త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | దేశంలో భ‌యాందోళ‌న‌లు సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తోంది.. కాంగ్రెస్‌పై ప్ర‌ధాని మోదీ ధ్వ‌జం

PM Modi | కాంగ్రెస్‌పై (Congress Party) ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మ‌ధ్య‌ప్రాచ్యంలో (Middle East) కొన‌సాగుతున్న యుద్ధ ప్ర‌భావం దేశ పౌరుల‌పై ప‌డ‌కుండా ఉండేందుకు ప్ర‌భుత్వం కృషి చేస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం భార‌తీయుల్లో భ‌యాందోళ‌న‌లు సృష్టించేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని (Congress create panic among Indians) ధ్వ‌జ‌మెత్తారు.

D

National | Published On Mar 14, 2026, 3.28 pm IST

PM Modi | దేశంలో భ‌యాందోళ‌న‌లు సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తోంది.. కాంగ్రెస్‌పై ప్ర‌ధాని మోదీ ధ్వ‌జం
Advertisement

PM Modi | కాంగ్రెస్‌పై (Congress Party) ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మ‌ధ్య‌ప్రాచ్యంలో (Middle East) కొన‌సాగుతున్న యుద్ధ ప్ర‌భావం దేశ పౌరుల‌పై ప‌డ‌కుండా ఉండేందుకు ప్ర‌భుత్వం కృషి చేస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం భార‌తీయుల్లో భ‌యాందోళ‌న‌లు సృష్టించేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని (Congress create panic among Indians) ధ్వ‌జ‌మెత్తారు. అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అస్సాం (Assam)లోని సిల్చార్‌లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌ధాని ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. దేశాభివృద్ధిని అడ్డుకోవాల‌ని చూస్తున్న శ‌క్తుల చేతుల్లో కాంగ్రెస్ ఓ కీలుబొమ్మ‌లా మారింద‌ని ఆరోపించారు.

"పౌరులు ఇబ్బందులు ప‌డ‌కుండా ఉండేందుకు మా ప్ర‌భుత్వం అన్ని ర‌కాల ప్ర‌యాత్నాలూ చేస్తోంది. ప‌శ్చిమాసియా యుద్ధ ప్ర‌భావం ప్ర‌జ‌ల‌పై ప‌డ‌కుండా చూడ‌ట‌మే మా ల‌క్ష్యం. ఇలాంటి క్లిష్ట స‌మ‌యంలో కాంగ్రెస్ బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని ఆశించాం. కానీ జాతీయ ప్ర‌యోజ‌నాల విష‌యంలో కాంగ్రెస్ మ‌రోసారి విఫ‌ల‌మైంది. దేశంలో భయాందోళ‌న‌లు సృష్టించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. దేశాన్ని ఇబ్బందుల్లోకి నెట్టి.. త‌ద్వారా న‌న్ను వేధించాల‌ని చూస్తోంది" అని ప్రధాని విమర్శించారు. "భారతదేశం సాధిస్తున్న వేగవంతమైన అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్న అంతర్జాతీయ శక్తుల చేతుల్లో కాంగ్రెస్ ఓ కీలుబొమ్మగా మారుతోంది" అని ప్రధాని ఆరోపించారు.

ఓట‌ముల్లో సెంచ‌రీ మార్క్‌..

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ప్ర‌ధాని తీవ్ర స్థాయిలో విమర్శ‌లు గుప్పించారు. ప్ర‌తీ రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతోంద‌ని వ్యాఖ్యానించారు. త్వ‌ర‌లో ఓట‌ముల్లో సెంచ‌రీ మార్క్‌ను చేరుకోబోతోంద‌ని ఎద్దేవా చేశారు. "మీరు (అస్సాం ప్ర‌జ‌ల‌ను ఉద్దేశిస్తూ) కాంగ్రెస్‌ను ఇక్క‌డి నుంచి ఎప్పుడో త‌రిమికొట్టారు. ఈరోజు దేశంలోని ప్రతి రాష్ట్రం కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతోంది. దేశంలో జ‌రుగుతున్న వ‌రుస ఎన్నిక‌ల్లో హ‌స్తం పార్టీ ఓడిపోతోంది. సమీప భవిష్యత్తులో.. ఓటముల్లో కాంగ్రెస్ సెంచరీ కొట్టడం ఖాయం" అని ప్రధాని మోదీ అన్నారు.

ఇక ఇటీవ‌లే ఢిల్లీలో జ‌రిగిన ఏఐ స‌మ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ నిర‌స‌న‌ల‌పై ప్ర‌ధాని ప్ర‌స్తావించారు. ప్ర‌తిప‌క్ష పార్టీ నిరాశ నిస్పృహ‌ల‌తో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని మండిప‌డ్డారు. ఓట‌మి భారంతో నిరాశ‌లో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ.. దేశంపైనే దాడికి దిగుతోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆ పార్టీ నాయ‌కులు దేశ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చ‌డానికే అంకిత‌మ‌య్యారని ధ్వ‌జ‌మెత్తారు. ఆ పార్టీ నేత‌ల తీరును దేశం మొత్తం ఖండిస్తోంద‌న్నారు. నిరాశ‌తో బ‌ట్ట‌లు చించుకోవ‌డం త‌ప్ప మ‌రేమీ మిగిలిన‌ట్లు క‌నిపించ‌డం లేద‌ని ప్ర‌ధాని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు.

Also Read..

లద్దాఖ్‌ ఉద్యమకారుడు వాంగ్‌చుక్‌ను విడుద‌ల చేయ‌నున్న కేంద్రం

ఫ‌లించిన దౌత్యం.. హ‌ర్మూజ్‌ను దాటిన రెండు భార‌త ఎల్పీజీ నౌకలు

భారీగా పెర‌గ‌నున్న ల్యాప్ టాప్‌ల ధ‌ర‌లు.. కార‌ణాలేంటి..?

Advertisement
Advertisement