CM Revanth Reddy | క్లీన్ హైదరాబాద్.. ట్రాఫిక్ ఫ్రీ సిటీ
CM Revanth Reddy | భాగ్యనగరాన్ని చెత్తరహితంగా మార్చడంతో పాటు ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. క్లీన్ సిటీ.. ట్రాఫిక్ ఫ్రీ సిటీ లక్ష్యంగా సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. చెత్త సేకరణలో నిర్లక్ష్యం సహించేది లేదని, అవసరాలకు అనుగుణంగా గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలను విస్తరించాలని సూచించారు.
- చెత్త సేకరణలో నిర్లక్ష్యాన్ని సహించం
- అవసరం మేరకు గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలు విస్తరించండి
- నిర్మాణ వ్యర్థాల తొలగింపునకు ప్రత్యేక వ్యవస్థ ఉండాలి
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
- నగరాభివృద్ధిపై మున్సిపల్ అధికారులతో సమీక్ష
CM Revanth Reddy | భాగ్యనగరాన్ని చెత్తరహితంగా మార్చడంతో పాటు ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. క్లీన్ సిటీ.. ట్రాఫిక్ ఫ్రీ సిటీ లక్ష్యంగా సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. చెత్త సేకరణలో నిర్లక్ష్యం సహించేది లేదని, అవసరాలకు అనుగుణంగా గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలను విస్తరించాలని సూచించారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సోమవారం మున్సిపల్ అధికారులతో నగరాభివృద్ధిపై సీఎం సమీక్ష నిర్వహించారు.
చెత్త సేకరణలో అలసత్వం వద్దు
నగరంలో ఎక్కడా చెత్త పేరుకుపోకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సీఎం ఆదేశించారు. ప్రతిరోజూ ఇంటింటికీ చెత్త సేకరణ జరిగేలా పక్కా చర్యలు తీసుకోవాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిర్మాణ వ్యర్థాల తొలగింపునకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించారు. పారిశ్రామిక ప్రాంతాల్లో చెత్త సేకరణకు ఐలా అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.
గ్రీన్ ట్యాంకర్లపై అవగాహన కల్పించాలి
నగరంలో నిర్మాణ పనులు, పార్కుల నిర్వహణ, ల్యాండ్‌స్కేపింగ్, గార్డెనింగ్ వంటి అవసరాలకు తాగునీటిని వినియోగించకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించాలని సీఎం సూచించారు. మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో (ఎస్టీపీ) శుద్ధి చేసిన నీటిని గ్రీన్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే విధానంపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. తాగునీటి వృథాను అరికట్టడంతో పాటు శుద్ధి చేసిన నీటిని సమర్థంగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటికే జలమండలి తొలి విడతలో 19 ఎస్టీపీల నుంచి 28 గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా సేవలు అందుబాటులోకి తెచ్చిందని గుర్తుచేశారు. జీహెచ్‌ఎంసీతో పాటు సీఎంసీ, ఎంఎంసీ పరిధుల్లోనూ ఈ సేవలను మరింత విస్తరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్‌కు చెక్
నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దృష్టి పెట్టాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. వీలైనంత వరకు సిగ్నళ్ల వద్ద వాహనాలు నిలిచిపోకుండా సిగ్నల్ ఫ్రీ వ్యవస్థను అభివృద్ధి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, సీఎం కార్యదర్శి మాణిక్‌రాజ్, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జీ సృజన తదితరులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Road Accident | హైవేపైకి వస్తూ అనంతలోకాలకు.. బైక్‌ను లారీ ఢీకొట్టి ఎంతమంది చనిపోయారంటే!
- ●Poonam_Kaur | ఎవరా ఫేక్ గురూజీ - పూనమ్ కౌర్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్
- ●CAIT | నిరసనలకు ఢిల్లీ శివార్లలో అధికారిక ప్రాంతాలను గుర్తించండి.. ఢిల్లీ ఎల్జీకి CAIT లేఖ
- ●TG Weather | తెలంగాణపై మురాసు ప్రభావం.. మూడురోజులు అతిభారీ వర్షాలు..!
- ●Sonia Gandhi | లాలూతో సోనియా గాంధీ భేటీ.. యూపీఏ హయాం జ్ఞాపకాలను నెమరువేసుకున్న సీనియర్ నేతలు
- ●Rahul Gandhi Foreign Powers Allegation | రాహుల్ గాంధీ విదేశీ శక్తుల చేతిలో కీలుబొమ్మ.. దేశాన్ని అస్థిరపరిచే కుట్ర

Road Accident | హైవేపైకి వస్తూ అనంతలోకాలకు.. బైక్‌ను లారీ ఢీకొట్టి ఎంతమంది చనిపోయారంటే!

Poonam_Kaur | ఎవరా ఫేక్ గురూజీ - పూనమ్ కౌర్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్

CAIT | నిరసనలకు ఢిల్లీ శివార్లలో అధికారిక ప్రాంతాలను గుర్తించండి.. ఢిల్లీ ఎల్జీకి CAIT లేఖ

TG Weather | తెలంగాణపై మురాసు ప్రభావం.. మూడురోజులు అతిభారీ వర్షాలు..!





