త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sonia Gandhi | లాలూతో సోనియా గాంధీ భేటీ.. యూపీఏ హయాం జ్ఞాపకాలను నెమరువేసుకున్న సీనియర్ నేతలు

Sonia Gandhi | రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్ (RJD) అధినేత లాలూ ప్ర‌సాద్ యాదవ్ (Lalu Prasad Yadav)తో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (CPP) చైర్‌పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రు నేత‌లూ యూపీఏ హ‌యాంలోని జ్ఞాప‌కాల‌ను (UPA Era) నెమ‌ర‌వేసుకున్నారు.

D

National | Published On Nov 2, 2026, 4.22 pm IST

Sonia Gandhi | లాలూతో సోనియా గాంధీ భేటీ.. యూపీఏ హయాం జ్ఞాపకాలను నెమరువేసుకున్న సీనియర్ నేతలు
Advertisement

Sonia Gandhi | త్రినేత్ర న్యూస్ : రాష్ట్రీయ జ‌న‌తా ద‌ళ్ (RJD) అధినేత లాలూ ప్ర‌సాద్ యాదవ్ (Lalu Prasad Yadav)తో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (CPP) చైర్‌పర్సన్ సోనియా గాంధీ (Sonia Gandhi) భేటీ అయ్యారు. ఢిల్లీలోలోని ఎంపీ మిసా భార‌తి (MP Misa Bharti) నివాసానికి వెళ్లిన సోనియా.. ఈ సంద‌ర్భంగా అక్క‌డ లాలూతో స‌మావేశ‌మ‌య్యారు. ఇటీవ‌లే పాట్నాలో చికిత్స పొందిన లాలూ.. మెరుగైన వైద్యం కోసం ఢిల్లీ వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా లాలూని క‌లిసిన సోనియా.. ఆయ‌న‌ ఆరోగ్య ప‌రిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. లాలూ కుటుంబ స‌భ్యుల‌తో త‌న విలువైన స‌మయాన్ని స‌ర‌దాగా గ‌డిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను ఆర్జేడీ నేత తేజస్వీ యాద‌వ్ (Tejashwi Yadav) సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకున్నారు. ఇరువురు నేత‌లూ యూపీఏ హ‌యాంలోని జ్ఞాప‌కాల‌ను (UPA Era) నెమ‌ర‌వేసుకున్న‌ట్లు చెప్పారు.

ఈ భేటీకి సంబంధించిన వివ‌రాల‌ను లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కూడా కూడా ఎక్స్ వేదిక‌గా పంచుకున్నారు. యూపీఏ ప్ర‌భుత్వ హ‌యాంలో రైతులు, యువ‌త‌, సైనికులు, సామాన్య ప్ర‌జ‌ల కోసం చేప‌ట్టిన సంక్షేమ కార్య‌క్ర‌మాలు, మ‌హాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చ‌ట్టం (MGNREGA), విద్యా హక్కు చట్టం (RTE), సమాచార హక్కు చట్టం (RTI) వంటి చారిత్రాత్మక చట్టాల గురించి చ‌ర్చించుకున్న‌ట్లు తెలిపారు. అప్పట్లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం బీహార్ అభివృద్ధి కోసం రూ. 1.45 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయించిన‌ట్లు గుర్తు చేసుకున్నారు.

Also Read..

హ్యాట్రిక్‌పై గురి.. యూపీ ఎన్నిక‌ల‌కు బీజేపీ త్రిముఖ‌ వ్యూహం

రోడ్డు నిర్మాణ ప‌నులు చేస్తుండ‌గా.. క‌రెంట్ షాక్‌తో 8 మంది కూలీలు మృతి

ముంచుకొస్తున్న మురాసు.. అర్ధ‌రాత్రి ఏపీలో తీరం దాట‌నున్న తుపాను

ట్యాగ్స్:

CongressCongress Parliamentary Party ChairpersonLalu Prasad YadavMP Misa BhartiRJDSonia GandhiTejashwi YadavUPA Era
Advertisement
Advertisement