North Korea | రెండు మిస్సైల్స్‌ను పరీక్షించిన ఉత్తర కొరియా.. పరిశీలించిన కిమ్..!
North Korea | పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ.. ఉత్తరకొరియా రెండు కీలక మిస్సైల్స్‌ను పరీక్షించింది. ఈ మిస్సైల్స్ టెస్ట్‌ను ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షించారు. కొత్త యుద్ధనౌక మిస్సైల్స్‌ను పరీక్షించారు.
International | Published On Apr 14, 2026, 7.55 am IST
North Korea | పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ.. ఉత్తరకొరియా రెండు కీలక మిస్సైల్స్‌ను పరీక్షించింది. ఈ మిస్సైల్స్ టెస్ట్‌ను ప్రెసిడెంట్ కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షించారు. కొత్త యుద్ధనౌక మిస్సైల్స్‌ను పరీక్షించారు. దేశ నౌకాదళ సామర్థ్యాలను పెంచుతామని,ముఖ్యంగా అణు ఆయుధ సామర్థ్యాన్ని మరింత విస్తరిస్తామని, నిలువలను పెంచున్నట్లు కిమ్ ప్రకటించినట్లుగా ఆ దేశ అధికారిక మీడియావెల్లడించింది. ఉత్తర కొరియా అధికార పత్రిక ‘రోడాంగ్ సిన్మున్’ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం 5వేల టన్నుల బరువు గల ‘చోయ్ హ్యోన్’ అనే డిస్ట్రాయర్ యుద్ధనౌకపై నుంచి రెండు వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణులు, మూడు యాంటీ-షిప్ క్షిపణుల ప్రయోగాన్ని కిమ్ పరిశీలించారు. ఈ నౌకను 2025 ఏప్రిల్‌లో తొలిసారి ప్రదర్శించారు.
ఈ క్షిపణులు ఉత్తర కొరియా పశ్చిమ సముద్రాల్లో మొదట నిర్ణయించిన లక్ష్యాల వైపు ప్రయాణించి ఖచ్చితంగా వాటిని తాకినట్లు అధికార మీడియా పేర్కొంది. క్రూయిజ్ క్షిపణులు రెండు గంటలకుపైగా, యాంటీ-షిప్ క్షిపణులు 30 నిమిషాలకుపైగా ప్రయాణించినట్లు తెలిపింది. కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) విడుదల చేసిన ఫొటోల్లో కిమ్, ఇతర ఉన్నతాధికారులు యుద్ధనౌకపై నుంచి క్షిపణి ప్రయోగాలను వీక్షిస్తున్న దృశ్యాలు కనిపించాయి. గత నెలలో కూడా ఇదే ‘చోయ్ హ్యోన్’ నౌక నుంచి మిస్సైల్ టెస్ట్‌లను కిమ్ పర్యవేక్షించారు. నౌకాదళ అణు సామర్థ్య అభివృద్ధిని వేగవంతం చేస్తామని అప్పట్లో ఆయన ప్రకటించారు. తాజా పరీక్షల అనంతరం కూడా దేశ అణు శక్తిని మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. అణు దాడి, తక్షణ ప్రతిస్పందన సామర్థ్యాలను మరింత పదును పెట్టేందుకు కొత్త నిర్ణయాలు తీసుకున్నట్లు కిమ్ పేర్కొన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మూడో, నాలుగో డిస్ట్రాయర్ యుద్ధనౌకల ఆయుధ వ్యవస్థల ప్రణాళికలను కూడా సమీక్షించినట్లు అధికార మీడియా పేర్కొంది.
ఈ యుద్ధనౌకలు గగనతల, సముద్ర లక్ష్యాలను ఎదుర్కొనే ఆయుధాలతో పాటు అణు సామర్థ్యం గల బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను మోసుకెళ్లేలా రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ నౌకల నిర్మాణానికి రష్యా సహాయం ఉన్నట్లు దక్షిణ కొరియా అధికారులు, నిపుణులు భావిస్తున్నారు. అయితే, కొన్ని రక్షణ నిపుణులు ఈ నౌకలు ఇంకా పూర్తిస్థాయి యుద్ధ వినియోగానికి సిద్ధంగా ఉన్నాయా అనే అంశంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది మేలో ఇదే తరహా రెండో డిస్ట్రాయర్‌ను ఉత్తర కొరియా ప్రవేశపెట్టింది. అయితే, ఉత్తర పోర్టు చాంగ్జిన్‌లో జరిగిన విఫల లాంచ్ సమయంలో అది దెబ్బతిన్నట్లు సమాచారం. ఆ తర్వాత ఆ నౌకను మరమ్మతులు చేసి జూన్‌లో మళ్లీ ప్రారంభించినట్లు ప్రకటించినప్పటికీ, దాని ఆపరేషనల్ సామర్థ్యంపై నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ తీరంలోని నాంపో షిప్‌యార్డ్‌లో నిర్మాణంలో ఉన్న మూడో డిస్ట్రాయర్‌ను అక్టోబర్‌లో జరిగే అధికార వర్కర్స్ పార్టీ వార్షికోత్సవానికి ముందు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికార మీడియా వెల్లడించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






