AWS Data Center | బహ్రెయిన్‌లోని AWS డేటా సెంటర్‌పై మరోసారి దాడి
AWS Data Center | అమెజాన్ (Amazon)కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS)పై మరోసారి దాడి జరిగింది. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది.
AWS Data Center | అమెజాన్ (Amazon)కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS)పై మరోసారి దాడి జరిగింది. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం కారణంగా బహ్రెయిన్ (Bahrain)లోని తమ వెబ్ సర్వీసెస్ సేవలకు అంతరాయం ఏర్పడినట్లు అమెజాన్ తెలిపింది. ఈ ప్రాంతంలో డ్రోన్ల కార్యకలాపాల (drone activity) వల్లే ఈ అంతరాయం ఏర్పడినట్లు అమెజాన్ ప్రతినిధి ఒకరు రాయిటర్స్‌కు తెలిపారు.
అయితే, ఎంత మేర నష్టం జరిగిందన్నది, ఈ అంతరాయం ఎన్నిరోజులు కొనసాగుతుందన్నది మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అంతేకాదు, ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తమ ఉద్యోగులకు అమెజాన్ సూచించింది.
ఇక యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బహ్రెయిన్‌లోని డేటా సెంటర్లపై దాడులు జరగడం ఇది రెండోసారి. ఈ నెల ప్రారంభంలో కూడా బహ్రెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని సౌకర్యాలపై డ్రోన్ దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నట్లు అమెజాన్ అప్పట్లో ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని తన ఒక డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేయాల్సి వచ్చిందని వెల్లడించింది. ఇప్పుడు మరోసారి దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read..
గద్దర్ అవార్డుల ఫంక్షన్‌లో ఆర్టిస్టుల ఖర్చే రూ.4 కోట్లు : దాసోజు శ్రవణ్
అధికారిక శిలాఫలకాలపై ఓడిపోయిన నాయకుల పేర్లా..? : ఎమ్మెల్యే తలసాని
హైదరాబాద్ పట్ల నిర్లక్ష్య వైఖరి సరికాదు : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●KCR | ఆప్త మిత్రున్ని కోల్పోయా.. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి
- ●Peddi Sudarshan Reddy | నల్లబెల్లికి పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయం.. మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు
- ●Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత
- ●Horoscope | జూలై 31 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!
- ●Ramayana | రామాయణలో హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు - సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ
- ●criminal waste| ఇంజనీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అంటావా

KCR | ఆప్త మిత్రున్ని కోల్పోయా.. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి

Peddi Sudarshan Reddy | నల్లబెల్లికి పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయం.. మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు

Peddi Sudarshan Reddy | బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

Horoscope | జూలై 31 రాశి ఫలాలు.. ఈ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి!






