు భారత్‌కు వస్తుండటంతో భారత్‌కి చెందిన చమురు రిఫైనరీ కంపెనీలు కేవలం వారం రోజుల్లోనే 3 కోట్ల బ్యారెళ్ల రష్యా ముడి చమురును బుక్ చేసుకున్నాయి.

J

International | Published On Mar 18, 2026, 3.47 pm IST

Russian Oil Tanker | చైనాకు వెళ్లాల్సిన రష్యా చమురు నౌక యూటర్న్.. భారత్‌కు మళ్లింపు.. ఎందుకంటే?
Advertisement

Russian Oil Tanker | త్రినేత్ర.న్యూస్ : ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం 19 రోజులకు చేరుకుంది. ఒక్క రోజుతో ముగిసిపోతుందనుకున్న యుద్ధం తీవ్రరూపం దాల్చడం, గల్ఫ్ నుంచి చమురును తరలించే కీలకమైన హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో భారత్‌కి ఆయిల్ కష్టాలు మొదలయ్యాయి. ఈ యుద్ధం వల్ల చమురు కొరత ఏర్పడకుండా ఉండేందుకు, రష్యా నుంచి చమురు కొనుగోలుకి అమెరికా భారత్‌కి తాత్కాలికంగా ఏప్రిల్ 4 వరకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో చైనాలకు వెళ్లాల్సిన రష్యా ముడి చమురు ట్యాంకర్లు ఇప్పుడు భారత్ వైపు మళ్లుతున్నాయి.

మంగళూరుకు రానున్న ఆక్వా టైటాన్

షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం.. చైనాకు వెళ్లాల్సిన ఏడు రష్యా చమురు ట్యాంకర్లు మధ్యలోనే దారి మార్చుకొని భారత్‌కి వస్తున్నాయి. ఆక్వా టైటాన్ అనే నౌక ఇప్పటికే దక్షిణ చైనా సముద్రంలో యూటర్న్ తీసుకొని కర్ణాటకలోని మంగళూరు పోర్టుకి వస్తోంది. మార్చి 21, 2026 న ఆ నౌక న్యూ మంగళూరు పోర్టును చేరుకోనుంది.

Russian oil tanker takes u turn in south china sea and heads to india

భారీ కొనుగోళ్లు

రష్యా నుంచి ముడి చమురు భారత్‌కు వస్తుండటంతో భారత్‌కి చెందిన చమురు రిఫైనరీ కంపెనీలు కేవలం వారం రోజుల్లోనే 3 కోట్ల బ్యారెళ్ల రష్యా ముడి చమురును బుక్ చేసుకున్నాయి.

చైనాతో పోటీ: రష్యా అందిస్తున్న తగ్గింపు ధరల కోసం భారతీయ కంపెనీలు చైనా కంటే ఎక్కువ బిడ్ వేసి ఈ చమురును దక్కించుకుంటున్నాయి. ఈ చమురు నౌకలు గుజరాత్‌లోని సిక్కా, వాడినార్, ఒడిశాలోని పారాదీప్ ఓడరేవులకు చేరుకోనున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement