త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hero Nani | దుల్క‌ర్ స‌ల్మాన్ హీరో – నాని ప్రొడ్యూస‌ర్ – కొత్త కాంబో ఫిక్స్‌

టాలీవుడ్‌లో మ‌రో కొత్త కాంబో ఫిక్స‌య్యింది. దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా నాని నిర్మాత‌గా ఓ సినిమా రాబోతుంది. ఎమోష‌న‌ల్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి కోర్ట్ ఫేమ్ జ‌గ‌దీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.

N

Entertainment | Published On Nov 19, 2026, 10.23 am IST

Hero Nani | దుల్క‌ర్ స‌ల్మాన్ హీరో – నాని ప్రొడ్యూస‌ర్ – కొత్త కాంబో ఫిక్స్‌
Advertisement

Hero Nani | ఓ వైపు హీరోగా బిజీగా ఉంటూనే మ‌రోవైపు ప్రొడ్యూస‌ర్‌గా గ్యాప్ లేకుండా సినిమాల‌ను ప‌ట్టాలెక్కిస్తున్నారు నాచుర‌ల్ స్టార్ నాని. నితిన్ హీరోగా న‌టిస్తున్న అలియాస్ రుక్మిణికి నాని నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. డిసెంబ‌ర్ 4న ఈ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. తాజాగా నాని బ్యాన‌ర్ నుంచి మ‌రో సినిమా రాబోతుంది.

కోర్ట్ డైరెక్ట‌ర్‌తో...

గ‌త కొన్నేళ్లుగా దుల్క‌ర్ స‌ల్మాన్ మాతృభాష మ‌ల‌యాళంలో కంటే హీరోగా తెలుగులోనే ఎక్కువ‌గా సినిమాలు చేస్తున్నారు. అత‌డు హీరోగా న‌టించిన ఆకాశంలో ఒక తార న‌వంబ‌ర్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.
తాజాగా తెలుగులో అత‌డు మ‌రో డిఫ‌రెంట్ స్టోరీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారు. కోర్ట్ ఫేమ్ జ‌గ‌దీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ సినిమాకు హీరో నాని నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారు.

బైలింగ్వ‌ల్‌...

తెలుగు, మ‌ల‌యాళ భాష‌ల్లో బైలింగ్వ‌ల్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీస‌ర్‌గా దుల్క‌ర్ స‌ల్మాన్ క‌నిపించ‌నున్న‌ట్లు స‌మాచారం. సివిల్ స‌ర్వీసెస్ సాధించే క్ర‌మంలో ఓ యువ‌కుడు సాగించిన ప్ర‌యాణం నేప‌థ్యంలో ఎమోష‌న‌ల్ డ్రామాగా ఈ మూవీ రూపొంద‌నున్న‌ట్లు చెబుతోన్నారు. దుల్క‌ర్ సినిమాకు సంబంధించి ఇప్ప‌టికే స్క్రిప్ట్ వ‌ర్క్ మొత్తం పూర్త‌యిన‌ట్లు తెలిసింది. డిసెంబ‌ర్‌లో ఈ సినిమాపై అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ రానుంద‌ని అంటున్నారు.

గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్‌...

ప్ర‌స్తుతం హీరోగా నాని బ్ల‌డీ రోమియో సినిమా చేస్తున్నాడు. గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి సుజీత్ ద‌ర్వ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బ్ల‌డీ రోమియో త‌ర్వాత వెంకీ అట్లూరితో నాని ఓ సినిమా చేయ‌నున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

 

Advertisement
Advertisement