BRSV | విద్యా కమిషన్ సిఫారసు 18 శాతం.. కేటాయింపు 8 శాతమా? : బీఆర్ఎస్‌వీ
BRSV | విద్యా రంగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నారని బీఆర్ఎస్‌వీ (BRSV) రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ (Gellu Srinivas Yadav) విమర్శించారు. విద్యా కమిషన్ (Education Commission) చైర్మన్ ఆకునూరి మురళి సిఫారసులకు సీఎం విలువ ఇవ్వలేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
- జాబ్ క్యాలెండర్ మాట తప్పిన సీఎం
- ప్రియాంక గాంధీ ప్రచార హామీకి విలువ ఇవ్వని రేవంత్ రాజీనామా చేయాలి
-అసెంబ్లీ ముట్టడిలో బీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్
త్రినేత్ర.న్యూస్: విద్యా రంగాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నారని బీఆర్ఎస్‌వీ (BRSV) రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ (Gellu Srinivas Yadav) విమర్శించారు. విద్యా కమిషన్ (Education Commission) చైర్మన్ ఆకునూరి మురళి సిఫారసులకు సీఎం విలువ ఇవ్వలేదని మండిపడ్డారు. రెండు లక్షల ఉద్యోగాలతో కూడిన జాబ్ కాలెండర్ అమలు చేయాలని, ప్రియాంక గాంధీ ప్రచార హామీకి విలువ ఇవ్వని సీఎం రేవంత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో మంగళవారం అసెంబ్లీ ముట్టడి (Assembly siege) కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ విద్యారంగంపై నిర్లక్ష్యం వీడాలని డిమాండ్ చేశారు.
80 శాతం ఫీజు బకాయిలు..
బడ్జెట్ లో విద్యకు 18% ఇవ్వాలని కమిషన్ సిఫారసు చేసినా ప్రభుత్వం 8 శాతానికే పరిమితం చేయడం దారుణమన్నారు. గత సంవత్సరం బడ్జెట్ లో పెట్టిన ఫీజు రీయంబర్స్ మెంట్ ను 80% విడుదల చేయలేదని మండిపడ్డారు. బకాయిలు 8 వేల కోట్లు ఉంటే బడ్జెట్ లో 4 వేల కోట్లే కేటాయింపులు చేసి విద్యార్థులను, కళాశాల యాజమాన్యాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు. విద్యాశాఖ కేటాయింపుల్లో 18 వేల కోట్లు జీతాలకు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల కోసం 5 వేల కోట్ల కేటాయింపు మిగిలే ఉందన్నారు. గత 2025-26 బడ్జెట్లో విద్యా శాఖకు 23,108 కేటాయించారన్నారు. యంగ్ ఇండియా స్కూల్స్ కి కేటాయింపులు మినహాయిస్తే ఈ బడ్జెట్ లో 3 వేల కోట్లు తగ్గించారని గుర్తుచేశారు.
విద్యార్థుల ఫీజు రీయంబర్స్ మెంట్ 10 వేల కోట్ల బకాయిల ప్రస్తావన బడ్జెట్ కేటాయింపులో లేకపోవడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. పెరిగిన ధరలకు అనుగుణనంగా కాలేజీ యాజమాన్యాలకు ఫీజు పెంచుకునే అవకాశం ఇచ్చిన ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయంబర్స్ మెంట్స్ పెంచాలనే ఆలోచన చేయకపోవడం విద్యార్థి వ్యతిరేకతకు నిదర్శనమన్నారు.
జాబ్ క్యాలెండర్ ఏమైంది?
స్కూల్ విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, పాలు, జావా ఇవ్వటం కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిందేనని.. 500 కోట్లతో 3 వేల పాఠశాలల్లో ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఇది కాంగ్రెస్ పథకం కాదన్నారు. ఈ బడ్జెట్లో విద్యానిధి పథకం పెట్టలేదని, 5 లక్షల విద్యా రుణం హామీ ఊసేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 18 సంవత్సరాలు నిండిన బాలికలకు స్కూటీ పథకం ఏమైందని ప్రశ్నించారు.

నాయకుల అరెస్టు..
అంతకు ముందు బీఆర్ఎస్‌వీ (BRSV) విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అసెంబ్లీ వద్ద BRSV రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాద్యక్షుడు తుంగబాలు తదితరులను అరెస్ట్ చేసి పంజాగుట్ట, నాంపల్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
తాజావార్తలు
- ●KCR | ఆప్త మిత్రున్ని కోల్పోయా.. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి
- ●Peddi Sudarshan Reddy | నల్లబెల్లికి పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయం.. మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు
- ●Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత
- ●Horoscope | జూలై 31 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!
- ●Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ
- ●criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా

KCR | ఆప్త మిత్రున్ని కోల్పోయా.. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి

Peddi Sudarshan Reddy | నల్లబెల్లికి పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయం.. మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు

Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

Horoscope | జూలై 31 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!






