త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telugu OTT | ధురంధ‌ర్ 2 హీరోయిన్ తెలుగు డెబ్యూ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది …స్ట్రీమింగ్ డేట్‌, ప్లాట్‌ఫామ్ ఇవే

ధురంధ‌ర్ 2 బ్యూటీ సారా అర్జున్ హీరోయిన్‌గా న‌టించిన తెలుగు డెబ్యూ మూవీ యుఫోరియా ఓటీటీ రిలీజ్ డేట్ క‌న్ఫామ్ అయ్యింది. ఏప్రిల్ 2 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఫ్యామిలీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

N

Entertainment | Published On Mar 30, 2026, 4.35 pm IST

Telugu OTT | ధురంధ‌ర్ 2 హీరోయిన్ తెలుగు డెబ్యూ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది …స్ట్రీమింగ్ డేట్‌, ప్లాట్‌ఫామ్ ఇవే
Advertisement

Telugu OTT | ధురంధ‌ర్ 2 ఫేమ్ సారా అర్జున్ యుఫోరియా మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సీనియ‌ర్ డైరెక్ట‌ర్ గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో భూమిక, విఘ్నేష్ గ‌విరెడ్డి కీల‌క‌ పాత్ర‌లో న‌టించారు. ఫిబ్ర‌వ‌రిలో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ సినిమా ప‌రాజ‌యం పాలైంది. దాదాపు రెండు నెల‌ల గ్యాప్ త‌ర్వాత ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది.

ఈటీవీ విన్‌...

యుఫోరియా మూవీ ఏప్రిల్ 2 న ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌ను సోమ‌వారం ఈటీవీ విన్ అధికారికంగా ప్ర‌క‌టించింది. ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకుంది. ఫ్యామిలీ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ యుఫోరియా మూవీని రూపొందించారు. డ్ర‌గ్స్ వ‌ల్ల ఎదుర‌య్యే అన‌ర్థాల‌ను సందేశాత్మ‌కంగా ఈ సినిమాలో చూపించే ప్ర‌య‌త్నం చేశారు. ద‌ర్శ‌కుడి ఆలోచ‌న‌ బాగున్నా ఈ పాయింట్‌ను జెన్‌జీ ఆడియెన్స్ అభిరుచుల‌కు త‌గ్గ‌ట్లుగా థ్రిల్లింగ్‌గా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేయ‌డంలో ఫెయిల‌య్యారు.

ఇర‌వై నిమిషాల లోపే...

సారా అర్జున్ క్యారెక్ట‌ర్ నిడివి కూడా ఇర‌వై నిమిషాల లోపే ఉండ‌టంతో ఫ్యాన్స్ డిస‌పాయింట్ అయ్యారు. ధురంధ‌ర్ మూవీ కంటే ముందు సారా అర్జున్ అంగీక‌రించిన మూవీ ఇది. యుఫోరియా మూవీకి కాల‌భైర‌వ మ్యూజిక్ అందించాడు. గుణ‌శేఖ‌ర్ కుమార్తె నీలిమ గుణ ఈ సినిమాను నిర్మించింది.

చైత్రకు అన్యాయం...

చైత్ర (సారా అర్జున్‌) సివిల్స్ ప్రిపేర్ అవుతుంటుంది. ఐఏఎస్ కావాల‌ని క‌ల‌లు కంటుంది. ఓ ప‌బ్‌లో ప‌రిచ‌య‌మైన వికాస్‌తో (విఘ్నేష్‌) పాటు అత‌డి న‌లుగురు స్నేహితులు చైత్ర‌ను దారుణంగా రేప్ చేస్తారు. త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై పోలీసుల‌కు కంప్లైంట్ ఇస్తుంది చైత్ర‌. పోలీస్ ఆఫీస‌ర్ జ‌య‌దేవ్ (గౌత‌మ్ మీన‌న్‌) ఐదుగురు కుర్రాళ్ల‌ను అరెస్ట్ చేస్తాడు. వికాస్ తండ్రి చ‌క్ర‌వ‌ర్తి (రోహిత్‌) రియ‌ల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాడు. త‌ల్లి వింధ్యా (భూమిక‌) ఓ స్కూల్ ప్రిన్సిపాల్‌. మిగిలిన న‌లుగురు కుర్రాళ్ల తండ్రులు ప‌లుకుబ‌డి క‌లిగిన కుటుంబానికి చెందిన వారు కావ‌డంతో ఈ రేప్‌ కేసు సంచ‌ల‌నంగా మారుతుంది. ఈ కేసులోఐదుగురికి యావ‌జ్జీవ శిక్ష ప‌డుతుంది? జైలుకు వెళ్లిన వికాస్‌లో మార్పు కోసం వికాస్ త‌ల్లి వింధ్యా ఏం చేసింది? డ్ర‌గ్స్ దందా నుంచి జ‌య‌దేవ్ స‌హాయంతో కొడుకును వింధ్యా ఎలా కాపాడుకుంది? అనే అంశాల‌తో ఈ మూవీ రూపొందింది.

ధురంధ‌ర్ సీక్వెల్‌...

ధురంధ‌ర్ మూవీతో హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ధురంధ‌ర్‌కు సీక్వెల్‌గా తెర‌కెక్కిన ధురంధ‌ర్ 2 ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ప‌న్నెండు రోజుల్లోనే ఈ మూవీ 1300 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ఈ రెండు సినిమాల్లో ర‌ణ‌వీర్‌సింగ్ ప్రియురాలిగా, భార్య‌గా డిఫ‌రెంట్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్స్‌లో సారా అర్జున్ క‌నిపించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement