Revanth Reddy | రేవంత్ కీలక నిర్ణయం.. సీఎంవో అధికారులకు శాఖల కేటాయింపు
Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎంవోలోని ఉన్నతాధికారులకు వివిధ శాఖలను కేటాయించారు.
Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎంవోలోని ఉన్నతాధికారులకు వివిధ శాఖలను కేటాయించారు. సీఎం కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అజిత్‌రెడ్డి, శ్రీనివాసరాజు ఇటీవల బదిలీపై వెళ్లారు. దీంతో వారి స్థానాల్లో మాజీ సీఎస్ కె.రామకృష్ణారావు, సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీధర్ కొత్తగా చేరారు. కీలక విభాగాలు సమర్థంగా నడిచేందుకు, ఫైళ్ల క్లియరెన్స్‌తోపాటు, పరిపాలనాపరమైన ఏకాగ్రతను పెంచడానికి ఈ కేటాయింపులు దోహదపడతాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
ఎవరెవరికి ఏ శాఖలంటే..
కె.రామకృష్ణారావు, ఐఏఎస్(రిటైర్డ్), ముఖ్యమంత్రి సలహాదారు-ఎక్స్-అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి: పరిశ్రమలు (పరిశ్రమలు, పెట్టుబడులు సహా), ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఇంధనశాఖ, సమాచార, పౌర సంబంధాల శాఖ, సినిమాటోగ్రఫీ, క్రీడలు, యువజన సేవలు, సాంస్కృతిక, పర్యాటకం, హైదరాబాద్ మెట్రో రైలు, స్పీడ్.
వి.శేషాద్రి, ఐఏఎస్, సీఎం ముఖ్య కార్యదర్శి: సాధారణ పరిపాలన, శాంతిభద్రతలు, న్యాయ, హోం, ఆర్థిక, ప్రణాళిక శాఖలు, శాసన వ్యవహారాలు, భూ పరిపాలన(ల్యాండ్ రెవెన్యూ), ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, వ్యవసాయం, పశుసంవర్ధక, సహకార, మార్కెటింగ్ శాఖలు, ముఖ్యమంత్రి భద్రత.
శ్రీధర్, ఐఏఎస్, సీఎం ముఖ్య కార్యదర్శి: రవాణా, రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ శాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి (గ్రామీణ నీటి సరఫరా), విద్య (పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్య), శక్తి-కార్మిక, ఉపాధి శిక్షణ, ఫ్యాక్టరీలు
కె.మాణిక్‌రాజ్, ఐఏఎస్, సీఎం కార్యదర్శి: మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి, సాగునీటి శాఖ, రెవెన్యూ (వాణిజ్య పన్నులు, ఎక్సైజ్), గనులు, భూగర్భ, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు, విపత్తు నిర్వహణ, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతికత.
వేముల శ్రీనివాసులు, ముఖ్యమంత్రి ఓఎస్‌డీ: మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం, దేవాదాయ, సంక్షేమ శాఖలు, ముఖ్యమంత్రి వినతులు, ప్రజావాణి, సీఎంఆర్‌ఎఫ్, ముఖ్యమంత్రి కార్యాలయ కంప్యూటరీకరణ, ముఖ్యమంత్రి కార్యాలయ పరిపాలన.
జి.మల్సూర్, ముఖ్యమంత్రి ప్రధాన ప్రజా సంబంధాల అధికారి: ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్లు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kommidi Narasimha Reddy | భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి ఇకలేరు
జులై 7, 2026

Concrete mixer operators protest | కాంక్రీట్ మిక్సర్స్ ఆపరేటర్ల ఆందోళన.. ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత
జులై 7, 2026

Gayatri Waterfalls | గాయత్రి వాటర్ ఫాల్.. 100 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలపాతం..
జులై 7, 2026
తాజావార్తలు
- ●KUDA | 'కుడా'లో రూ. 70 కోట్ల అవినీతి.. టెండర్లు రద్దు చేయాల్సిందే
- ●Kommidi Narasimha Reddy | భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి ఇకలేరు
- ●PMAY Urban 2.0 | ఇంటి రుణంపై రూ.1.80 లక్షల సబ్సిడీ.. కేంద్ర పథకం పూర్తి వివరాలు..
- ●PM Modi | ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం బింటాంగ్ ఆదిపుర్ణ
- ●Concrete mixer operators protest | కాంక్రీట్ మిక్సర్స్ ఆపరేటర్ల ఆందోళన.. ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- ●Microsoft Layoffs | మైక్రోసాఫ్ట్‌లో భారీ లేఆఫ్స్.. వ్యాపారం బాలేదంటూ ఉద్యోగులకు లేఖ రాసిన ఎక్స్‌బాక్స్ సీఈవో

KUDA | 'కుడా'లో రూ. 70 కోట్ల అవినీతి.. టెండర్లు రద్దు చేయాల్సిందే

Kommidi Narasimha Reddy | భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి ఇకలేరు

PMAY Urban 2.0 | ఇంటి రుణంపై రూ.1.80 లక్షల సబ్సిడీ.. కేంద్ర పథకం పూర్తి వివరాలు..

PM Modi | ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం బింటాంగ్ ఆదిపుర్ణ



