Keerthy Suresh | బాలీవుడ్‌లోకి కీర్తిసురేష్ రీఎంట్రీ – సైలెంట్‌గా కొత్త మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన మహానటి
మహానటి కీర్తి సురేష్ బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది. డెబ్యూ మూవీ డిజాస్టర్‌గా నిలవడంతో ఏడాదిన్నర పాటు హిందీ సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కీర్తి సురేష్ కొత్త మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్‌ను కూడా సైలెంట్‌గా కంప్లీట్ చేసేసిందట. ఆ సినిమా ఏదంటే?
Entertainment | Published On Mar 14, 2026, 2.40 pm IST
Keerthy Suresh | ప్రస్తుతం బాలీవుడ్‌లో దక్షిణాది భామలదే హవా కొనసాగుతోంది. సాయిపల్లవి, శ్రీలీల, మీనాక్షి చౌదరితో పాటు పలువురు దక్షిణాది హీరోయిన్లు హిందీలో టాప్ స్టార్స్‌తో సినిమాలు చేస్తోన్నారు. తాజాగా మహానటి కీర్తి సురేష్ కూడా ఓ బాలీవుడ్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సైలెంట్‌గా షూటింగ్ కూడా పూర్తిచేసేసింది. కీర్తి సురేష్ బాలీవుడ్ మూవీని శనివారం అఫీషియల్‌గా అనౌన్స్‌చేయడమే కాకుండా టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్‌ను కూడా రివీల్ చేశారు.
విద్యా వ్యవస్థ నేపథ్యంలో...
రాజ్‌కుమార్ రావ్ హీరోగా నటిస్తున్న ఈ బాలీవుడ్ మూవీకి రఫ్తార్ అనే టైటిల్‌ను కన్ఫామ్ చేశారు. ఆదిత్య నింబాల్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు వెల్లడించారు. విద్యావ్యవస్థలో పెరుగుతోన్న పోటీతత్వం, విద్యార్థులు ఎదుర్కొనే సంఘర్షణ చుట్టూ సోషల్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రకటించారు.
రిలీజ్‌డేట్...
రఫ్తార్ రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. 2026 జూలై 24న ఈ మూవీ థియేటర్లలోకి రానున్నట్లు వెల్లడించారు. సైలెంట్‌గా ఈ బాలీవుడ్ మూవీ షూటింగ్‌ను కీర్తి సురేష్ కంప్లీట్ చేసేసిందట. ప్రస్తుతం రఫ్తార్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయట. ఇందులో గ్లామరస్ రోల్‌లో కాకుండా ఛాలెంజింగ్‌గా కీర్తి సురేష్ పాత్ర సాగుతుందని సమాచారం.
బేబీ జాన్ డిజాస్టర్....
కీర్తి సురేష్‌కు ఇదే తొలి బాలీవుడ్ మూవీ కాదు. 2024లో రిలీజైన బేబీ జాన్‌తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. దళపతి విజయ్ హీరోగా న టించిన తమిళ మూవీ తేరీ రీమేక్‌గా తెరకెక్కిన ఈ హిందీ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. డెబ్యూ సినిమా డిజాస్టర్‌గా నిలవడంతో ఏడాదిన్నర పాటు బాలీవుడ్‌కు గ్యాప్ ఇచ్చిన కీర్తి సురేష్ రఫ్తార్‌తో రీఎంట్రీ ఇస్తోంది.
ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన మూవీ చేస్తోంది. కోలా రవికిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది డిసెంబర్‌లో రిలీజ్ కాబోతుంది. మలయాళం మూవీ తొట్టంలో హీరోయిన్‌గా కనిపించబోతుంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్





