TRAI | 1601 నంబర్ సిరీస్‌ను ప్రవేశపెట్టిన ట్రాయ్.. ఈ నంబర్లను ఏయే కంపెనీలకు ఇచ్చారంటే..
TRAI | టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కొత్త ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, ప్రభుత్వ సంస్థలకు ఇప్పటికే వినియోగంలో ఉన్న 1600 నంబర్ సిరీస్ తరహాలోనే, ఆర్థిక, ప్రభుత్వేతర సంస్థలు చేసే సేవా, లావాదేవీల కాల్స్ కోసం 1601 నంబర్ సిరీస్‌ను అమలు చేయాలని ఆదేశించింది.
Technology | Published On Aug 11, 2026, 11.42 am IST
TRAI | టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కొత్త ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, ప్రభుత్వ సంస్థలకు ఇప్పటికే వినియోగంలో ఉన్న 1600 నంబర్ సిరీస్ తరహాలోనే, ఆర్థిక, ప్రభుత్వేతర సంస్థలు చేసే సేవా, లావాదేవీల కాల్స్ కోసం 1601 నంబర్ సిరీస్‌ను అమలు చేయాలని ఆదేశించింది. వినియోగదారులు నిజమైన సంస్థల నుంచి వచ్చే కాల్స్‌ను సులభంగా గుర్తించడంతోపాటు, వాయిస్ ఆధారిత మోసాలను తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగం, ప్రభుత్వ సంస్థల కోసం 1600 నంబర్ సిరీస్ అమల్లో ఉంది. తాజాగా ఇతర రంగాల్లోని సాధారణ సేవా, లావాదేవీల కాల్స్ కోసం 1601 సిరీస్‌ను తీసుకొచ్చారు. టెలికమ్యూనికేషన్స్ శాఖ కేటాయించిన ఈ నంబర్ సిరీస్‌ను దశలవారీగా అమలు చేయనున్నారు.
అత్యవసర సేవల రంగాలకు..
మొదటి దశలో అత్యవసర సేవలకు సంబంధించిన కొన్ని రంగాలను 1601 సిరీస్ పరిధిలోకి తీసుకురానున్నారు. ఇందులో విద్యుత్ పంపిణీ సంస్థలు, మున్సిపల్ నీటి సరఫరా సంస్థలు, సిటీ గ్యాస్ పంపిణీ నెట్‌వర్క్‌లు, ఎల్పీజీ సరఫరాదారులు, ఇతర సంబంధిత సేవా సంస్థలు ఉంటాయి. అలాగే ఎక్స్‌ప్రెస్ పార్సెల్ డెలివరీ సంస్థలు, కొరియర్ కంపెనీలు, సరుకు రవాణా సంస్థలు కూడా ఈ దశలోకి వస్తాయి. 1601 నంబర్ల కేటాయింపులో కూడా కఠినమైన నిబంధనలు విధించారు. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల ధ్రువీకరణ పూర్తయిన తర్వాత అర్హత కలిగిన వ్యాపార సంస్థలకు నంబర్లను నేరుగా కేటాయించాలి. మధ్యవర్తులు లేదా అగ్రిగేటర్లకు ఈ నంబర్లను కేటాయించడం పూర్తిగా నిషేధించారు.
ప్రమోషన్స్‌కు వాడకూడదు..
1601 నంబర్లను కేవలం సేవా, లావాదేవీలకు సంబంధించిన కాల్స్ కోసం మాత్రమే ఉపయోగిస్తామని సంబంధిత సంస్థలు హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సిరీస్ ద్వారా ప్రమోషనల్ లేదా ప్రచార కాల్స్ చేయడాన్ని పూర్తిగా నిషేధించారు. అంటే డెలివరీ సమాచారం, విద్యుత్ సేవలకు సంబంధించిన సమాచారం, నీటి సరఫరా లేదా ఇతర సేవా అప్‌డేట్ల కోసం మాత్రమే ఈ నంబర్లను వినియోగించాలి. మొదటి దశలో ఎంపిక చేసిన సంస్థల ఆన్‌బోర్డింగ్, 1601 సిరీస్‌కు మార్పు ప్రక్రియను ఆదేశాలు జారీ చేసిన తేదీ నుంచి 90 రోజుల్లోగా పూర్తి చేయాలని టెలికాం ఆపరేటర్లను ట్రాయ్ ఆదేశించింది. ఈ నిర్ణయం ద్వారా సాధారణ 10 అంకెల మొబైల్ నంబర్లను ఉపయోగించి నిజమైన సంస్థలుగా నటించే మోసగాళ్లను అడ్డుకోవచ్చని ట్రాయ్ భావిస్తోంది. ధ్రువీకరించిన సంస్థలకు మాత్రమే 1601 నంబర్లు కేటాయించడం వల్ల సంస్థల పేరుతో జరిగే మోసాలను గుర్తించడం సులభతరం కానుంది.
మోసపూరిత కాల్స్ నుంచి రక్షణ..
అలాగే వినియోగదారులు కాల్ వచ్చినప్పుడు దాని నంబర్ ఆధారంగా అది ధ్రువీకరించిన సేవా సంస్థకు చెందినదా లేదా అన్న విషయాన్ని సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. డెలివరీ సమాచారం, యుటిలిటీ నిర్వహణకు సంబంధించిన సమాచారం వంటి నిజమైన సేవా కాల్స్‌ను ప్రచార లేదా అనుమానాస్పద కాల్స్ నుంచి వేరు చేసేందుకు ఇది ఉపయోగపడనుంది. బ్యాంకింగ్ రంగం కోసం ఇప్పటికే అమల్లో ఉన్న 1600 నంబర్ సిరీస్ భద్రతా విధానాన్ని ఇతర వినియోగదారుల సేవా రంగాలకు విస్తరించడంలో 1601 సిరీస్ కీలక అడుగుగా నిలవనుంది. దశలవారీగా మరిన్ని రంగాలను ఈ వ్యవస్థలోకి తీసుకురావడం ద్వారా సేవా కాల్స్‌కు ఒకే విధమైన నంబరింగ్ ప్రమాణాన్ని ఏర్పాటు చేయాలని ట్రాయ్ లక్ష్యంగా నిర్ణయించుకుంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Sonia Gandhi | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది : సోనియా గాంధీ
- ●Rahul Sipligunj | సింగర్ రాహుల్ సింప్లిగంజ్‌పై కేసు నమోదు - బెదిరింపులకు పాల్పడ్డాడంటూ యువతి ఫిర్యాదు
- ●Gold And Silver Prices Today | బంగారం ధరలకు రెక్కలు.. ఒక్క రోజులోనే రూ.31వేలు జంప్..
- ●Gautam Adani | గౌతమ్ అదానీకి భారీ ఊరట.. అమెరికాలో కేసు కొట్టివేత..
- ●Stock Markets | ముడి చమురు దెబ్బ.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..
- ●Colombia | కొలంబియాలో భారీ భూకంపం.. 132 మంది మృతి

Sonia Gandhi | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది : సోనియా గాంధీ

Rahul Sipligunj | సింగర్ రాహుల్ సింప్లిగంజ్‌పై కేసు నమోదు - బెదిరింపులకు పాల్పడ్డాడంటూ యువతి ఫిర్యాదు

Gold And Silver Prices Today | బంగారం ధరలకు రెక్కలు.. ఒక్క రోజులోనే రూ.31వేలు జంప్..

Gautam Adani | గౌతమ్ అదానీకి భారీ ఊరట.. అమెరికాలో కేసు కొట్టివేత..






