Stock Markets | భారీగా పతనమైన ఆసియా మార్కెట్లు.. ట్రంప్ తాజా హెచ్చరికల వల్లనే..?
Stock Markets | మధ్య ప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు ఇప్పుడప్పుడే తొలగే అవకాశం లేదని సంకేతాలు వెలువడుతుండడంతో అంతర్జాతీయంగా అన్ని దేశాలకు చెందిన స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. మంగళవారం మహావీర్ జయంతి కారణంగా దేశీయ మార్కెట్లకు సెలవు అయినప్పటికీ ఆసియా మార్కెట్లను పరిశీలిస్తే ఇవాళ్టి సెషన్‌లోనూ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి.
Stock Markets | మధ్య ప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ పరిస్థితులు ఇప్పుడప్పుడే తొలగే అవకాశం లేదని సంకేతాలు వెలువడుతుండడంతో అంతర్జాతీయంగా అన్ని దేశాలకు చెందిన స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. మంగళవారం మహావీర్ జయంతి కారణంగా దేశీయ మార్కెట్లకు సెలవు అయినప్పటికీ ఆసియా మార్కెట్లను పరిశీలిస్తే ఇవాళ్టి సెషన్‌లోనూ నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, యుద్ధం తీవ్రత ఎక్కువ కావడం వల్ల పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలహీనంగా మారింది. దీంతో వారిపై అమ్మకాల ఒత్తిడి నెలకొంది. భారీ ఎత్తున విక్రయాలను కొనసాగిస్తున్నారు. ఇక దక్షిణ కొరియా కోస్పీ సూచీ ఇవాళ్టి సెషన్‌లో ఏకంగా 4 శాతం కన్నా అధికంగా పతనం అయింది. స్మాల్ క్యాప్ కోస్డాక్ సూచీ 3 శాతం కన్నా ఎక్కువగా నష్టపోయింది. దక్షిణ కొరియా కరెన్సీ వోన్ కూడా డాలర్‌తో పోలిస్తే 0.63 శాతం క్షీణించి 1,526.90 వద్దకు చేరింది. 2009 తరువాత మళ్లీ ఇదే అత్యంత కనిష్ట స్థాయి కావడం గమనార్హం.
ట్రంప్ హెచ్చరికలే కారణం..
జపాన్ నిక్కీ225 సూచీ సైతం 2.2 శాతం మేర నష్టపోయింది. విస్తృత మార్కెట్ సూచీ టోపిక్స్ 1.4 శాతం తగ్గింది. ఆస్ట్రేలియా ఎస్ అండ్ పీ, ఏఎస్ఎక్స్200 సూచీ 0.56 శాతం క్షీణించగా, హాంగ్‌కాంగ్ హాంగ్‌సెంగ్ సూచీ ఫ్యూచర్స్ 24,683 వద్ద ఉన్నాయి. ఇది గత ముగింపు స్థాయి 24,750.8తో పోలిస్తే తక్కువ కావడం గమనార్హం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తన హెచ్చరికలను మరోమారు తీవ్రతరం చేశారు. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవకపోయినా, శాంతి ఒప్పందం కుదరకపోయినా ఇరాన్ విద్యుత్ వ్యవస్థలు, ఆయిల్ ఫీల్డ్స్, ఖార్గ్ దీవిని లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు. ఈ కారణం వల్లనే మార్కెట్లు మళ్లీ భారీ ఎత్తున పతనం అవుతున్నాయి.
ఖార్గ్ దీవిని స్వాధీనం చేసుకుంటారా..
