Meta | ఫేస్‌బుక్‌లో క్రియేటర్లకు మెటా బంపర్ ఆఫర్.. నెలకు 3వేల డాలర్లను పొందవచ్చు..
Meta | కంటెంట్ క్రియేటర్లకు ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. కొత్తగా క్రియేటర్ ఫాస్ట్ ట్రాక్ అనే ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టినట్లు మెటా తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా ఫేస్‌బుక్‌లో క్రియేటర్లు తమ ఫాలోవర్లను సులభంగా పెంచుకోవడమే కాకుండా, తమ కంటెంట్ ద్వారా మరింత ఆదాయం పొందవచ్చు.
Technology | Published On Mar 20, 2026, 2.49 pm IST
Meta | కంటెంట్ క్రియేటర్లకు ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. కొత్తగా క్రియేటర్ ఫాస్ట్ ట్రాక్ అనే ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టినట్లు మెటా తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా ఫేస్‌బుక్‌లో క్రియేటర్లు తమ ఫాలోవర్లను సులభంగా పెంచుకోవడమే కాకుండా, తమ కంటెంట్ ద్వారా మరింత ఆదాయం పొందవచ్చు. ఇప్పటికే ఇతర ప్లాట్‌ఫామ్‌లలో క్రియేటర్లుగా ఉన్న కొత్త యూజర్లతోపాటు ఫేస్‌బుక్‌లో క్రియేటర్‌గా ఉండి ఆ అకౌంట్‌ను సరిగ్గా వాడని వారు లేదా రిటర్న్ వచ్చే యూజర్లకు ఈ కార్యక్రమం అందుబాటులో ఉందని మెటా తెలిపింది. ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్‌లో క్రియేటర్లకు మరింత రీచ్ అందిస్తామని, వారు ఎక్కువ ఆదాయం పొందేలా చేస్తామని మెటా స్పష్టం చేసింది. ఇందుకు నగదు ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్నట్లు తెలియజేసింది.
3 నెలలపాటు కచ్చితంగా నగదు చెల్లింపులు..
ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్‌లో క్రియేటర్లు ఎక్కువ కంటెంట్‌ను పోస్ట్ చేసేందుకు గాను ప్రమోషన్‌లో భాగంగా మెటా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా అర్హత కలిగిన క్రియేటర్లు పోస్టు చేసే రీల్స్‌కు అధిక రీచ్‌ను ఇస్తారు. దీంతో ఫాలోవర్ల సంఖ్య కూడా వేగంగా పెరుగుతుంది. అలాగే ఫేస్‌బుక్ కంటెంట్ రూల్స్‌కు అనుగుణంగా రీల్స్‌ను పోస్ట్ చేస్తే 3 నెలల పాటు కచ్చితమైన హామీతో నగదు చెల్లింపులు చేస్తామని మెటా తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఉన్న యూజర్లు కొత్తగా ఫేస్‌బుక్‌కు వస్తే వారికి ఆయా ప్లాట్‌ఫామ్‌లలో ఉన్న ఫాలోవర్ల సంఖ్యను బట్టి పేమెంట్లు ఇవ్వనున్నారు. ఇక ఇప్పటికే ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఉండడంతోపాటు కంటెంట్ మానెటైజేషన్‌తో రీల్స్ లేదా వీడియోలు, ఇతర కంటెంట్ పోస్ట్ చేస్తున్న వారు కూడా దీనికి అర్హులని మెటా తెలియజేసింది. కానీ అలాంటి క్రియేటర్లకు కనీసం 1 లక్ష మంది ఫాలోవర్లు ఉండాలని మెటా స్పష్టం చేసింది.
1వేయి, 3వేల డాలర్లను ఇలా ఇస్తారు..
