UAE | యుద్ధంలోకి వస్తే దుబాయ్, అబుదాబి నగరాలు ధ్వంసమే.. యూఏఈకి టాప్ ఎకనామిస్ట్ కీలక హెచ్చరికలు
UAE | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కు ప్రముఖ ఆర్థిక వేత్త (Top economist) జెఫ్రీ సాచ్స్ (Jeffrey Sachs) కీలక హెచ్చరికలు చేశారు. ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలోకి (Iran war) ప్రవేశించొద్దని సూచించారు.
International | Published On Mar 30, 2026, 4.53 pm IST
UAE | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కు ప్రముఖ ఆర్థిక వేత్త (Top economist) జెఫ్రీ సాచ్స్ (Jeffrey Sachs) కీలక హెచ్చరికలు చేశారు. ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలోకి (Iran war) ప్రవేశించొద్దని సూచించారు. ఒకవేళ యూఏఈ యుద్ధంలో పాలుపంచుకుంటే పర్యాటక స్వర్గధామాలైన దుబాయ్, అబుదాబి నగరాలు ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. ఆ రెండు నగరాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు.
ఈ నగరాలు కేవలం విలాసవంతమైన పర్యాటక కేంద్రాలే తప్ప.. పటిష్ఠమైన సైనిక రక్షణ వ్యవస్థలు కలిగిన ప్రాంతాలు కావని తెలిపారు. నిరంతరం సైనిక దాడులను తట్టుకునే శక్తి ఆ నగరాలకు లేదని పేర్కొన్నారు. అందుకే దాడుల్లో అవి ఈజీగా దెబ్బతినే అవకాశం ఉందని వివరించారు. "ఇవి రిసార్ట్ ప్రాంతాలు. పర్యాటకంగా మంచి గుర్తింపు ఉంది. అయితే, ఈ నగరాలు క్షిపణి దాడులను తట్టుకునేలా నిర్మించిన కోటలు కావు. ఇవి పెట్టుబడులకు, విలాసాలకు మాత్రమే కేంద్రాలుగా ఉన్నాయి. ఇలాంటి ప్రదేశం యుద్ధ క్షేత్రంగా మారితే దుబాయ్ ఉనికికే అర్థం ఉండదు" అని ఆయన పేర్కొన్నారు.
యూఎస్‌పై మితిమీరిన నమ్మకం వద్దు..
అమెరికా సైనిక మద్దతు తమను ప్రాంతీయ ముప్పుల నుండి కాపాడుతుందని గల్ఫ్ దేశాలు మితిమీరిన నమ్మకాన్ని పెట్టుకున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. "గల్ఫ్ దేశాలు తమ భద్రత కోసం పూర్తిగా అమెరికాపై ఆధారపడుతున్నాయి. మా వద్ద అమెరికా సైనిక స్థావరాలు ఉన్నాయి. అవి మమ్మల్ని రక్షిస్తాయి. కాబట్టి మాకు నచ్చినట్లు మేము వ్యవహరించొచ్చు అని వారు అనుకుంటున్నారు. ఇది తప్పుడు అంచనా" అని ఆయన హెచ్చరించారు. "అమెరికాకు శత్రువుగా ఉండటం ప్రమాదకరం, కానీ స్నేహితుడిగా ఉండటం ప్రాణాంతకం"
అని వ్యాఖ్యానించారు.
సంయమనం పాటించాలి..
ఇదే సందర్భంగా యూఏఈ నాయకత్వం యుద్ధంలో పాలుపంచుకోవాలన్న తమ వ్యూహాన్ని పునరాలోచించుకోవాలని సూచించారు. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా జాగ్రత్తపడాలని విజ్ఞప్తి చేశారు. సంయమనం పాటించాలని సూచించారు. "మిమ్మల్ని మీరు రక్షించుకోండి. పరిస్థితిని అర్థం చేసుకోండి. ఓడిపోయే పక్షంవైపు నిలబడకూడదు" అని ఆయన అన్నారు. తమపై దాడులకు తమ భూభాగంలోని అమెరికా స్థావరాలను వాడుకోనీయవద్దని ఇరాన్ ఇటీవలే గల్ఫ్ దేశాలను హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాక్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Also Read..
కరెంట్ షాక్ కంటే ప్రమాదకరం.. హేట్ స్పీచ్ బిల్లు : పాయల్ శంకర్
ధురంధర్ 2 హీరోయిన్ తెలుగు డెబ్యూ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది ...స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఇవే
వాంఖడేలో 12 రికార్డులు బద్దలు.. 13 ఏళ్ల తర్వాత సీజన్ తొలి మ్యాచ్‌లో విజయం..!
సంబంధిత వార్తలు

US Senate | ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్ దూకుడుకు అమెరికా సెనేట్ బ్రేక్
మే 20, 2026

Apache Helicopter | భారత ఆర్మీకి మరింత బూస్ట్.. రూ.3,600 కోట్ల సైనిక ప్యాకేజీకి అమెరికా ఆమోదం
మే 19, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



