Donald Trump | అమెరికా-కెనడా ట్రేడ్ వార్.. సరస్సు పేరు మార్చిన ట్రంప్
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా-కెనడా సరిహద్దుల్లో ఉన్న ఆంటారియో సరస్సు (Lake Ontario)ను లేక్ అమెరికాగా (Lake America) మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.
International | Published On Aug 28, 2026, 12.21 pm IST
Donald Trump | త్రినేత్ర.న్యూస్ : కెనడాతో ట్రేడ్ డీల్ చివరి నిమిషంలో రద్దుకావడంపై అసహనంతో ఉన్న.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా-కెనడా సరిహద్దుల్లో ఉన్న ఆంటారియో సరస్సు (Lake Ontario)ను లేక్ అమెరికాగా (Lake America) మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. పేరు మార్పుకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. ఈ సరస్సు పేరు మార్పు ఆలోచన ఎప్పటి నుంచో తన మనసులో ఉందని ట్రంప్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ సరస్సు పేరు మార్పు తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పారు.
అమెరికా, కెనడా దేశాల మధ్య కొన్నిరోజులుగా వాణిజ్య యుద్ధం (America-Canada trade war) నడుస్తున్న వేళ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ట్రంప్ నిర్ణయాన్ని కెనడా తీవ్రంగా వ్యతిరేకించింది. అమెరికా మారుతోందని తమకు తెలుసునంటూ కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) వ్యాఖ్యానించారు. యూఎస్ వాణిజ్య సంబంధాలు, విదేశాంగ విధానాలు, జాతీయ స్మారక చిహ్నాలు, జలాశయాల పేర్లు ఇలా చాలానే మారుతున్నట్లు చెప్పారు. కెనడా, అమెరికా ఏర్పడకముందే ఈ సరస్సు పేరు ఆంటారియోగా ఉందని గుర్తు చేశారు. ఎప్పటికీ అది అలాగే ఉంటుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఇదీ చదవండి.. కెనడా సంచలన నిర్ణయం.. అమెరికాతో వాణిజ్య చర్చలు నిలిపివేత
కాగా, అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య చర్చలను కెనడా తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. అమెరికా ప్రతిపాదించిన నిబంధనల్లో చివరి నిమిషంలో చేసిన మార్పులు అన్యాయమైనవి, ఆర్థికంగా అనుకూలం కానివిగా ఉన్నాయని కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ పేర్కొన్నారు. అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించే వ్యూహాన్ని కెనడా కొనసాగిస్తుందని కార్నీ స్పష్టం చేశారు. దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు ఇతర దేశాలతో వాణిజ్యాన్ని విస్తరించనున్నట్లు చెప్పారు. ట్రేడ్ డీల్ చివరి నిమిషంలో రద్దు కావడంతో ఆగ్రహానికి గురైన ట్రంప్.. కెనడాపై 50 శాతం సుంకాలను బాదారు. ఇప్పుడు ఆంటారియో సరస్సు పేరును మార్చారు.
Also Read..
వరద రూపంలో తరుముకొచ్చిన మృత్యువు.. పరుగులు తీసిన జనం.. షాకింగ్ వీడియో
తమిళనాడు చరిత్రలోనే తొలిసారి.. అసెంబ్లీలో సీఎం సీటును వదిలి మంత్రులతో కూర్చున్న విజయ్
గ్రాండ్ చెస్ టూర్‌లో చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా ఘనత
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Revanth Reddy | సీఎం రేవంత్‌కు రాఖీ కట్టిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క
- ●Nepal Flash Floods | వరద రూపంలో తరుముకొచ్చిన మృత్యువు.. పరుగులు తీసిన జనం.. షాకింగ్ వీడియో
- ●TGSRTC | రాఖీ పండుగ.. స్పెషల్ బస్సుల్లో ఆర్టీసీ అదనపు బాదుడు
- ●CM Vijay | తమిళనాడు చరిత్రలోనే తొలిసారి.. అసెంబ్లీలో సీఎం సీటును వదిలి మంత్రులతో కూర్చున్న విజయ్
- ●Gold And Silver Prices Today | పెట్టుబడిదారులకు అలర్ట్.. ఒక్క రోజులోనే రూ.31వేలు తగ్గిన బంగారం ధర..
- ●Praggnanandhaa | గ్రాండ్ చెస్ టూర్‌లో చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. తొలి భారతీయుడిగా ఘనత

Revanth Reddy | సీఎం రేవంత్‌కు రాఖీ కట్టిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క

Nepal Flash Floods | వరద రూపంలో తరుముకొచ్చిన మృత్యువు.. పరుగులు తీసిన జనం.. షాకింగ్ వీడియో

TGSRTC | రాఖీ పండుగ.. స్పెషల్ బస్సుల్లో ఆర్టీసీ అదనపు బాదుడు

CM Vijay | తమిళనాడు చరిత్రలోనే తొలిసారి.. అసెంబ్లీలో సీఎం సీటును వదిలి మంత్రులతో కూర్చున్న విజయ్






