Concrete mixer operators protest | కాంక్రీట్ మిక్సర్స్ ఆపరేటర్ల ఆందోళన.. ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత
Concrete mixer operators protest | హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయం వద్ద కాంక్రీట్ మిక్సర్స్ ఆపరేటర్లు, లారీ యజమానులు, భవన నిర్మాణ కార్మికులు మంగళవారం ఆందోళనకు దిగారు. కార్యాలయం గేట్లు బద్దలు కొట్టుకొని కమిషనర్ ఆఫీసులోకి వెళ్లేందుకు యత్నించారు.
Concrete mixer operators protest | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయం వద్ద కాంక్రీట్ మిక్సర్స్ ఆపరేటర్లు, లారీ యజమానులు, భవన నిర్మాణ కార్మికులు మంగళవారం ఆందోళనకు దిగారు. కార్యాలయం గేట్లు బద్దలు కొట్టుకొని కమిషనర్ ఆఫీసులోకి వెళ్లేందుకు యత్నించారు. ఈ ఆందోళన నేపత్యంలో భవన నిర్మాణ కార్మికులు భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వారిని అడ్డుకోగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతకీ కారణం ఏంటంటే..
నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో నిర్మాణ పనులకు ఉపయోగించే కాంక్రీట్ మిక్సర్ వాహనాలు, భారీ వాహనాల రాకపోకలపై అధికారులు ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని నగరంలో భారీ వాహనాలు, కాంక్రీట్ మిక్సర్లు పగటిపూట తిరగకూడదనే నిబంధనలను కఠినతరం చేశారు. ఇంతటితో ఆగకుండా పోలీసులతో పాటు రవాణా శాఖ అధికారులు వాటిని ఎక్కడికక్కడ సీజ్ చేస్తున్నారు. దీనిపై కార్మికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
రాత్రి వేళల్లో మాత్రమే పనులు చేసుకోవడానికి అనుమతించడం వల్ల నిర్మాణ ప్రాజెక్టులు ఆలస్యం కావడంతో పాటు తమ జీవనోపాధి దెబ్బతింటుందని కార్మికులు, మిల్లర్ల సంఘాల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ముట్టడి కారణంగా ఖైరతాబాద్‌లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని కార్మిక సంఘాలు నాయకులు తేల్చిచెప్పారు.
తాజావార్తలు
- ●Microsoft Layoffs | మైక్రోసాఫ్ట్‌లో భారీ లేఆఫ్స్.. వ్యాపారం బాలేదంటూ ఉద్యోగులకు లేఖ రాసిన ఎక్స్‌బాక్స్ సీఈవో
- ●Rentomojo IPO | ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. రెంటోమోజో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్..
- ●HP | వాలొరెంట్ అభిమానులకు సర్ప్రైజ్.. హైపర్‌ఎక్స్ ఒమెన్ 16 లిమిటెడ్ ఎడిషన్ ల్యాప్‌టాప్ విడుదల..
- ●Hydrogen Train | దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ రైలు.. జులై 17న జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని మోదీ
- ●OTT | ట్విస్ట్‌లతో సాగే వంద కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ - తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ - ఏ ఓటీటీలో చూడాలంటే?
- ●Strait of Hormuz | మరోసారి భగ్గుమన్న హర్మూజ్.. నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

Microsoft Layoffs | మైక్రోసాఫ్ట్‌లో భారీ లేఆఫ్స్.. వ్యాపారం బాలేదంటూ ఉద్యోగులకు లేఖ రాసిన ఎక్స్‌బాక్స్ సీఈవో

Rentomojo IPO | ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. రెంటోమోజో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్..

HP | వాలొరెంట్ అభిమానులకు సర్ప్రైజ్.. హైపర్‌ఎక్స్ ఒమెన్ 16 లిమిటెడ్ ఎడిషన్ ల్యాప్‌టాప్ విడుదల..

Hydrogen Train | దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ రైలు.. జులై 17న జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని మోదీ






