Payal Shankar | కరెంట్ షాక్ కంటే ప్రమాదకరం.. హేట్ స్పీచ్ బిల్లు : పాయల్ శంకర్
Payal Shankar | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హేట్ స్పీచ్ బిల్లు కరెంట్ షాక్ కంటే ప్రమాదకరమని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హెచ్చరించారు. మరి ముఖ్యంగా భవిష్యత్‌లో ఈ బిల్లు కాంగ్రెస్ పార్టీకే ప్రమాదకరంగా మారుతుందన్నారు. పోలీసు వ్యవస్థను అతిగా వాడితే.. నష్టపోయేది మీరేనని కాంగ్రెస్ సర్కార్‌ను పాయల్ శంకర్ హెచ్చరించారు.
Payal Shankar | త్రినేత్ర.న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హేట్ స్పీచ్ బిల్లు కరెంట్ షాక్ కంటే ప్రమాదకరమని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హెచ్చరించారు. మరి ముఖ్యంగా భవిష్యత్‌లో ఈ బిల్లు కాంగ్రెస్ పార్టీకే ప్రమాదకరంగా మారుతుందన్నారు. పోలీసు వ్యవస్థను అతిగా వాడితే.. నష్టపోయేది మీరేనని కాంగ్రెస్ సర్కార్‌ను పాయల్ శంకర్ హెచ్చరించారు. శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హేట్ స్పీచ్ బిల్లుపై పాయల్ శంకర్ మాట్లాడారు.
ఇటువంటి బిల్లు అక్కడ ఉండి పెట్టేటప్పుడు బాగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు మాత్రం భయం ప్రారంభమవుతుంది. ప్రజాస్వామ్యంలో అనేక చట్టాలు పౌరులకు రక్షణగా ఉన్నాయి. సోషల్ మీడియా మితిమీరుతోంది అనుమానం లేదు. సోషల్ మీడియా మితిమీరుతుందని ఉన్నటువంటి వాక్ స్వాతంత్య్రాన్ని కూడా ఈ చట్టం ద్వారా కంట్రోల్ చేద్దామనుకుంటే ఎవరికి మంచిది కాదు. అధికారం ఉన్నప్పుడు అధికారులు చెప్పుచేతుల్లో ఉంటారు. పోలీసు వ్యవస్థను అతిగా వాడిన ప్రభుత్వం, నాయకుడు నిర్బంధం పెట్టిన వ్యవస్థ ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఈ రోజు సభలో లేని నాయకులే దానికి నిదర్శనం. గతంలో నేను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీస్తే.. అనేక కేసులు పెట్టారు. వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడుతామని బెదిరించారు. గుక్క తిప్పుకోలేనన్ని కేసులు నా మీద పెట్టారు.. ఎన్నో బాధలు పడ్డాం. కోర్టు అన్ని కేసులు కొట్టేసింది. ఒకట్రెండు ఉన్నాయని పాయల్ శంకర్ తెలిపారు.
ఆర్టికల్ 19కు తూట్లు పొడుస్తది ఈ బిల్లు..
ఈ చట్టం కర్ణాటక రాష్ట్రంలో అమల్లో ఉంది. ఇరు రాష్ట్రాల కాంగ్రెస్ పెద్దలు మాట్లాడి ఈ చట్టం తెచ్చినట్టు ఉంది. కర్ణాటకలో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఉన్నటువంటి చట్టాలను వాడుకునే ప్రయత్నం చేస్తేనే మంచిది. కొత్త చట్టాలు తెచ్చి స్వేచ్ఛను హరించొద్దు. ఆర్టికల్ 19కు తూట్లు పొడుస్తది ఈ బిల్లు. ఈ చట్టం ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు మంచిది కాదు. ప్రజాస్వామ్యానికి అసలే మంచిది కాదు. కేసు పెట్టేందుకు ఎలాంటి ఆధారాలు అవసరం లేదు. కేసు పెట్టిన తర్వాత.. కొన్ని రోజులకు తేలేది కాదు.. ఏండ్ల తరబడి తిరిగిన తర్వాత నిర్దోషి అని తేలుతది. అక్రమంగా కేసు పెట్టిన అధికారిపై చర్యలు లేవు. వారిని బాధ్యులుగా చేసే అవకాశం లేదు. ఈ చట్టాన్ని ప్రజల మీద ఉపయోగిస్తే.. బ్రిటిష్ వారు లేదా నిజాం పరిపాలిస్తున్నారా అనే సందేహం వస్తది. ఉపసంహరించుకోవాలి అని పాయల్ శంకర్ డిమాండ్ చేశారు.
పోలీసు వ్యవస్థను అతిగా వాడుకుంటే అది చాలా ప్రమాదకరం..
సోషల్ మీడియాలో కుటుంబ సభ్యులను కూడా లాగుతున్నారు. సోషల్ మీడియా కంట్రోల్‌కు ఈ చట్టం ఉపయోగపడుదు. దుబాయ్‌ను బేస్ చేసుకుని సోషల్ మీడియాను రన్ చేస్తున్నాయి. ఏ ఒక్క పేరా, సబ్ క్లాస్, సెక్షన్ కూడా సమాజానికి మంచి చేసేలా కనపిస్తలేదు. ప్రజల గొంతు నొక్కే అవకాశం ఉంది. ప్రభుత్వం వెంటనే ఈ బిల్లును విత్ డ్రా చేసుకోవాలి. ఇది మీకే మంచిది కాదు. ఇవాళ బాగా అనిపిస్తది.. అధికారులు మీ మాటలు వినొచ్చు. రేపు ఇటు రావాల్సి వస్తది. మళ్లీ ఇటు వచ్చినప్పుడు అనవసరంగా ఆ చట్టాన్ని తెచ్చుకున్నామని బాధ కలగొద్దు.. కాబట్టి ఈ బిల్లు ఎవరికి మంచిదికాదు. పోలీసు వ్యవస్థను అతిగా వాడుకుంటే అది చాలా ప్రమాదకరం. కరెంట్ షాక్ కంటే ప్రమాదకరం. ఈ బిల్లును వెంటనే విత్ డ్రా చేసుకోవాలని అని ఆయన డిమాండ్ చేశారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



