త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CAIT | నిర‌స‌న‌ల‌కు ఢిల్లీ శివార్ల‌లో అధికారిక ప్రాంతాల‌ను గుర్తించండి.. ఢిల్లీ ఎల్జీకి CAIT లేఖ‌

CAIT | రాజధానిలో నిరసనలు, ఆందోళనల కారణంగా వాణిజ్య కార్యకలాపాలు, జీవనోపాధి, ప్ర‌జ‌ల దైనందిత‌ జీవితాల‌కు అంత‌రాయాలు క‌ల‌గ‌కుండా.. నిర‌స‌న‌లు, ప్ర‌ద‌ర్శ‌న‌ల కోసం ఢిల్లీ శివార్లలో నిరసన ప్రదేశాలను నోటిఫై చేయాలని కోరుతూ కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధు (Taranjit Singh Sandhu)కు లేఖ రాసింది.

D

National | Published On Nov 2, 2026, 4.39 pm IST

CAIT | నిర‌స‌న‌ల‌కు ఢిల్లీ శివార్ల‌లో అధికారిక ప్రాంతాల‌ను గుర్తించండి.. ఢిల్లీ ఎల్జీకి CAIT లేఖ‌
Advertisement

CAIT | త్రినేత్ర న్యూస్ : జాతీయ రాజ‌ధానిలో నిర‌స‌న‌ల కార‌ణంగా త‌మ వ్యాపారాల‌కు తీవ్ర అంత‌రాయం క‌లుగుతోంద‌ని ఢిల్లీ వ్యాపారులు (Delhi Traders) ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సింగ్ సంధు (Taranjit Singh Sandhu)కు కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) కీలక విజ్ఞప్తి చేసింది. రాజధానిలో నిరసనలు, ఆందోళనల కారణంగా వాణిజ్య కార్యకలాపాలు, జీవనోపాధి, ప్ర‌జ‌ల దైనందిత‌ జీవితాల‌కు అంత‌రాయాలు క‌ల‌గ‌కుండా.. నిర‌స‌న‌లు, ప్ర‌ద‌ర్శ‌న‌ల కోసం ఢిల్లీ న‌గ‌ర శివార్ల‌లో అధికారిక ప్రాంతాల‌ను ప‌త్యేకంగా కేటాయించాల‌ని కోరింది (notify protest sites in the outskirts of Delhi). నిరసన తెలిపే హక్కు ఇతరుల జీవనోపాధిని దెబ్బతీసేలా ఉండకూడదని పేర్కొంది.

ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు, రాజకీయ కార్యకలాపాల వల్ల జరుగుతున్న అంతరాయాలను CAIT జాతీయ అధ్యక్షుడు బి.సి. భార్టియా లేఖ‌లో ప్ర‌స్తావించారు. శాంతియుతంగా నిర‌స‌న తెలిపే హ‌క్కు ప్ర‌జాస్వామ్యం క‌ల్పించిన‌ప్ప‌టికీ.. ఆ హ‌క్కును వినియోగించుకునే క్రమంలో ఇతర పౌరుల జీవనోపాధికి న‌ష్టం వాటిల్ల‌కుండా చూడ‌టం కూడా చాలా ముఖ్య‌మ‌ని పేర్కొన్నారు. ఢిల్లీ దేశంలోనే అతిపెద్ద వాణిజ్య‌, టోకు మార్కెట్ల‌కు ప్ర‌ధాన కేంద్రంగా ఉంద‌ని గుర్తు చేశారు. ఇక్క‌డ వేలాది మార్కెట్లు కోట్లాది మందికి ఉపాధి క‌ల్పిస్తున్నాయ‌ని చెప్పారు.

త‌ర‌చూ జ‌రిగే నిరసనల వల్ల ట్రాఫిక్ ఆంక్షలు, రోడ్ల దిగ్బంధనాల కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారులు ఢిల్లీకి రాలేకపోతున్నారని తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇది హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లు, రవాణా, హోటల్ రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స‌మ‌స్య‌కు శాశ్వ‌త ప‌రిష్కారం చూపాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని నొక్కి చెప్పారు. నిర‌స‌న‌ల కోసం శివార్లలో ప్రత్యేక స్థలాలను కేటాయించాలని విజ్ఞ‌ప్తి చేశారు.

అధికారుల మ‌ధ్య స‌మ‌న్వ‌యం ఉండాలి..

నిరసనకారుల ప్రజాస్వామ్య హక్కులను గౌరవిస్తూనే, నగర ఆర్థిక వ్యవస్థ స్తంభించకుండా చూసేందుకు ఢిల్లీ పోలీస్, ట్రాఫిక్ పోలీస్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) వంటి శాఖల మధ్య సమన్వయం ఉండాల‌ని CAIT డిమాండ్ చేసింది. ప్రజాస్వామ్య హక్కులను అణచివేయడం తమ ఉద్దేశం కాదని, కేవలం ఆర్థిక కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా చూడాలనేదే తమ ప్రధాన ఆందోళన అని స్పష్టం చేసింది. వ్యాపారులు, చిన్న దుకాణదారులు, రోజువారీ కార్మికులు, వీధి వ్యాపారుల జీవనోపాధిని రక్షించేందుకు త‌మ విజ్ఞ‌ప్తిని ప్రాధ‌న్యాత ప్రాతిప‌దిక‌న ప‌రిశీలించి ఢిల్లీ శివార్ల‌లో నిర‌స‌న స్థ‌లాల‌ను కేటాయించే ప్ర‌క్రియ‌ను వెంట‌నే ప్రారంభించాల‌ని ఎల్జీని CAIT కోరింది.

రూ.11 వేల కోట్ల న‌ష్టం..

కాగా, రామ్‌లీలా మైదాన్‌లో ఆదివారం ఇండీ కూట‌మి పార్టీలు నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ కార‌ణంగా త‌మ వ్యాపారానికి తీవ్ర న‌ష్టం వాటిల్లిన‌ట్లు ఢిల్లీ వ్యాపారులు (Delhi Traders) తెలిపారు. ఈ నిర‌స‌న‌ల వ‌ల్ల ఢిల్లీలో సుమారు 25 పెద్ద మార్కెట్ల‌కు చెందిన దాదాపు రెండున్న‌ర ల‌క్ష‌ల షాపులు మూత‌ప‌డిన‌ట్లు చెప్పారు. ఫ‌లితంగా ఒక్క‌రోజే దాదాపు రూ.11 వేల కోట్ల వ్యాపారం దెబ్బ‌తిన్న‌ద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. రామ్‌లీలా మైదానం స‌మీపంలో 80 శాతం షాపులు మూత‌ప‌డిన‌ట్లు చాంబ‌ర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండ‌స్ట్రీ చైర్మెన్ బ్రిజేశ్ గోయ‌ల్ తెలిపారు.

Also Read..

లాలూతో సోనియా గాంధీ భేటీ.. యూపీఏ హయాం జ్ఞాపకాలను నెమరువేసుకున్న సీనియర్ నేతలు

రాహుల్ గాంధీ విదేశీ శక్తుల చేతిలో కీలుబొమ్మ.. దేశాన్ని అస్థిరపరిచే కుట్ర

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 1.68 శాతం పెరిగిన నిఫ్టీ..

ట్యాగ్స్:

CAITConfederation Of All India TradersDelhi LGDelhi LG Taranjit Singh SandhuDelhi ProtestsDelhi TradersINDIA Block ProtestsNotify Protest Sites In The Outskirts Of Delhi
Advertisement
Advertisement