Viral Video | ఒక్క నిమిషంలో 16 కోట్ల విలువైన జ్యుయెలరీ ఎత్తుకెళ్లారు.. వీడియో చూస్తే మతిపోతుంది!
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యూజర్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనలు అమెరికాలోనే జరిగాయంటే ప్రపంచమంతా జరుగుతాయంటూ కామెంట్లు చేస్తున్నారు.
Viral news | Published On Mar 14, 2026, 3.52 pm IST
Viral Video | హాలీవుడ్ సినిమాల్లో మనం చూస్తుంటాం. పది మంది కంటే ఎక్కువ ఉన్న ఓ గ్యాంగ్ సడెన్‌గా ఏదైనా స్టోర్‌లోకి చొరబడి కోట్ల విలువైన వస్తువులను దోచుకెళ్తుంటారు. సిబ్బందిని గన్స్‌తో బెదిరించి ఇలాంటి చోరీలు చేయడం కొత్తేమీ కాదు. కానీ.. ఈ వీడియో చూస్తే మాత్రం ఇలాంటి భారీ దోపిడి ఎక్కడా చూడలేదంటారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. మాస్క్ వేసుకొని ఓ 20 మంది వరకు గ్యాంగ్ సడెన్‌గా జ్యుయెలరీ స్టోర్‌లోకి చొరబడి అందిన కాడికి దోచుకున్నారు. ఈ ఘటన కాలిఫోర్నియాలోని ఫ్రెమొంట్ అనే సిటీలో చోటు చేసుకుంది. ఈ ఘటన 2025లో జరిగినా దానికి సంబంధించిన వీడియోను యూఎస్ న్యాయ శాఖ తాజాగా రిలీజ్ చేసింది.
భారత సంతతికి చెందిన వ్యక్తికి చెందిన కుమార్ జ్యుయెలర్స్‌లో జూన్ 18, 2025న భారీ దొంగతనం జరిగింది. సాయుధులైన దుండగులు ఒక్కసారిగా షోరూమ్‌లోకి ప్రవేశించి షోరూమ్‌లో ఉన్న జ్యుయెలరీలో 75 శాతం వరకు క్షణాల్లో అందినకాడికి దోచుకెళ్లారు. దాని విలువ 1.7 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో 16 కోట్ల వరకు ఉంటుంది. ఈ దోపిడికి సంబంధించి నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేసినా ఈ దొంగతనంలో ఇన్వాల్వ్ అయిన వాళ్లు ఎక్కువ మంది ఉండటంతో వాళ్ల ఆచూకీ తెలుసుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది.
చోరీ చేసిన కార్లలో వచ్చి
ఈ దోపిడి కోసం వాళ్లు భారీ స్కెచ్ వేసినట్లు పోలీసులు గుర్తించారు. చాలా రోజుల నుంచి రెక్కీ నిర్వహించి దొంగతనం కోసం ముందే దొంగలించిన కొన్ని కార్లను సిద్ధం చేసుకొని పోలీసులకు దొరకకుండా ఉండేందుకు వాటిలోనే వచ్చి దొంగతనం చేసిన తర్వాత కూడా వాటిలోనే పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అందుకే వాళ్లను ట్రేస్ చేయడం పోలీసులకు ఇబ్బందిగా మారింది.
అమెరికాలో ఇలాంటి దోపిడీలా?
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యూజర్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనలు అమెరికాలోనే జరిగాయంటే ప్రపంచమంతా జరుగుతాయి. ప్రభుత్వాలు మీ నుంచి ట్యాక్సులు మాత్రమే వసూలు చేస్తాయి. మీ ప్రాణాలకు ఎలాంటి గ్యారెంటీ ఉండదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
https://x.com/CollinRugg/status/2032516479707688997
సంబంధిత వార్తలు

World Cup Final | ఓటమి తట్టుకోలేక స్పెయిన్ స్టార్‌పై అర్జెంటీనా ఆటగాడి దాడి.. వైరల్ వీడియో
జులై 20, 2026

Bihar Bridge Birthday Party | సేఫ్టీ లేదని రూ.26 కోట్ల బ్రిడ్జిని క్లోజ్ చేస్తే.. ఏకంగా డీజే, డ్యాన్సులతో బర్త్‌డే పార్టీ!
జులై 16, 2026

Tasmac Cooling Charge Scam | రూ.160 బీరుకు రూ.170.. సీఎం విజయ్‌కు యువకుడి ఫిర్యాదు.. VIDEO
జులై 15, 2026
తాజావార్తలు
- ●Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం
- ●Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..
- ●Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హఠాన్మరణం

Kukatpally | క్రికెట్ ఆడటానికి వెళ్తూ.. కానరాని లోకాలకు..

Komuravelli Railway Station | సాకారమైన దశాబ్దాల కల.. నేడు కొమురెల్లి మల్లన్న రైల్వే స్టేషన్ ప్రారంభం..

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?



