85th IRC Summit | ఐఆర్‌సీ సదస్సుతో పెట్టుబడులు ఆకర్షించాలి
85th IRC Summit | ప్రపంచానికి తెలంగాణ ప్రగతి, సంస్కృతి, పెట్టుబడుల అవకాశాలను చాటేందుకు 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్‌సీ) సదస్సును కీలక వేదికగా మలచాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేవలం సాంకేతిక సదస్సుగా కాకుండా.. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు తీసుకొచ్చే గ్లోబల్ వేదికగా నిర్వహించాలని స్పష్టం చేశారు.
- ఈ నెల 19 నుంచి ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ సదస్సు
- ప్రత్యేకంగా తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేయాలి..
- దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో విస్తృత ప్రచారం చేపట్టాలి
- అధికారులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశం
- హైటెక్స్‌లో జరిగే సదస్సు ఏర్పాట్లుపై సుదీర్ఘ సమీక్ష
85th IRC Summit | ప్రపంచానికి తెలంగాణ ప్రగతి, సంస్కృతి, పెట్టుబడుల అవకాశాలను చాటేందుకు 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్‌సీ) సదస్సును కీలక వేదికగా మలచాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేవలం సాంకేతిక సదస్సుగా కాకుండా.. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు తీసుకొచ్చే గ్లోబల్ వేదికగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ నెల 19 నుంచి 22 వరకు హైదరాబాద్ హైటెక్స్‌లో జరగనున్న సదస్సు ఏర్పాట్లపై సోమవారం సచివాలయంలో అధికారులతో సుమారు మూడున్నర గంటల పాటు ఆయన సమీక్ష నిర్వహించారు. 85వ ఐఆర్‌సీ సదస్సును ఈ నెల 19న కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల రోడ్లు, భవనాల శాఖ మంత్రులు, జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు, ఇంజనీరింగ్ రంగ నిపుణులు హాజరుకానున్నారు. ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని రహదారులు, మౌలిక వసతుల రంగంలో తెలంగాణ సాధిస్తున్న పురోగతిని ప్రపంచానికి వివరించాలని మంత్రి సూచించారు.
ప్రత్యేకంగా రాష్ట్రానికి పెవిలియన్ ఉండాలి..
సదస్సుకు వచ్చే అతిథులకు రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, పర్యాటక ప్రాంతాలను పరిచయం చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కోమటిరెడ్డి సూచించారు. హైటెక్స్‌లో సుమారు 400 ఎగ్జిబిషన్ స్టాళ్లతో పాటు ప్రత్యేకంగా ‘తెలంగాణ పెవిలియన్’ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు, పెట్టుబడి అవకాశాలను ఇందులో ప్రదర్శించాలన్నారు. నాలుగు రోజుల పాటు ప్రతిరోజూ కనీసం గంటసేపు తెలంగాణ కళాకారుల ప్రదర్శనలు ఉండేలా చూడాలని సూచించారు. అతిథులకు రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించే జ్ఞాపికలు అందించాలని, సదస్సులోని కీలక కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించారు. పర్యాటక శాఖతో సమన్వయం చేసుకొని ప్రముఖ దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాల సందర్శనకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఐఆర్‌సీ సదస్సుకు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చేలా విస్తృత ప్రచారం చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ విమానాశ్రయం, మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లోనూ ప్రత్యేక హోర్డింగులు, విజువల్ ప్రకటనలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, సోషల్ మీడియా వేదికలను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.

