North Korea | రాకెట్ లాంచర్లు ప్రయోగించిన ఉత్తర కొరియా.. 420 కిలోమీటర్ల దూరం లక్ష్యం
North Korea | ఇటీవలే ఒకేసారి పది బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా (North Korea) 600 ఎంఎం క్యాలిబర్ కలిగిన 12 మల్టీపుల్ రాకెట్ లాంచర్ల (Rocket launchers) ను తాజాగా పరీక్షించింది. ఓ ద్వీపమే (Iceland) లక్ష్యంగా చేపట్టిన ఈ రాకెట్ అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్లు కేసీఎన్‌ఏ (KCNA) వెల్లడించింది.
త్రినేత్ర.న్యూస్: ఇటీవలే ఒకేసారి పది బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన ఉత్తర కొరియా (North Korea) 600 ఎంఎం క్యాలిబర్ కలిగిన 12 మల్టీపుల్ రాకెట్ లాంచర్ల (Rocket launchers)ను తాజాగా పరీక్షించింది. ఈ మేరకు ఆ దేశ ప్రభుత్వ మీడియా కేసీఎన్‌ఏ (KCNA) ఈ విషయాన్ని ఆదివారం వెల్లడించింది. మొన్నటికి మొన్ననే అమెరికా, దక్షిణ కొరియా దేశాలు సంయుక్త యుద్ధ విన్యాసాలు నిర్వహించిన విషయం విదితమే.
ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా వరుసగా ఆయుధాలను పరీక్షిస్తోంది. 420 కిలోమీటర్ల (420 KM) దూరంలోని శత్రు స్థావరాలను ధ్వంసం చేసేలా ఈ లాంచర్లను తయారు చేసినట్లు సదరు పత్రిక పేర్కొంది. దీంతోపాటు టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ శక్తిపై అవగాహన పెంచుకోవడానికే దీన్ని పరీక్షించినట్లు తెలిపింది. ఉ.కొరియా అధినేత కిమ్ (Kim) తో పాటు ఆయన కూతరు కిమ్ జుయే (Kim juyo) స్వయంగా ఈ పరీక్షలను పర్యవేక్షించారు. 364 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ద్వీపమే లక్ష్యంగా చేపట్టిన ఈ రాకెట్ అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించినట్లు కేసీఎన్‌ఏ వెల్లడించింది.
కాగా ఇప్పటికే ఉత్తర కొరియా ఏకంగా 10 బాలిస్టిక్ క్షిపణులను (Missiles) ప్రయోగించి తన బల ప్రదర్శనను తెలియజేసింది. ప్యాంగ్యాంగ్ నుంచి క్షిపణులను ప్రయోగించారని, అవి ఎంత దూరం ప్రయాణించాయో తమకు తెలియదని దక్షిణ కొరియా సైన్యం పేర్కొనగా ఈ ప్రయోగాన్ని గుర్తించిన జపాన్ వెంటనే ప్రధాని కార్యాలయం అత్యవసర స్పందన చర్యలు ప్రారంభించింది. నౌకలకు తీర దళం అత్యవసర సూచనలు జారీ చేసింది.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






