Ponnam Prabhakar | తెలంగాణలో 15 ఏళ్లు దాటిన పాత వాహనాలు 49 లక్షలు: పొన్నం
Ponnam Prabhakar | స్క్రాపేజీ పాలసీ (Scrappage policy)ని 2024, సెప్టెంబర్ నుంచి విజయవంతంగా అమలు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. ఈ పాలసీపై శాసన మండలి (Legislative Council) లో మంగళవారం సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.
త్రినేత్ర.న్యూస్: స్క్రాపేజీ పాలసీ (Scrappage policy)ని 2024, సెప్టెంబర్ నుంచి విజయవంతంగా అమలు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. ఈ పాలసీపై శాసన మండలి (Legislative Council) లో మంగళవారం సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. రాష్ట్రంలో 3 వెహికిల్ స్క్రాపింగ్ సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు (Kotthuru) , సిద్దిపేట జిల్లా వర్గల్ (Wargal), సంగారెడ్డి జిల్లా పాశమైలారం(Pashamailaram) లో వెహికిల్ స్క్రాపింగ్ సౌకర్యాలు ఉన్నాయన్నారు. పాత వాహనాలు స్క్రాపింగ్ ప్రోత్సహించడానికి లయబిలిటీ మాఫీ, పన్ను రాయితీలు కూడా ప్రభుత్వం మంజూరు చేస్తుందని పేర్కొన్నారు.
15 ఏండ్లు దాటితే...
ఈ పాలసీ ద్వారా స్క్రాపేజీని ప్రోత్సహించడానికి పాత వాహనంపై ఉన్న పన్ను బకాయిలు రద్దు, వాహనం కొన్నప్పుడు టాక్స్ కన్షేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. ఆర్టీసీలో 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్క్రాపేజీకి పంపిస్తున్నామని పేర్కొన్నారు. వాటి స్థానంలో ఎప్పటికప్పుడు కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఎప్పటికప్పుడు ప్రత్యేక డ్రైవ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 15 ఏండ్లు దాటిన స్కూల్ బస్సులకు అనుమతి లేదన్నారు.
71.14 కోట్లు వసూలు...
కొత్త వాహనాలు కొన్నప్పుడు టాక్స్ కన్సేషన్ మోటార్ సైకిల్ కు 5 వేలు, కార్లకు 50 వేల వరకు, రవాణా వాహనాలకు 19 శాతం పన్ను మినహాయింపు ఉంటుందని చెప్పారు. ఇప్పటి వరకు 6,278 వాహనాలను మరమ్మతులకు పంపించామన్నారు. గ్రీన్ టాక్స్ 2006లో అమల్లోకి రాగా 2022 లో పెంచినట్లు తెలిపారు. 2025-26లో దాదాపు 2 లక్షల వాహనాల నుంచి గ్రీన్ టాక్స్ 71.14 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. 2024-25లో గ్రీన్ టాక్స్ 68.11 కోట్లు వసూలైనట్లు చెప్పారు.
ప్రజాప్రతినిధులకు ఈవీ వాహనాలు...
Rvsf లు 2025 నుంచి పని చేస్తున్నాయని.. గత ఏడాది 4,285 వాహనాలను స్క్రాప్ చేయగా అందులో ప్రైవేట్ వాహనాలు దాదాపు 2 వేల వరకు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 15 సంవత్సరాల దాటిన పాత వాహనాలు 48 లక్షల 98 వేల వరకు ఉన్నట్లు సమాధానమిచ్చారు. కేవలం హైదరాబాద్ లోనే 16 లక్షలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా స్క్రాపేజీ పాలసీ ఎందుకు తీసుకురాలేదని సభ్యులను ప్రశ్నించారు. రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఈవీ వాహనాలు కొనడం కోసం లోన్స్ నిమిత్తం ప్రత్యేక చొరవ తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈవీ పాలసీలో భాగంగా వాహనాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వ ఉద్యోగులకు సైతం 15-20 శాతం డిస్కౌంట్ ఇచ్చేలా కంపెనీలు ముందుకొస్తున్నాయని పొన్నం పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar | రూ.12 కోట్లతో గుడి చెరువు బండ్ పార్క్ నిర్మాణం.. అట్టహాసంగా ప్రారంభించిన మంత్రులు
జులై 30, 2026

Giri Pradakshina | కొండగట్టు అంజన్న ఆలయంలో గిరి ప్రదక్షిణ.. పాల్గొన్న మంత్రులు.. ఫొటోలు
జులై 29, 2026

Prajavani | ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొన్నం ప్రభాకర్
జులై 28, 2026
తాజావార్తలు
- ●KCR | ఆప్త మిత్రున్ని కోల్పోయా.. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి
- ●Peddi Sudarshan Reddy | నల్లబెల్లికి పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయం.. మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు
- ●Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత
- ●Horoscope | జూలై 31 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!
- ●Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ
- ●criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా

KCR | ఆప్త మిత్రున్ని కోల్పోయా.. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి

Peddi Sudarshan Reddy | నల్లబెల్లికి పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయం.. మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు

Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

Horoscope | జూలై 31 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!



