త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chiyaan Vikram | చియాన్ విక్ర‌మ్‌ను చిక్కుల్లో ప‌డేసిన రీల్ – వ‌న్య ప్రాణుల అక్ర‌మ ర‌వాణా ఆరోప‌ణ‌లు

కోలీవుడ్ హీరో చియాన్ విక్ర‌మ్ చిక్కుల్లో ప‌డ్డాడు. విదేశీ జాతికి చెందిన కోతితో దిగిన ఓ వీడియోను ఇటీవ‌ల త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. విక్ర‌మ్ స‌ర‌దాగా చేసిన ఈ పోస్ట్‌పై ఫారెస్ట్ అధికారులు విచార‌ణ చేప‌ట్టారు. విదేశీ కోతిని అక్ర‌మంగా ర‌వాణా చేసుకున్నారంటూ విక్ర‌మ్‌పై ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

N

Entertainment | Published On Aug 11, 2026, 11.46 am IST

Chiyaan Vikram | చియాన్ విక్ర‌మ్‌ను చిక్కుల్లో ప‌డేసిన రీల్ – వ‌న్య ప్రాణుల అక్ర‌మ ర‌వాణా ఆరోప‌ణ‌లు
Advertisement

Chiyaan Vikram | కోలీవుడ్ హీరో చియాన్ విక్ర‌మ్ చిక్కుల్లో ప‌డ్డారు. సోష‌ల్ మీడియాలో స‌ర‌దాగా చేసిన ఓ రీల్ వైర‌ల్ కావ‌డంతో ఫారెస్ట్ అధికారులు విచార‌ణ మొద‌లుపెట్టారు. అరుదైన విదేశీ జాతికి చెందిన ఓ కోతితో క‌లిసి దిగిన ఓ వీడియోను విక్ర‌మ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో కోతి హావ‌భావాల‌ను ఇమిటేట్ చేస్తూ విక్ర‌మ్ క‌నిపించాడు. కోతి ఎలా చేస్తే విక్ర‌మ్ అలాంటి ఎక్స్‌ప్రెష‌న్స్ పెట్టాడు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. స‌ర‌దాగా చేసిన ఈ వీడియో విక్ర‌మ్‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ వీడియోపై కొంద‌రు వైల్డ్‌లైఫ్ అధికారుల‌కు ఫిర్యాదుచేశారు. విదేశాల‌కు చెందిన అరుదైన‌ కోతి విక్ర‌మ్ ఇంట్లోకి ఎలా వ‌చ్చింది? ఎలాంటి కామెంట్లు పెట్టారు. ఈ వీడియోపై విమ‌ర్శ‌లు రావ‌డంతో విక్ర‌మ్ డిలీట్‌ చేశాడు.

ఫారెస్ట్ అధికారుల విచార‌ణ

ఈ వీడియో ఆధారంగా ఫారెస్ట్ అధికారులు విచార‌ణ మొద‌లుపెట్టిన‌ట్లు స‌మాచారం. ఆ వీడియో విక్ర‌మ్ ఇంట్లో తీసింది కాద‌ని స‌మాచారం. అత‌డి కూతురు అత్తింటిలో తీసిన‌ద‌ని గుర్తించిన‌ట్లు తెలిసింది. త‌న వియ్యంకుడు , బిజినెస్‌మెన్ సీకే రంగ‌నాథ‌న్ ఇంటికి వెళ్లిన టైమ్‌లో కోతితో విక్ర‌మ్ ఆ రీల్ చేశార‌ని అంటున్నారు. రంగ‌నాథ‌న్ ఆ కోతి ఎక్క‌డ కొనుగోలు చేశారు? వాటి వెనుక ఏదైనా వ‌న్య‌ప్రాణుల అక్ర‌మ ర‌వాణా ముఠా హ‌స్తం ఉందా? అని అధికారులు ఇన్వేస్టిగేష‌న్ చేస్తున్న‌ట్లుస‌మాచారం. విక్ర‌మ్‌తో పాటు సీకే రంగ‌నాథ‌న్‌ను విచారించ‌నున్న‌ట్లు చెబుతున్నారు.

ఏడాది గ్యాప్ త‌ర్వాత‌....

గ‌త ఏడాది రిలీజైన వీర‌ధీర శూర‌న్ త‌ర్వాత సినిమాల‌కు ఏడాది పాటు గ్యాప్ ఇచ్చిన విక్ర‌మ్ ఇటీవ‌లే ఆనంద్ శంక‌ర్ డైరెక్ష‌న్‌లో ఓ యాక్ష‌న్ మూవీని అంగీక‌రించాడు. స‌ర్వంమాయ ఫేమ్ రియా శిబు ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించ‌బోతుంది.

 

Advertisement
Advertisement