త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | ప్ర‌ధాని మోదీకి ఇండోనేషియా అత్యున్న‌త పౌర పురస్కారం బింటాంగ్‌ ఆదిపుర్ణ

PM Modi | ఇండోనేషియా (Indonesia)లో ప‌ర్య‌టిస్తున్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi)కి అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం 'బింటాంగ్‌ ఆదిపుర్ణ' వ‌రించింది. జకార్తా పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కీల‌క‌ ఒప్పందాలు కుదిరాయి. ముఖ్యంగా ఇండోనేషియాకు భారత్‌ అత్యాధునిక బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణులను సరఫరా చేసేందుకు అగీకారం కుదిరింది.

D

National | Published On Jul 7, 2026, 1.29 pm IST

PM Modi | ప్ర‌ధాని మోదీకి ఇండోనేషియా అత్యున్న‌త పౌర పురస్కారం బింటాంగ్‌ ఆదిపుర్ణ
Advertisement

PM Modi | ఇండోనేషియా (Indonesia)లో ప‌ర్య‌టిస్తున్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi)కి అరుదైన గౌర‌వం ద‌క్కింది. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం (Indonesia's highest national honour) 'బింటాంగ్‌ ఆదిపుర్ణ' (Bintang Adipurna) వ‌రించింది. ఆ దేశ అధ్య‌క్షుడు ప్ర‌బోవో సుబియాంటో ఈ పుర‌స్కారాన్ని ప్ర‌ధాని మోదీకి ప్ర‌దానం చేశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌బోవోకు, ఇండోనేషియా ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాని మోదీ ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ గౌర‌వాన్ని ప్ర‌ధాని మోదీ దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు. ఇది ఇండోనేషియా ప్రజల ప్రేమాభిమానాలకు, మన రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధానికి ప్రతీక అని తెలిపారు. దేశ ఐక్య‌త‌, స‌మ‌గ్ర‌త‌, శ్రేయ‌స్సు కోసం పాటుప‌డే వ్య‌క్తుల‌ను ఇండోనేషియా స‌ర్కారు బింటాంగ్ ఆదిపూర్ణ అవార్డుతో స‌త్క‌రిస్తుంటుంది.

కీల‌క ఒప్పందాలు..

జకార్తా పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కీల‌క‌ ఒప్పందాలు కుదిరాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో (Indonesian President Prabowo Subianto) మధ్య జకార్తాలో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కీలక ఖనిజాలు, సాంకేతికత, ఆహార భద్రత, ఔషధ రంగం, సముద్ర భద్రత, వాణిజ్యం, పారిశ్రామిక సహకారం వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే దిశ‌గా దాదాపు 20 అవ‌గాహ‌న ఒప్పందాల‌పై ఇరు దేశాలు సంత‌కాలు చేశాయి. ముఖ్యంగా ఇండోనేషియాకు భారత్‌ అత్యాధునిక బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణులను సరఫరా చేసేందుకు అగీకారం కుదిరింది. వాణిజ్య, ఆర్థిక రంగాల్లోనూ వ్యూహాత్మక భాగస్వామ్యానికి బలమైన పునాది పడింది. ఖనిజాలు, ఉక్కు సరఫరా వ్యవస్థలలో సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.

ఇండోనేషియాలో ఐఐఎమ్ బెంగళూరు..

ద్వైపాక్షిక స‌మావేశం అనంత‌రం ఏర్పాటు చేసిన ఉమ్మ‌డి విలేక‌రుల స‌మావేశంలో ప్ర‌ధాని మోదీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇండోనేషియాలో ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగ‌ళూరు నూత‌న క్యాంప‌న్‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), టెలికమ్యూనికేషన్స్, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో యువత మధ్య సాంకేతిక సహకారాన్ని పెంపొందించే దిశ‌గా కీల‌క ఒప్పందంపై సంత‌కాలు చేసిన‌ట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ఐఐఎమ్ బెంగళూరు క్యాంప‌స్‌ను ఇండోనేషియాలో ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు.

Also Read..

మైక్రోసాఫ్ట్‌లో భారీ లేఆఫ్స్‌.. వ్యాపారం బాలేదంటూ ఉద్యోగుల‌కు లేఖ రాసిన ఎక్స్‌బాక్స్ సీఈవో

దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ రైలు.. జులై 17న జెండా ఊపి ప్రారంభించ‌నున్న ప్ర‌ధాని మోదీ

మ‌రోసారి భ‌గ్గుమ‌న్న హ‌ర్మూజ్‌.. నౌక‌ల‌పై ఇరాన్ క్షిప‌ణి దాడులు

Advertisement
Advertisement