Kim Jong Un | యుద్ధ ట్యాంకును నడిపిన కిమ్ కుమార్తె
Kim Jong Un | ఉత్తర కొరియా (North Korea) అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) కుమార్తె 13 ఏళ్ల జు యే (Ju Ae) మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచారు. తన తండ్రితో కలిసి యుద్ధ ట్యాంకులో ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు.
International | Published On Mar 20, 2026, 3.22 pm IST
Kim Jong Un | ఉత్తర కొరియా (North Korea) అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) కుమార్తె 13 ఏళ్ల జు యే (Ju Ae) మరోసారి హెడ్‌లైన్స్‌లో నిలిచారు. తన తండ్రితో కలిసి యుద్ధ ట్యాంకులో ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు. జు యేనే స్వయంగా ఆర్మీ ట్యాంక్‌ను డ్రైవ్ చేస్తుండగా.. ఆమె పక్కనే తండ్రి కిమ్ కూర్చుని ఉన్నారు. వీరితోపాటూ మరో ముగ్గురు ఆర్మీ అధికారులు కూడా యుద్ధ ట్యాంకులో ప్రయాణిస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉత్తర కొరియా అధికారిక మీడియా కేసీఎన్ఏ (KCNA) రిలీజ్ చేసింది. ఈ ఫొటోల్లో తండ్రీ కుమార్తె ఇద్దరూ ఒకే రకమైన కోట్‌ను ధరించి కనిపించారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కిమ్ వారసురాలు ఆమెనే..
కాగా, కిమ్ తన వారసురాలిగా జు యేను ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కిమ్ తన కుమార్తెనే దేశాధినేతగా నిర్ణయించారని దక్షిణ కొరియాకు చెందిన నిఘా సంస్థ ‘నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్’ ఇటీవలే ప్రకటించింది. అయితే ఈ విషయాన్ని కిమ్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. గత కొంతకాలంగా జు యే తన తండ్రితో కలిసి పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ అంతర్జాతీయ మీడియాను ఆకర్షిస్తున్నారు.
జుయే అంటే కిమ్‌కు చాలా ఇష్టం..
2009లో రి సోల్ జుతో కిమ్‌కు వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అయితే, ముగ్గురు పిల్లల్లో కేవలం కుమార్తె జు యే గురించి మాత్రమే బయట ప్రపంచానికి తెలుసు. మిగతా వారి గురించి పెద్దగా ప్రపంచానికి తెలియదు. జుయే అంటే కిమ్‌కు చాలా ఇష్టమట. 2022లో తొలిసారి జుయేని కిమ్ ప్రపంచానికి పరిచయం చేశారు. అప్పటి నుంచి తండ్రితోపాటూ పలు అధికారిక కార్యక్రమాల్లో జుయే పాల్గొంటూ వస్తున్నారు. అప్పటి నుంచే కిమ్ వారసురాలు జుయే అని స్థానిక మీడియా పేర్కొంది.
ఇక ఇటీవలే ఆమెను తొలిసారి విదేశీ పర్యటనకు కూడా తీసుకెళ్లారు కిమ్. గతేడాది సెప్టెంబర్ 2న చైనా పర్యటనకు తీసుకెళ్లారు. చైనా విజయోత్సవాల సందర్భంగా జరిగిన సైనిక కవాతుకు వీరు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాల్గొన్నారు. ఇలాంటి హై ప్రొఫైల్ ఈవెంట్‌లో ఆమె పాల్గొనడాన్ని బట్టి కిమ్ జోంగ్ ఉన్ తన వారసురాలిగా ఆమెను పరిచయం చేస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉత్తర కొరియాకు కాబోయే నేత ఆమే అన్న సందేహాలు నెలకొన్నాయి.
Also Read..
ఫేస్‌బుక్‌లో క్రియేటర్లకు మెటా బంపర్ ఆఫర్.. నెలకు 3వేల డాలర్లను పొందవచ్చు..
నక్సలిజం నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన విధానం దేశానికే ఆదర్శం : భట్టి విక్రమార్క
టాలీవుడ్ హీరోలపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్ - కారణమిదే?
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