ఫేస్‌బుక్‌లో లేదా ఇతర సోషల్ ప్లాట్‌ఫామ్‌లలో 1 లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నవారికి క్రియేటర్ ఫాస్ట్ ట్రాక్ ప్రోగ్రామ్ ద్వారా 3 నెలల పాటు నెలకు 1000 డాలర్ల చొప్పున పేమెంట్ అందజేస్తామని మెటా తెలిపింది. 10 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్న క్రియేటర్లకు నెలకు 3000 డాలర్లను అందిస్తామని తెలిపింది. అయితే కొత్తగా ఫేస్‌బుక్‌కు వచ్చే యూజర్లకు ఇతర ప్లాట్‌ఫామ్‌లలో ముందు చెప్పినట్లు ఫాలోవర్లు ఉంటే వారికి ఫేస్‌బుక్‌లో ఈ ప్రోగ్రామ్ ద్వారా నేరుగా కంటెంట్ మానెటైజేషన్‌ను ఇస్తారు. దీంతో 3 నెలల తరువాత కూడా క్రియేటర్లు తమ కంటెంట్ ను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయవచ్చు.

ఫేస్‌బుక్ రీల్స్ ద్వారా మెటాకు అధిక ఆదాయం..
కాగా మెటా తెలిపిన ప్రకారం 2025లో ఫేస్‌బుక్‌లో క్రియేటర్లకు దాదాపు 3 బిలియన్ డాలర్లను చెల్లించింది. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 35 శాతం అధికం కాగా అందులో 60 శాతం చెల్లింపులు రీల్స్ ద్వారానే వచ్చినట్లు తెలిపింది. ఇక మిగిలిన భాగం మొత్తం స్టోరీస్, ఫొటోలు, టెక్ట్స్ పోస్టులకు చెల్లించామని వెల్లడించింది. సంవత్సరానికి 10వేల డాలర్లకు పైగా సంపాదించే క్రియేటర్ల సంఖ్య ఫేస్‌బుక్‌లో 30 శాతం కన్నా ఎక్కువగా పెరిగిందని పేర్కొంది. అయితే ప్రస్తుతం ఫేస్‌బుక్‌లో మెటా అందిస్తున్న ఈ కొత్త ప్రోగ్రామ్ ఎంపిక చేసిన క్రియేటర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అర్హత కలిగిన యూజర్లకు ఈ ప్రోగ్రామ్‌లో రిజిస్టర్ చేసుకోవాలని ఫేస్‌బుక్ మెయిల్స్ పంపిస్తోంది. ఇప్పటికే ఫేస్‌బుక్‌లో క్రియేటర్లుగా ఉన్నవారు అర్హత ప్రమాణాలతో ఉంటే వారికి తమ డ్యాష్‌బోర్డులో ఈ ప్రోగ్రామ్‌కు ఆహ్వానం కనిపిస్తుందని మెటా తెలిపింది.
ఎలా చెక్ చేయాలి..
ఫేస్‌బుక్ మొబైల్ యాప్ లేదా డెస్క్‌టాప్‌లో లాగిన్ అయి అందులో ఉండే ప్రొఫెనల్ డ్యాష్‌బోర్డ్ అనే సెక్షన్‌ను ఓపెన్ చేసి, దాంట్లో కనిపించే కంటెంట్ మానెటైజేషన్ అనే విభాగంలోకి వెళితే అక్కడ ఇన్విటేషన్ కనిపిస్తుంది. దాన్ని అంగీకరించి రిక్వెస్ట్ చేస్తే ఈ ప్రోగ్రామ్‌లోకి తీసుకుంటారు. తరువాత రీల్స్‌ను క్రియేట్ చేసి క్రియేటర్లు రీచ్‌ను, ఫాలోవర్లను పెంచుకోవడంతోపాటు నెల నెలా ఆదాయం కూడా పొందవచ్చు. ఫేస్‌బుక్‌లో క్రియేటర్ ఎకోసిస్టమ్‌ను మరింత బలోపేతం చేయడంతోపాటు కంటెంట్ ద్వారా అధిక ఆదాయం పొందాలని మెటా భావిస్తోంది. అందుకనే ఈ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. అర్హత ఉన్నవారు తమ ఫేస్‌బుక్ అకౌంట్‌ను చెక్ చేస్తే వివరాలను పొందవచ్చు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






