Artemis 2 | చంద్రయానానికి సిద్ధమైన నాసా.. ఆర్టెమిస్-2 మిషన్ కౌంట్‌డౌన్ షురూ..!
Artemis 2 | అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మరోసారి మూన్ మిషన్‌కు సిద్ధమైంది. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్‌లో సోమవారం కౌంట్‌డౌన్ ప్రారంభించింది. దాదాపు 53 సంవత్సరాల తర్వాత మళ్లీ వ్యోమగాములను చంద్రుడి వైపు పంపేందుకు ఆర్టెమిస్-2 మిషన్ చేపడుతోంది.
Artemis 2 | అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మరోసారి మూన్ మిషన్‌కు సిద్ధమైంది. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్‌లో సోమవారం కౌంట్‌డౌన్ ప్రారంభించింది. దాదాపు 53 సంవత్సరాల తర్వాత మళ్లీ వ్యోమగాములను చంద్రుడి వైపు పంపేందుకు ఆర్టెమిస్-2 మిషన్ చేపడుతోంది. 32 అంతస్తుల భవనం ఎత్తులో ఉన్న స్పేస్ లాంచ్ సిస్టమ్ రాకెట్ బుధవారం సాయంత్రం నలుగురు వ్యోమగాములో అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్ ఒక రోజు భూమి కక్ష్యలో చక్కర్లు కొడుతుంది. అనంతరం ఒరియన్ క్యాప్సూల్ వారిని చంద్రుడి వైపు తీసుకెళ్లి.. ఆ తర్వాత తిరిగి మళ్లీ భూమిని చేరుతుంది. అయితే, ఈ ప్రయాణంలో చంద్రుడిపై ఎలాంటి ల్యాండింగ్ ఉంబోదని నాసా తెలిపింది. చంద్రుడి చుట్టూ తిరిగిన తర్వాత మళ్లీ భూమి వైపు ప్రయాణం ప్రారంభమవుతుంది. పది రోజుల పాటు కొనసాగే ఈ మిషన్ చివరగా పసిఫిక్ మహాసముద్రంలో ల్యాండింగ్‌తో ముగియనుంది.
ఈ దశకు చేరుకునేందుకు తమ బృందం ఎంతో కష్టపడిందని లాంచ్ డైరెక్టర్ చార్జీ బ్లాక్‌వెల్ థాంప్సన్ పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని సిగ్నల్స్ అనుకూలంగానే ఉన్నాయన్నారు. తాజాగా మరమ్మతుల తర్వాత రాకెట్ పూర్తిగా సిద్ధంగా ఉందని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులు సైతం మిషన్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. అసలు ఈ ఆర్టెమిస్–2 మిషన్ ఫిబ్రవరిలోనే జరగాల్సి ఉంది. హైడ్రోజన్ ఫ్యూయల్ లీకేజీ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ సమస్య పరిష్కారమయ్యాక మళ్లీ హీలియం ప్రెజరైజేషన్ లైన్‌లో ఆటంకం ఏర్పడింది. దాంతో రాకెట్‌ను మళ్లీ హ్యాంగర్‌కు తరలించాల్సిన పరిస్థితి ఎదురైంది. సుమారు వారం క్రితం మళ్లీ లాంచ్ ప్యాడ్‌కు తీసుకువచారు. గత శుక్రవారం శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. ఈ మిషన్‌ను ఏప్రిల్ తొలి ఆరో రోజుల్లో చేపట్టేందుకు నాసాకు అవకాశం ఉంది. అయితే, చివరికు ఏదైనా సమస్య కారణంగా ప్రయోగం జరకపోతే మళ్లీ నెలాఖరు వరకు ఆగాల్సిందే.
అపోలో మిషన్లతో పోలిస్తే ఈసారి ప్రత్యేకత ఏమిటంటే.. ఆర్టెమిస్–2 బృందంలో ఒక మహిళ ఆస్ట్రోనాట్ ఉన్నారు. వర్ణ వివక్షకు గురైన వర్గానికి చెందిన వ్యక్తితో పాటు అమెరికా వెలుపలికి చెందిన వ్యోమగామి ఈ మిషన్‌లో పాల్గొననున్నారు. ఈ మిషన్ పైలట్ విక్టర్ గ్లోవర్ మాట్లాడుతూ ‘పిల్లలు మమ్మల్ని చూసి ప్రేరణ పొందాలి. అమ్మాయిలు ‘గర్ల్ పవర్’ అని గర్వపడాలి. అలాగే నా లాంటి వారిని చూసి చిన్నారులు కూడా ‘ఇతను మనలాగే ఉన్నాడు అంతరిక్షంలోకి వెళ్తున్నాడు’ అని అనుకోవాలన్నారు.
సంబంధిత వార్తలు

CEC Gyanesh Kumar | వందకు కోటి పర్సెంట్ జ్ఞానేశ్వర్ కుమార్ పదవీచ్యుతుడవుతాడు.. బల్ల గుద్ది చెప్పిన వేణు స్వామి..!
సెప్టెంబర్ 28, 2026

SIR | సైమన్ గో బ్యాక్‌లా.. సర్ గో బ్యాక్ అనేందుకు సమయం ఆసన్నమైంది: రేవంత్‌రెడ్డి
సెప్టెంబర్ 28, 2026

KTR | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ గెలుస్తాం: కేటీఆర్
సెప్టెంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Nifty 50 | ఆందోళనలో ఇన్వెస్టర్లు.. నిఫ్టీ50 ఆరు నెలల కనిష్టానికి..
- ●Mallikarjun Kharge | ప్రధాని మోదీ చేతిలో సీఈసీ కీలుబొమ్మగా మారారు.. సర్‌పై కాంగ్రెస్ వీధి పోరాటం : ఖర్గే
- ●Kavitha | ఏమున్నా నేన్ ఆధారాలతోనే మాట్లాడ్తా.. నాతో పెట్టుకోకు: కేటీఆర్‌కు కవిత వార్నింగ్
- ●Stocks | భారత్‌లోనే కాదు, విదేశీ స్టాక్స్‌లోనూ పెట్టుబడి పెట్టాలి.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
- ●POCSO Case | బాలుడిపై లైంగిక దాడి.. పోక్సో కేసులో టీచర్‌కు యావజ్జీవ శిక్ష
- ●Hyderabad | ద్విచక్ర వాహనాల చోరీ.. ఇద్దరు టీనేజర్లు అరెస్ట్.. 8 స్కూటర్లు స్వాధీనం

Nifty 50 | ఆందోళనలో ఇన్వెస్టర్లు.. నిఫ్టీ50 ఆరు నెలల కనిష్టానికి..

Mallikarjun Kharge | ప్రధాని మోదీ చేతిలో సీఈసీ కీలుబొమ్మగా మారారు.. సర్‌పై కాంగ్రెస్ వీధి పోరాటం : ఖర్గే

Kavitha | ఏమున్నా నేన్ ఆధారాలతోనే మాట్లాడ్తా.. నాతో పెట్టుకోకు: కేటీఆర్‌కు కవిత వార్నింగ్

Stocks | భారత్‌లోనే కాదు, విదేశీ స్టాక్స్‌లోనూ పెట్టుబడి పెట్టాలి.. ఎందుకో చెబుతున్న నిపుణులు..



