MI vs KKR | వాంఖడేలో 12 రికార్డులు బద్దలు.. 13 ఏళ్ల తర్వాత సీజన్ తొలి మ్యాచ్‌లో విజయం..!
MI vs KKR | ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఆరు వికెట్ల తేడాతో కోల్‌కతాపై విజయం సాధించింది. ఈ విక్టరీతో 13 ఏళ్ల ఓటములకు తెరదించింది.
MI vs KKR | ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఆరు వికెట్ల తేడాతో కోల్‌కతాపై విజయం సాధించింది. ఈ విక్టరీతో 13 ఏళ్ల ఓటములకు తెరదించింది. 2012 తర్వాత సీజన్ తొలి మ్యాచ్‌లో ముంబయి గెలవలేకపోయింది. తాజాగా ఆ ఓటముల నుంచి జట్టు బయటపడింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. అజింక్యా రహానే (67), ఏ రఘువంశి (51) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టుకు రోహిత్ శర్మ (78), ర్యాన్ రికెల్టన్ (81) అద్భుత ఇన్నింగ్స్ కారణంగా ముంబయి జట్టు 19.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసి విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి. ఐపీఎల్‌లో చరిత్రలో ముంబయి ఇండియన్‌కు ఇది అత్యధిక విజయవంతమైన రన్ చేజ్. గతంలో 2021లో చెన్నైపై 219 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన రికార్డును అధిగమించింది. అలాగే వాంఖడే స్టేడియంలో ఇదే అతిపెద్ద చేజ్‌గా నిలిచింది. సీజన్ తొలి మ్యాచ్‌లో 5,107 రోజుల తర్వాత ముంబయి విజయం సాధించడం విశేషం. ఐపీఎల్ చరిత్రలో మొత్తం 19 సీజన్లలో ముంబయి తొలి మ్యాచ్ గెలువడం కేవలం ఐదోసారి మాత్రమే. రోహిత్ శర్మ 23 బంతుల్లో అర్ధశతకం సాధించి తన ఐపీఎల్ కెరీర్‌లోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశారు. ఇదే రోహిత్‌కు ముంబయి తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీగా నిలిచింది. ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్‌లో రోహిత్ అర్ధశతకం చేయడం ఇది రెండోసారి మాత్రమే.
కేకేఆర్‌పై రోహిత్ శర్మకు ఆధిపత్యం కొనసాగింది. కోల్‌కతాపై 1,161 రన్స్ చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఘనత సాధించాడు. రోహిత్, రికెల్టన్ కలిసి తొలి వికెట్‌కు 148 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇది ముంబయి ఇండియన్స్‌కు రెండో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కాగా, వాంఖడేలో అత్యుత్తమం కావడం విశేషం. ఇక బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్ తన తొలి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. కీలక భాగస్వామ్యాలను విడదీసి జట్టుకు మద్దతుగా నిలిచాడు. 35 ప్లస్ రన్స్ భాగస్వామ్యాలను బ్రేక్ చేస్తూ స్పెషల్ క్లబ్‌లో చేరాడు. మరో వైపు వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్‌లో రాణించలేకపోయాడు. ఒక్క వికెట్ కూడా తీయకపోవడంతో ఫామ్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆధిపత్యం ప్రదర్శించి సీజన్‌ను విజయంతో ప్రారంభించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






