త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Donald Trump | ఇరాన్ భ‌యం.. తుర్కియే నుంచి బ్రిట‌న్‌కు ట్రంప్ సీక్రెట్ జ‌ర్నీ సాగిందిలా

Donald Trump | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump తుర్కియే (Turkey) ప‌ర్య‌ట‌న‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉన్న నేప‌థ్యంలో ట్రంప్ త‌న విలాస‌వంత‌మైన ఎయిర్‌ఫోర్స్ వ‌న్‌లో కాకుండా అసాధార‌ణ రీతిలో ఓ చిన్న విమానంలో సీక్రెట్‌గా ప్ర‌యాణించారు.

D

International | Published On Aug 11, 2026, 11.56 am IST

Donald Trump | ఇరాన్ భ‌యం.. తుర్కియే నుంచి బ్రిట‌న్‌కు ట్రంప్ సీక్రెట్ జ‌ర్నీ సాగిందిలా
Advertisement

Donald Trump | త్రినేత్ర‌.న్యూస్ : ఇరాన్‌తో యుద్ధం నేప‌థ్యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భ‌ద్ర‌త‌పై ఆందోళ‌న‌లు మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చాయి. టెహ్రాన్‌తో ట్రంప్ దాదాపు ఐదు నెల‌లుగా సుదీర్ఘ యుద్ధం కొన‌సాగిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ట్రంప్‌కు ఇరాన్ నుంచి ముప్పు (Iran threat) పొంచి ఉంద‌ని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఇప్ప‌టికే హెచ్చ‌రించింది. ఇరాన్ హిట్ లిస్ట్‌లో త‌న పేరు ఫ‌స్ట్‌లో ఉంద‌ని ట్రంప్ సైతం ప‌లు సంద‌ర్భాల్లో బ‌హిరంగంగానే చెప్పారు. ఈ నేప‌థ్యంలో గత నెల తుర్కియే (Turkey) ప‌ర్య‌ట‌న‌లో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది.

ఇరాన్ నుంచి ముప్పు పొంచి ఉన్న నేప‌థ్యంలో ట్రంప్ త‌న విలాస‌వంత‌మైన ఎయిర్‌ఫోర్స్ వ‌న్‌లో కాకుండా అసాధార‌ణ రీతిలో ఓ చిన్న విమానంలో సీక్రెట్‌గా ప్ర‌యాణించారు. ఈ మేర‌కు వాషింగ్ట‌న్ పోస్ట్ (The Washington Post) సంచ‌ల‌న క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఇరాన్ (Iran) నుంచి ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికల భ‌యంతో ఆయన అందరూ భావించినట్లు ఎయిర్‌ఫోర్స్ వన్‌లో కాకుండా మరో సైనిక విమానంలో రహస్యంగా ప్రయాణించారని స‌ద‌రు కథనం వెల్ల‌డించింది.

ఆ క‌థ‌నం ప్ర‌కారం.. గ‌త నెల‌ 8న నాటో సదస్సు (NATO Summit) కోసం ట్రంప్‌ తుర్కియే వెళ్లారు. రాజధాని అంకారాకు ట్రంప్ ఖ‌తార్ బ‌హూక‌రించిన కొత్త ఎయిర్‌ఫోర్స్ వ‌న్‌లో చేరుకున్నారు. అయితే, తిరిగి వెళ్లేట‌ప్పుడు మాత్రం పాత విమానంలోనే ప్ర‌యాణిస్తాన‌ని ట్రంప్ చెప్పారు. ఇక‌ స‌ద‌స్సు ముగించుకొని అంద‌రి ముందు త‌న అధికారిక విమానం ఎయిర్‌ఫోర్స్ వ‌న్ ఎక్కారు ట్రంప్‌. అధ్య‌క్షుడు ఆ విమానంలోనే ప్ర‌యాణించిన‌ట్లు ప్ర‌పంచాన్ని న‌మ్మించారు. అయితే, అక్క‌డే అస‌లు సీక్రెట్ ఉంది. ఎయిర్‌ఫోర్స్ వ‌న్‌లోకి ఎక్కిన ట్రంప్‌.. ఆ త‌ర్వాత అంద‌రి క‌ళ్లూగ‌ప్పి విమానానికి అనుసంధానించిన క్యాటరింగ్‌ కంటైనర్ (Catering truck)లోకి మారారు.

క్యాటరింగ్ ట్రక్కు ద్వారా ట్రంప్‌ను రహస్యంగా మరోచోట ఉన్న చిన్న సైనిక విమానం (ఎయిర్‌ఫోర్స్ సి-32ఏ) వద్దకు తరలించారు. ఆ విమానంలోనే ట్రంప్‌ను సీక్రెట్‌గా తుర్కియే దాటించి బ్రిటన్‌కు సేఫ్‌గా చేరుకునేలా చేశారు. ట్రంప్ ప్ర‌యాణిస్తున్న‌ట్లు భావిస్తున్న ఎయిర్‌ఫోర్స్ వ‌న్ విమానం కూడా అదే స‌మ‌యానికి బ్రిట‌న్ చేరుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇరాన్‌తో యుద్ధం నేప‌థ్యంలో ట్రంప్‌ను హత్య చేయడానికి ఇరాన్ సరికొత్త కుట్రను సిద్ధం చేస్తోందని పేర్కొంటూ ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ (Israeli intelligence) పెంట‌గాన్‌కు గ‌త నెల స‌మాచారం అందించిన విష‌యం తెలిసిందే.

Also Read..

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను చరిత్ర ఎప్ప‌టికీ గుర్తుంచుకుంటుంది : సోనియా గాంధీ

చియాన్ విక్ర‌మ్‌ను చిక్కుల్లో ప‌డేసిన రీల్ - వ‌న్య ప్రాణుల అక్ర‌మ ర‌వాణా ఆరోప‌ణ‌లు

1601 నంబ‌ర్ సిరీస్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ట్రాయ్‌.. ఈ నంబ‌ర్ల‌ను ఏయే కంపెనీల‌కు ఇచ్చారంటే..

Advertisement
Advertisement