Drone Strike Near US Consulate | దుబాయ్‌లోని యూఎస్ ఎంబసీపై ఇరాన్ డ్రోన్ దాడి.. ఎగసిపడ్డ మంటలు
Drone Strike Near US Consulate | దుబాయ్ (Dubai)లోని యూఎస్ ఎంబసీ (US Consulate) లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడి చేసింది Drone Strike Near US Consulate). దీంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.
International | Published On Mar 4, 2026, 10.12 am IST
Drone Strike Near US Consulate | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఇరాన్ (Iran)పై అమెరికా సేనలు విరుచుకుపడుతున్నాయి. అదే సమయంలో ఇరాన్ సైతం ఎదురుదాడిని కొనసాగిస్తోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలే లక్ష్యంగా డ్రోన్లతో దాడి చేస్తోంది. తాజాగా దుబాయ్ (Dubai)లోని యూఎస్ ఎంబసీ (US Consulate) లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడి చేసింది Drone Strike Near US Consulate). దీంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని స్థానిక మీడియా వెల్లడించింది.
ఇక ఈ దాడిని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో ధృవీకరించారు. సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. "దురదృష్టవశాత్తూ ఒక డ్రోన్ కాన్సులేట్ భవనం పక్కన ఉన్న పార్కింగ్ ప్లేస్‌ను ఢీ కొట్టింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సిబ్బంది అంతా సురక్షితంగా ఉన్నారు" అని ఆయన వాషింగ్టన్‌లో విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. మరోవైపు దాడికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
కాగా, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ ఎదురుదాడులు కొనసాగిస్తోంది. గల్ఫ్ దేశాలైన దుబాయ్, రియాద్, కువైట్, యూఏఈ, ఖతార్, బెహ్రెయిన్, సౌదీ దేశాల్లోని అమెరికా దౌత్య కార్యాలయాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని విరుచుకుపడుతోంది. డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. సోమ, మంగళవారాల్లో కువైట్, రియాద్‌లోని యూఎస్ ఎంబసీలపై డ్రోన్ దాడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దుబాయ్‌లోని దౌత్య కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడింది.
Also Read..
Social Media | బోగస్ అకౌంట్ క్రియేట్ చేసి.. నటిపై అసభ్య పోస్టులు.. యాక్టర్ అరెస్టు
Apple M5 MacBooks | ఎం5 చిప్‌లతో సరికొత్త మాక్‌బుక్‌లు.. ధర రూ1,19,900తో మొదలు..
Fire Accident | బాచుపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. 50 ఫర్నీచర్ షాపులు దగ్ధం
సంబంధిత వార్తలు

Massive Fire | హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. వైద్యం కోసం వచ్చిన బంగ్లాదేశీయులు 9 మంది మృతి
ఆగస్టు 19, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లకు చమురు ధరల షాక్.. సూచీలు భారీగా పతనం..
జులై 24, 2026

Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన భారత స్టాక్ మార్కెట్లు..
జులై 20, 2026
తాజావార్తలు
- ●Municipal Elections | డిసెంబర్లో మున్సిపల్ ఎన్నికలు.. హైదరాబాద్‌తోపాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు కూడా.!
- ●POWERGRID | పవర్‌గ్రిడ్ కార్పొరేషన్లో అప్రెంటిస్‌లు.. సికింద్రాబాద్ రీజియన్‌లో 22 పోస్టులు
- ●Traffic Restrictions | నేడు మిలాద్-ఉన్-నబీ.. హైదరాబాద్‌లో సాయంత్రం 6 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
- ●Horoscope | ఆగస్టు 25 రాశి ఫలాలు.. ఈ రాశి వారికి పదోన్నతులు ఖాయం!
- ●బీఆర్ఎస్ సంస్థాగత సవాళ్లు: రెండు పొరల పార్టీ నిర్మాణం సరిపోతుందా?
- ●One Nation - One Election | 2029లోనే వన్ నేషన్- వన్ ఎలక్షన్?

Municipal Elections | డిసెంబర్లో మున్సిపల్ ఎన్నికలు.. హైదరాబాద్‌తోపాటు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లకు కూడా.!

POWERGRID | పవర్‌గ్రిడ్ కార్పొరేషన్లో అప్రెంటిస్‌లు.. సికింద్రాబాద్ రీజియన్‌లో 22 పోస్టులు

Traffic Restrictions | నేడు మిలాద్-ఉన్-నబీ.. హైదరాబాద్‌లో సాయంత్రం 6 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

Horoscope | ఆగస్టు 25 రాశి ఫలాలు.. ఈ రాశి వారికి పదోన్నతులు ఖాయం!



