Russia-Ukraine War | రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్
Russia-Ukraine War | రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. రాత్రికి రాత్రే ఉక్రెయిన్ భారీ సంఖ్యలో డ్రోన్ దాడులకు దిగింది. కీవ్ ప్రయోగించిన 660 డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్ చేపట్టిన దీర్ఘశ్రేణి దాడుల్లో ఇదో అతిపెద్ద దాడిగా రష్యన్ అధికారులు పేర్కొన్నారు.
International | Published On Jun 26, 2026, 4.41 pm IST
- 660 డ్రోన్లతో దాడి
- అన్నింటినీ కూల్చేశామన్న మాస్కో
- ఇంధన మౌలిక సదుపాయాలే టార్గెట్
- బెలారస్‌ను యుద్ధంలోకి కీవ్ లాగే ప్రయత్నాలు
Russia-Ukraine War | రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. రాత్రికి రాత్రే ఉక్రెయిన్ భారీ సంఖ్యలో డ్రోన్ దాడులకు దిగింది. కీవ్ ప్రయోగించిన 660 డ్రోన్లను గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఉక్రెయిన్ చేపట్టిన దీర్ఘశ్రేణి దాడుల్లో ఇదో అతిపెద్ద దాడిగా రష్యన్ అధికారులు పేర్కొన్నారు. రష్యాలోని పలు ప్రాంతాలు, క్రిమియా ద్వీపకల్పంలోని దాదాపు 12 ప్రాంతాలు లక్ష్యంగా ఉక్రెయిన్ డ్రోన్లను ప్రయోగించింది. తాజా దాడుల్లో మాస్కో సహా 13 ప్రాంతాల్లో రష్యా డ్రోన్లను అడ్డుకున్నట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. నల్ల సముద్రం, అజోవ్ సముద్రం పరిధిలోనూ మానవరహిత విమానాలను అడ్డుకున్నట్లు పేర్కొంది. మాస్కోకు దక్షిణంగా సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న తులా ప్రాంతంపై జరిగిన దాడిలో ఓ ఇంటి భవనం దెబ్బతిందని, ఓ మహిళ గాయపడిందని ఆ ప్రాంత గవర్నర్ డిమిత్రి మిల్యాయేవ్ తెలిపారు. నోవోమోస్కోవ్ ప్రాంతంలోని ఓ పారిశ్రామిక కేంద్రం కూడా దెబ్బతిన్నట్లు చెప్పారు. రష్యా మీడియా కథనాల ప్రకారం.. దెబ్బతిన్న పరిశ్రమను అజోట్ ప్లాంట్‌గా గుర్తించారు. ఈ పరిశ్రమ రష్యా పేలుడు పదార్థాల తయారీలో కీలక పాత్ర పోషిస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ గతంలో వెల్లడించారు.
ఉక్రెయిన్ ఇటీవల రష్యా భూభాగంలోని ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను తీవ్రతరం చేసింది. యుద్ధానికి అవసరమైన నిధుల ప్రవాహాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఇంధన కొరత ఏర్పడుతుందని, సైనిక సరఫరా మార్గాలపై కూడా ప్రభావం పడుతోంది. తూర్పు ఉక్రెయిన్‌లో ముందుకు సాగేందుకు రష్యా బలగాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ.. స్వదేశంలో డ్రోన్ల దాడులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి మాస్కోకు ఎదురైంది. ఇదే సమయంలో రష్యా మిత్రదేశమైన బెలారస్‌ను యుద్ధంలోకి లాగే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో బెలారస్ సైనిక అవసరాల కోసం మౌలిక సదుపాయాలు, నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తమకు సమాచారం అందిందని ఆయన చెప్పారు. ఈ చర్యలు ‘రష్యా ప్రభావంతో ఉక్రెయిన్‌పై దాడుల విస్తరణకు సిద్ధమవుతున్న సంకేతాలు’గా అని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆరోపణలను రష్యా ఖండించింది. క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ జెలెన్‌స్కీ వ్యాఖ్యలు వాస్తవాలకు అనుగుణంగా లేవన్నారు.
అయితే, 2022లో రష్యా ఉక్రెయిన్‌పై దాడి ప్రారంభించిన సమయంలో బెలారస్ తన భూభాగాన్ని రష్యా సైనిక చర్యలకు ఉపయోగించుకునేందుకు అనుమతించింది. ప్రస్తుతం యుద్ధంలో నేరుగా పాల్గొనే ఉద్దేశం లేదని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో స్పష్టం చేశారు. ఉక్రెయిన్ అధికారులు తమ దేశాన్ని యుద్ధంలోకి లాగేందుకు ప్రయత్నించొద్దని హెచ్చరించినట్లు ఆయన తెలిపారు. శాంతి ఒప్పందానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మరోవైపు బెలారస్‌లో రష్యా వ్యూహాత్మక అణ్వస్త్రాలను మోహరించేందుకు అనుమతి ఇవ్వడం, రష్యాతో కలిసి సైనిక విన్యాసాలు నిర్వహించడం వంటి చర్యలు ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ.. డ్రోన్ దాడులు, ఇంధన మౌలిక వసతులపై దాడులు ఉద్రిక్తతలను మరింత పెంచాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Prajavani | మండల ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి : జీ చిన్నారెడ్డి
ఆగస్టు 16, 2026

KTR | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై రేపు నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు..!
ఆగస్టు 16, 2026

Moscow Drone Attack | మాస్కోపై ఉక్రెయిన్ ప్రతీకారం: వందలాది డ్రోన్లతో భీకర దాడి.. మంటల్లో రష్యా ‘అమెజాన్’ గోదాం!
ఆగస్టు 16, 2026
తాజావార్తలు
- ●Prajavani | మండల ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి : జీ చిన్నారెడ్డి
- ●KTR | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై రేపు నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు..!
- ●Bandla Ganesh Daughter Wedding | ఘనంగా బండ్ల గణేష్ కూతురు వివాహం - టాలీవుడ్ స్టార్స్ సందడి
- ●Anupama Parameswaran | టాలీవుడ్ హీరోల్లో అతడే నా క్లోజ్‌ఫ్రెండ్ - అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్ వైరల్
- ●Trisha | తల్లి చీరలో మెరిసిన త్రిష - చెన్నై క్వీన్ కొత్త ఫొటోలపై ఓ లుక్కేయండి!
- ●Dasoju Sravan | రేవంత్, ఉత్తమ్ ఫొటోలకు 100 కోట్లు దండగ.. ఇది పచ్చి రాజ్యాంగ ఉల్లంఘనే

Prajavani | మండల ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి : జీ చిన్నారెడ్డి

KTR | కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై రేపు నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు..!

Bandla Ganesh Daughter Wedding | ఘనంగా బండ్ల గణేష్ కూతురు వివాహం - టాలీవుడ్ స్టార్స్ సందడి

Anupama Parameswaran | టాలీవుడ్ హీరోల్లో అతడే నా క్లోజ్‌ఫ్రెండ్ - అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్ వైరల్



