Poonam_Kaur | ఎవరా ఫేక్ గురూజీ – పూనమ్ కౌర్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్
ఫేక్ గురు తన కెరీర్‌ను నాశనం చేశాడంటూ టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. టాలీవుడ్ డైరెక్టర్‌ను ఉద్దేశించి ఆమె ఈ పోస్ట్ పెట్టిందని అంటున్నారు. ఆ దర్శకుడు చేసిన ఓ సినిమా ఇటీవల రిలీజైంది. ఆ సినిమాకు నెగెటివ్ టాక్ రావడంపైనే పూనమ్ కౌర్ సెటైరికల్‌గా ఈ పోస్ట్ పెట్టిందని అంటున్నారు.
Entertainment | Published On Nov 2, 2026, 4.39 pm IST
Poonam_Kaur | ఫేక్ గురుఅంటూ టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ పెట్టిన ఓ పోస్ట్ టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టిందన్నది ఆసక్తికరంగా మారింది. నువ్వు నా కెరీర్ ముగించావు. నీ వేధింపులను ప్రశ్నించాననే కారణంతోనే ఇలా చేశావు. కానీ దేవుడు నీకు ఏం చేశాడో చూడు. కొంచెమైనా సిగ్గు ఉండాలి. వేదికపై నువ్వు నీతులు చెబుతావు. నేను నిజజీవితంలో వాటిని ఆచరిస్తాను అంటూ పోస్ట్ లో పూనమ్ కౌర్ పేర్కొన్నది. ఫేక్ గురు పేరుతో ఆమె పెట్టిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
అగ్ర దర్శకుడు...
టాలీవుడ్‌లోని ఓ అగ్ర దర్శకుడిని విమర్శిస్తూ ఆమె ఈ పోస్ట్ పెట్టిందని నెటిజన్లు అంటున్నారు. స్టార్ హీరోతో అతడు చేసిన ఓ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.బాక్సాఫీస్ వద్ద నెగెటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. సినిమా రిజల్ట్‌ను ఉద్దేశించి దర్శకుడిపై పూనమ్ సెటైర్లు వేసిందని చెబుతున్నారు.
కెరీర్ నాశనం....
ఫేక్ గురూజీ పేరుతో పూనమ్ గత కొన్నేళ్ల నుంచి వివాదాస్పద పోస్ట్‌లు పెడుతోంది. ఈ పోస్ట్‌లతోనే ఆమె తరచుగా వార్తల్లో నిలుస్తోంది. తనకు అవకాశాలు రాకుండా చేసి కెరీర్‌ను నాశనం చేశాడని పేర్కొన్నది. తన కుటుంబ బలహీనతలను ఆసరాగా చేసుకొని వారిచేత తనపై తప్పుడు స్టేట్‌మెంట్స్ ఇప్పించాడని అన్నది. దర్శకుడిపై తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఫిర్యాదు చేసినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు చేసింది. అతడి వల్ల గత కొన్నేళ్లుగా తాను తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నట్లు చెప్పింది.
మాయాజాలం...
శ్రీకాంత్ హీరోగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలం మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది పూనమ్ కౌర్. శౌర్యం, ఈనాడు, గణేష్, నాగవల్లితో పాటు పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు చేసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Road Accident | హైవేపైకి వస్తూ అనంతలోకాలకు.. బైక్‌ను లారీ ఢీకొట్టి ఎంతమంది చనిపోయారంటే!
- ●CAIT | నిరసనలకు ఢిల్లీ శివార్లలో అధికారిక ప్రాంతాలను గుర్తించండి.. ఢిల్లీ ఎల్జీకి CAIT లేఖ
- ●TG Weather | తెలంగాణపై మురాసు ప్రభావం.. మూడురోజులు అతిభారీ వర్షాలు..!
- ●Sonia Gandhi | లాలూతో సోనియా గాంధీ భేటీ.. యూపీఏ హయాం జ్ఞాపకాలను నెమరువేసుకున్న సీనియర్ నేతలు
- ●Rahul Gandhi Foreign Powers Allegation | రాహుల్ గాంధీ విదేశీ శక్తుల చేతిలో కీలుబొమ్మ.. దేశాన్ని అస్థిరపరిచే కుట్ర
- ●Ponnam Prabhakar | పట్టభద్రుల ఓటర్ల నమోదు గడువు పెంచండి.. ఎన్నికల సంఘానికి పొన్నం విజ్ఞప్తి

Road Accident | హైవేపైకి వస్తూ అనంతలోకాలకు.. బైక్‌ను లారీ ఢీకొట్టి ఎంతమంది చనిపోయారంటే!

CAIT | నిరసనలకు ఢిల్లీ శివార్లలో అధికారిక ప్రాంతాలను గుర్తించండి.. ఢిల్లీ ఎల్జీకి CAIT లేఖ

TG Weather | తెలంగాణపై మురాసు ప్రభావం.. మూడురోజులు అతిభారీ వర్షాలు..!

Sonia Gandhi | లాలూతో సోనియా గాంధీ భేటీ.. యూపీఏ హయాం జ్ఞాపకాలను నెమరువేసుకున్న సీనియర్ నేతలు






