త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Road Accident | హైవేపైకి వ‌స్తూ అనంత‌లోకాల‌కు.. బైక్‌ను లారీ ఢీకొట్టి ఎంత‌మంది చ‌నిపోయారంటే!

Road Accident | న‌ల్ల‌గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఇద్ద‌రు వ్య‌క్తులు (Two dies) అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు.

S

Telangana | Published On Nov 2, 2026, 4.41 pm IST

Road Accident | హైవేపైకి వ‌స్తూ అనంత‌లోకాల‌కు.. బైక్‌ను లారీ ఢీకొట్టి ఎంత‌మంది చ‌నిపోయారంటే!
Advertisement

Road Accident | త్రినేత్ర న్యూస్: న‌ల్ల‌గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. జాతీయ ర‌హ‌దారి-65పై సోమ‌వారం ఓ బైక్‌ను లారీ ఢీకొట్ట‌డంతో ఇద్ద‌రు వ్య‌క్తులు (Two dies) అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రొక‌రికి తీవ్ర గాయాల‌య్యాయి.

వివ‌రాల్లోకి వెళ్తే.. నల్గొండ జిల్లా జాతీయ ర‌హదారి-65పైకి ద్విచ‌క్ర వాహ‌నంపై ముగ్గురు వ్య‌క్తులు వ‌స్తున్నారు. ఈ స‌మ‌యంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న లారీ వేగంగా వ‌చ్చి వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టింది. కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామ శివారులోని చెరువు అన్నారం ఎక్స్‌ రోడ్డు వద్ద ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెంద‌గా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన‌ సంఘ‌ట‌న స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు. ద‌ర్యాప్తు అనంత‌రం మృతుల పూర్తి వివ‌రాలు, ప్ర‌మాదం ఎలా జ‌రిగింద‌నే వివ‌రాల‌ను వెల్ల‌డిస్తామ‌ని వివ‌రించారు.

ట్యాగ్స్:

Annaram X RoadCase FiledNallagondaOne InjuryRoad AccidentTelanganaTwo Dies
Advertisement
Advertisement