ఇన్వెస్ట్ తెలంగాణకు ప్రీ-సమ్మిట్
డిసెంబర్‌లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ గ్లోబల్ సమ్మిట్‌కు 85వ ఐఆర్‌సీ ప్రీ-సమ్మిట్‌గా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు. సదస్సుకు హాజరయ్యే కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలను వివరించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. మౌలిక వసతులు, పారిశ్రామిక అనుకూల వాతావరణం, రవాణా సదుపాయాలు, భవిష్యత్ ప్రాజెక్టులను వారికి పరిచయం చేయాలన్నారు. ఈ వేదిక ద్వారా మరిన్ని పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాలు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. దేశ, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు వసతి, రవాణా, ఆహారం, భద్రత విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. తెలంగాణ ఆతిథ్య సంప్రదాయాలు ఉట్టిపడేలా స్వాగత ఏర్పాట్లు ఉండాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సదస్సును విజయవంతం చేయాలని ఆదేశించారు. 85వ ఐఆర్‌సీ వేదికగా రాష్ట్ర రోడ్ నెట్‌వర్క్, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని, ఈ సదస్సు తెలంగాణ అభివృద్ధిలో మైలురాయిగా నిలుస్తుందని కోమటిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆస్పత్రుల పనులు వేగవంతం చేయాలి
రాష్ట్రవ్యాప్తంగా ఆర్ అండ్ బీ శాఖ చేపడుతున్న అభివృద్ధి పనులను కూడా మంత్రి సమీక్షించారు. రోడ్ల నిర్మాణాలను నిర్దేశిత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని ఆదేశించారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హ్యామ్) రోడ్ల పనుల్లో జాప్యం లేకుండా చూడాలన్నారు. ఆల్వాల్ టిమ్స్ ఆస్పత్రి, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణాలను వేగవంతం చేసి ఈ ఏడాదిలోనే ప్రారంభానికి సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఉస్మానియా జనరల్ ఆస్పత్రి, నిమ్స్ విస్తరణ, నూతన హైకోర్టు భవన నిర్మాణ పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సమీక్షలో ఆర్ అండ్ బీ శాఖ కార్యదర్శి ఇలంబర్తి, స్పెషల్ సెక్రటరీ గంగాధర్, మోర్త్ రీజినల్ ఆఫీసర్ కృష్ణప్రసాద్, ఎన్‌హెచ్‌ఏఐ రీజినల్ ఆఫీసర్ శివశంకర్, పలువురు చీఫ్ ఇంజినీర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Karbonn Rebel | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి కార్బన్ రీ ఎంట్రీ.. అదిరిపోయే ఫోన్లు లాంచ్..
- ●CM Revanth Reddy | క్లీన్ హైదరాబాద్.. ట్రాఫిక్ ఫ్రీ సిటీ
- ●Mumbai Ahmedabad Bullet Train | గంటకు 249 కి.మీ వేగం, ఉచిత వైఫై.. భారత్ సొంత బుల్లెట్ రైలు 'B-28' ప్రత్యేకతలు ఇవే!
- ●Road Accident | హైవేపైకి వస్తూ అనంతలోకాలకు.. బైక్‌ను లారీ ఢీకొట్టి ఎంతమంది చనిపోయారంటే!
- ●Poonam_Kaur | ఎవరా ఫేక్ గురూజీ - పూనమ్ కౌర్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్
- ●CAIT | నిరసనలకు ఢిల్లీ శివార్లలో అధికారిక ప్రాంతాలను గుర్తించండి.. ఢిల్లీ ఎల్జీకి CAIT లేఖ

Karbonn Rebel | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి కార్బన్ రీ ఎంట్రీ.. అదిరిపోయే ఫోన్లు లాంచ్..

CM Revanth Reddy | క్లీన్ హైదరాబాద్.. ట్రాఫిక్ ఫ్రీ సిటీ

Mumbai Ahmedabad Bullet Train | గంటకు 249 కి.మీ వేగం, ఉచిత వైఫై.. భారత్ సొంత బుల్లెట్ రైలు 'B-28' ప్రత్యేకతలు ఇవే!

Road Accident | హైవేపైకి వస్తూ అనంతలోకాలకు.. బైక్‌ను లారీ ఢీకొట్టి ఎంతమంది చనిపోయారంటే!




