Pawan Kalyan | టాలీవుడ్ హీరోలపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్ – కారణమిదే?
రణవీర్‌సింగ్ ధురంధర్ 2పై టాలీవుడ్ స్టార్స్ ప్రశంసలు కురిపించారు. మహేష్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో పాటు పలువురు అగ్ర కథానాయకులు ఈ సినిమాపై అద్భుతమంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు, ట్వీట్స్ పెట్టారు. ధురంధర్ 2తో పాటు గురువారం రిలీజైన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్‌ను మాత్రం పట్టించుకోకపోవడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
Entertainment | Published On Mar 20, 2026, 1.54 pm IST
Pawan Kalyan | రణవీర్‌సింగ్ హీరోగా నటించిన ధురంధర్ 2 మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడాలు లేకుండా అన్ని భాషల ఆడియెన్స్‌ను ఈ మూవీ మెప్పిస్తోంది. సినీ లవర్స్ మాత్రమే కాకుండా స్టార్ హీరోలు, డైరెక్టర్లు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రణవీర్‌సింగ్ యాక్టింగ్, ఆదిత్య ధర్ టేకింగ్‌పై అద్భుతమంటూ కామెంట్లు పెడుతోన్నారు.
మహేష్ బాబు...అల్లు అర్జున్...
టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ధురంధర్ 2 మూవీకి ఫిదా అయ్యారు. మహేష్‌బాబు, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్ వంటి హీరోలు ధురంధర్ 2పై సినిమాను చూడటమే కాకుండా రణవీర్‌సింగ్ యాక్టింగ్, ఆదిత్య ధర్ టేకింగ్, మేకింగ్ నెక్స్ట్ లెవల్ అంటూ ట్వీట్స్ చేశారు. ఇలాంటి కథతో సినిమా చేసిన దర్శకుడి విజన్, ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ అభినందనలతో ముంచెత్తారు.
ఉస్తాద్‌ను పట్టించుకోలేదా?
ధురంధర్ 2తో పాటు గురువారం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీ కూడా రిలీజైంది. అయితే ఈ సినిమాపై ఒక్క తెలుగు హీరో కూడా పాజిటివ్‌గా ట్వీట్ వేయలేదు. ఈ సినిమా బాగుందనో, చూశామనో పోస్ట్‌లు పెట్టలేదు. దాంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ టాలీవుడ్ హీరోలపై ఫైర్ అవుతున్నారు. బాలీవుడ్ మూవీని తెగ పొగుడుతూ తెలుగు హీరో సినిమాను ...అందులోనూ పవన్ కళ్యాణ్ మూవీని పట్టించుకోకపోవడం దారుణమని అంటున్నారు.
బెనిఫిట్ షోలకు కావాలి...
సినిమా టికెట్ ధరలకు, బెనిఫిట్ షోలకు మాత్రం పవన్ కావాలి...కానీ అతడి సినిమా రిలీజ్ అయితే మాత్రం చూడటానికి వారికి టైమ్ దొరకడం లేదా అంటూ ట్రోల్ చేస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ ట్వీట్స్ వైరల్ అవుతోన్నాయి.
పవన్ కళ్యాణ్ సినిమా గురించి కూడా పోస్ట్‌లు, ట్వీట్స్ పెడితే బాగుండేదని అంటున్నారు.
ఉస్తాద్ భగత్‌సింగ్ మూవీ తొలిరోజు మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. కథలో కొత్తదనం లేకపోయినా పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్స్, డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