అమెరికా-ఇరాన్ యుద్ధం మొదలై నెల రోజులు దాటిన నేపథ్యంలో ట్రంప్ తాజా హెచ్చరికలు మార్కెట్లలో మళ్లీ ఆందోళనలను రేకెత్తించాయి. ఇరాన్ క్రూడ్ ఎగుమతుల్లో 90 శాతం నిర్వహించే కీలక కేంద్రంగా ఉన్న ఖార్గ్ దీవిని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా భూతల సేనలను రంగంలోకి దింపే అవకాశాలు ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. కాగా ప్రపంచ సముద్ర మార్గాల ద్వారా జరిగే చమురు రవాణాలో సుమారు ఐదో వంతు నిర్వహించే హోర్ముజ్ జలసంధి ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దాడుల తర్వాత దాదాపు పూర్తిగా మూతపడింది. కేవలం కొద్దిపాటి నౌకలను మాత్రమే ఆ జలసంధి గుండా అనుమతిస్తున్నారు. పాక్షికంగా సరఫరా కొనసాగుతోంది.
పెరిగిన చమురు ధరలు..
ఈ ఉద్రిక్త పరిస్థితుల మధ్య వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ధర 2.8 శాతం పెరిగి బ్యారెల్‌కు 105.8 డాలర్లకు చేరింది. మే డెలివరీకి సంబంధించిన బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 2 శాతం పెరిగి 115.17 డాలర్లకు చేరాయి. అమెరికాలో సోమవారం ట్రేడింగ్‌లో ఎస్ అండ్ పీ 500 సూచీ 0.39 శాతం తగ్గి 6,343.72 వద్ద ముగిసింది. ఇది వరుసగా మూడో రోజు నష్టంగా నమోదైంది. నాస్డాక్ కాంపోజిట్ సూచీ 0.73 శాతం పడిపోయి 20,794.64 వద్ద నిలిచింది. అయితే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ మాత్రం వ్యతిరేక ధోరణి చూపుతూ 0.11 శాతం పెరిగి 45,216 వద్ద ముగిసింది.
అమెరికా స్టాక్ ఫ్యూచర్స్ సాధారణంగా స్థిరంగా కనిపించాయి. ఎస్ అండ్ పీ 500 ఫ్యూచర్స్ 0.1 శాతం కంటే తక్కువగా తగ్గాయి. నాస్డాక్ 100 ఫ్యూచర్స్ 0.1 శాతం పడిపోయాయి. డౌ జోన్స్ ఫ్యూచర్స్ మాత్రం 23 పాయింట్లు (0.1 శాతం) పెరిగాయి. ఎనర్జీ ధరలు పెరిగినప్పటికీ ద్రవ్యోల్బణం నియంత్రణలోనే ఉందని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ పేర్కొన్నారు. అదనపు వడ్డీ రేట్ల పెంపు అవసరం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. అయినప్పటికీ ఈ వ్యాఖ్యల మధ్యే మార్కెట్లు పతనాన్ని నమోదు చేశాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Nifty 50 | ఆందోళనలో ఇన్వెస్టర్లు.. నిఫ్టీ50 ఆరు నెలల కనిష్టానికి..
- ●Mallikarjun Kharge | ప్రధాని మోదీ చేతిలో సీఈసీ కీలుబొమ్మగా మారారు.. సర్‌పై కాంగ్రెస్ వీధి పోరాటం : ఖర్గే
- ●Kavitha | ఏమున్నా నేన్ ఆధారాలతోనే మాట్లాడ్తా.. నాతో పెట్టుకోకు: కేటీఆర్‌కు కవిత వార్నింగ్
- ●Stocks | భారత్‌లోనే కాదు, విదేశీ స్టాక్స్‌లోనూ పెట్టుబడి పెట్టాలి.. ఎందుకో చెబుతున్న నిపుణులు..
- ●POCSO Case | బాలుడిపై లైంగిక దాడి.. పోక్సో కేసులో టీచర్‌కు యావజ్జీవ శిక్ష
- ●Hyderabad | ద్విచక్ర వాహనాల చోరీ.. ఇద్దరు టీనేజర్లు అరెస్ట్.. 8 స్కూటర్లు స్వాధీనం

Nifty 50 | ఆందోళనలో ఇన్వెస్టర్లు.. నిఫ్టీ50 ఆరు నెలల కనిష్టానికి..

Mallikarjun Kharge | ప్రధాని మోదీ చేతిలో సీఈసీ కీలుబొమ్మగా మారారు.. సర్‌పై కాంగ్రెస్ వీధి పోరాటం : ఖర్గే

Kavitha | ఏమున్నా నేన్ ఆధారాలతోనే మాట్లాడ్తా.. నాతో పెట్టుకోకు: కేటీఆర్‌కు కవిత వార్నింగ్

Stocks | భారత్‌లోనే కాదు, విదేశీ స్టాక్స్‌లోనూ పెట్టుబడి పెట్టాలి.. ఎందుకో చెబుతున్న నిపుణులు..




