Karbonn Rebel | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి కార్బన్ రీ ఎంట్రీ.. అదిరిపోయే ఫోన్లు లాంచ్..
Karbonn Rebel | భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి కార్బన్ మరోసారి అడుగుపెట్టింది. రెబల్, రెబల్ ప్రొ పేర్లతో రెండు కొత్త 4జి స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెడ్జ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 16 వంటి ఫీచర్లతో బడ్జెట్ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
Technology | Published On Nov 2, 2026, 5.02 pm IST
Karbonn Rebel | భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి కార్బన్ మరోసారి అడుగుపెట్టింది. రెబల్, రెబల్ ప్రొ పేర్లతో రెండు కొత్త 4జి స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 హెడ్జ్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 16 వంటి ఫీచర్లతో బడ్జెట్ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
సరికొత్త రెబల్ సిరీస్‌తో ఎంట్రీ..
దేశీయ మొబైల్ బ్రాండ్ కార్బన్ తన కొత్త రెబల్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో కార్బన్ రెబల్, కార్బన్ రెబల్ ప్రొ పేర్లతో రెండు 4జి మోడళ్లను పరిచయం చేసింది. తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం, వేగవంతమైన రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, ఎలాంటి అనవసర యాప్‌లు లేని స్వచ్ఛమైన సాఫ్ట్‌వేర్ అందించడమే లక్ష్యంగా ఈ ఫోన్లను తీసుకొచ్చింది. కార్బన్ రెబల్‌లో 6.75 ఇంచుల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 650 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ఉన్నాయి. మీడియాటెక్ హీలియో జి81 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 7,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కల్పించారు. వెనుకవైపు 50 మెగాపిక్సల్ ఏఐ కెమెరా ఇచ్చారు. బ్లూ, గోల్డ్, సిల్వర్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది.
ఫీచర్లు ఎలా ఉన్నాయి..
రెబల్ ప్రొ మోడల్‌లో 6.7 ఇంచుల హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతోపాటు 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 720 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ఉన్నాయి. ఇందులోనూ మీడియాటెక్ హీలియో జి81 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 20 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఫొటోగ్రఫీ కోసం 64 మెగాపిక్సల్ ఏఐ డ్యుయల్ రియర్ కెమెరా, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా అందించారు. చెర్రీ రెడ్, గోల్డ్, గ్రే, బ్లూ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ఈ రెండు ఫోన్లలో ఆండ్రాయిడ్ 16 క్లీన్ వెర్షన్‌ను అందిస్తున్నారు. ముందుగా ఇన్‌స్టాల్ చేసిన థర్డ్ పార్టీ అనవసర యాప్‌లు ఉండవని కంపెనీ తెలిపింది. రెండేళ్ల పాటు ప్రధాన ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, రెండేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్లు అందించనున్నట్లు ప్రకటించింది. గూగుల్ జెమిని ఏఐ అనుసంధానం, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్ సి పోర్ట్ కూడా ఉన్నాయి.
ధర ఎంత..
కార్బన్ రెబల్ అసలు ధర రూ.14,999 కాగా, ప్రారంభ ఆఫర్ కింద రూ.11,999కు ఇస్తున్నారు. బ్యాంక్ ఆఫర్ ద్వారా మరో రూ.1వేయి తగ్గింపు లభిస్తే రూ.10,999కే కొనుగోలు చేయవచ్చు. రెబల్ ప్రొ అసలు ధర రూ.14,999 కాగా, ప్రారంభ ఆఫర్ కింద రూ.12,499కు పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్‌తో రూ.11,499కు లభిస్తుంది. ఈ రెండు ఫోన్లు అమెజాన్ ఇండియాలో మాత్రమే విక్రయించనున్నారు. ఇక ఈ సిరీస్‌లో 5జి కనెక్టివిటీతో రానున్న కార్బన్ రెబల్ 5జి మోడల్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●85th IRC Summit | ఐఆర్సీ సదస్సుతో పెట్టుబడులు ఆకర్షించాలి
- ●CM Revanth Reddy | క్లీన్ హైదరాబాద్.. ట్రాఫిక్ ఫ్రీ సిటీ
- ●Mumbai Ahmedabad Bullet Train | గంటకు 249 కి.మీ వేగం, ఉచిత వైఫై.. భారత్ సొంత బుల్లెట్ రైలు 'B-28' ప్రత్యేకతలు ఇవే!
- ●Road Accident | హైవేపైకి వస్తూ అనంతలోకాలకు.. బైక్‌ను లారీ ఢీకొట్టి ఎంతమంది చనిపోయారంటే!
- ●Poonam_Kaur | ఎవరా ఫేక్ గురూజీ - పూనమ్ కౌర్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్
- ●CAIT | నిరసనలకు ఢిల్లీ శివార్లలో అధికారిక ప్రాంతాలను గుర్తించండి.. ఢిల్లీ ఎల్జీకి CAIT లేఖ

85th IRC Summit | ఐఆర్సీ సదస్సుతో పెట్టుబడులు ఆకర్షించాలి

CM Revanth Reddy | క్లీన్ హైదరాబాద్.. ట్రాఫిక్ ఫ్రీ సిటీ

Mumbai Ahmedabad Bullet Train | గంటకు 249 కి.మీ వేగం, ఉచిత వైఫై.. భారత్ సొంత బుల్లెట్ రైలు 'B-28' ప్రత్యేకతలు ఇవే!

Road Accident | హైవేపైకి వస్తూ అనంతలోకాలకు.. బైక్‌ను లారీ ఢీకొట్టి ఎంతమంది చనిపోయారంటే!



