Apple M5 MacBooks | ఎం5 చిప్‌లతో సరికొత్త మాక్‌బుక్‌లు.. ధర రూ1,19,900తో మొదలు..
Apple M5 MacBooks | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ ఎం5 చిప్‌సెట్‌లతో సరికొత్త మాక్‌బుక్‌లను లాంచ్ చేసింది. ఎం5 చిప్ కలిగిన మాక్‌బుక్ ఎయిర్‌తోపాటు ఎం5 ప్రొ, ఎం5 మ్యాక్స్ చిప్‌లు కలిగిన మాక్‌బుక్ ప్రొ ల్యాప్‌టాప్‌లను కూడా యాపిల్ లాంచ్ చేసింది. ఈ ల్యాప్‌టాప్‌లు మార్చి 11 నుంచి ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లలో అందుబాటులోకి రానున్నాయి.
Technology | Published On Mar 4, 2026, 9.39 am IST
Apple M5 MacBooks | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ ఎం5 చిప్‌సెట్‌లతో సరికొత్త మాక్‌బుక్‌లను లాంచ్ చేసింది. ఎం5 చిప్ కలిగిన మాక్‌బుక్ ఎయిర్‌తోపాటు ఎం5 ప్రొ, ఎం5 మ్యాక్స్ చిప్‌లు కలిగిన మాక్‌బుక్ ప్రొ ల్యాప్‌టాప్‌లను కూడా యాపిల్ లాంచ్ చేసింది. ఈ ల్యాప్‌టాప్‌లు మార్చి 11 నుంచి ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లలో అందుబాటులోకి రానున్నాయి. మాక్‌బుక్ ఎయిర్ (ఎం5) 13, 15 ఇంచుల మోడల్స్‌లో వివిధ రకాల ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉండగా, దీని ప్రారంభ ధర రూ.1,19,900గా ఉంది. టాప్ ఎండ్ మోడల్ ధర రూ.1,64,900గా ఉంది. ఇక మాక్‌బుక్ ప్రొ ఎం5 ప్రొ, ఎం5 మ్యాక్స్ చిప్‌లతో 14, 16 ఇంచుల మోడల్స్‌లో వివిధ రకాల ర్యామ్, స్టోరేజ్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. మాక్‌బుక్ ప్రొ (ఎం5 ప్రొ/ఎం5 మ్యాక్స్) ప్రారంభ ధర రూ.2,49,900 ఉండగా, టాప్ ఎండ్ మోడల్ ధర రూ.4,99,900గా ఉంది.
ఎం5 చిప్‌తో మాక్‌బుక్ ఎయిర్..
మాక్‌బుక్ ఎయిర్ (ఎం5) లో 16జీబీ నుంచి 24జీబీ వరకు ర్యామ్, 512జీబీ నుంచి 1టీబీ వరకు స్టోరేజ్‌ను అందిస్తున్నారు. కావాలంటే ర్యామ్, స్టోరేజ్‌లను ఇంకా పెంచుకోవచ్చు. ఇందులో సరికొత్త ఎం5 చిప్ లభిస్తుంది. మాక్ ఓఎస్‌ను ఇస్తున్నారు. మ్యాజిక్ కీబోర్డు, టచ్ ఐడీ, 12 మెగాపిక్సల్ సెంటర్ స్టేజ్ కెమెరా, సిక్స్ స్పీకర్ సౌండ్ సిస్టమ్, డాల్బీ అట్మోస్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కనెక్టివిటీ, హైస్పీడ్ యూఎస్‌బీ టైప్ సి థండర్ బోల్ట్ పోర్టులు, డిస్‌ప్లే పోర్టు, మాగ్‌సేఫ్ 3 చార్జింగ్ పోర్టు, థండర్‌బోల్ట్ 4, యూఎస్‌బీ 4 పోర్టులు, వైఫై 7, బ్లూటూత్ 6.0, 35వాట్ల వరకు సపోర్ట్ చేసే యూఎస్‌బీ టైప్ సి పవర్ అడాప్టర్, 15 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ వంటి అధునాతన సదుపాయాలను ఈ ల్యాప్‌టాప్ మోడల్స్‌లో అందిస్తున్నారు. మిడ్‌నైట్, స్టార్‌లైట్, సిల్వర్, స్కై బ్లూ కలర్ ఆప్షన్‌లలో లాంచ్ అయింది.
మాక్‌బుక్ ప్రొ..
మాక్‌బుక్ ప్రొ (ఎం5 ప్రొ/ఎం5 మ్యాక్స్) మోడల్ ల్యాప్‌టాప్‌లలో 24జీబీ నుంచి 48జీబీ వరకు ర్యామ్‌ను ఇస్తున్నారు. అవసరం అయితే 128జీబీ వరకు పెంచుకోవచ్చు. అలాగే 1టీబీ, 2టీబీ స్టోరేజ్‌ను ఇస్తున్నారు. దీన్ని 4టీబీ లేదా 8టీబీ వరకు పెంచుకోవచ్చు. యూజర్లు తమ సౌకర్యానికి అనుగుణంగా 14 లేదా 16 ఇంచుల మోడల్స్‌లో ఎం5 ప్రొ లేదా ఎం5 మ్యాక్స్ చిప్ కలిగిన వేరియెంట్లను ఎంచుకోవచ్చు. ఈ మోడల్స్ లోనూ మాక్ ఓఎస్ లభిస్తుంది. అలాగే మ్యాజిక్ కీబోర్డు, టచ్ ఐడీ, వైఫై 67, బ్లూటూత్ 6.0, 12 మెగాపిక్సల్ సెంటర్ స్టేజ్ కెమెరా, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, డాల్బీ అట్మోస్, యూఎస్‌బీ టైప్ సి థండర్ బోల్ట్ పోర్టులు, డిస్‌ప్లే పోర్టు, థండర్‌బోల్ట్ 5, యూఎస్‌బీ 4 పోర్టులు, ఎస్‌డీఎక్స్‌సీ కార్డు స్లాట్, హెచ్‌డీఎంఐ 2.1, మాగ్‌సేఫ్ 3 పోర్టులు ఉన్నాయి. 24 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తాయి. గరిష్టంగా 140 వాట్ల యూఎస్‌బీ టైప్ సి పవర్ అడాప్టర్ లభిస్తుంది.
సరికొత్త మాక్‌బుక్ ఎయిర్, మాక్‌బుక్ ప్రొ మోడల్స్ కు గాను ఇప్పటికే ప్రీ ఆర్డర్‌లను ప్రారంభించారు. భారత్‌తోపాటు ప్రపంచ వ్యాప్తంగా 33 దేశాల్లో ఈ మోడల్స్ లభ్యం కానున్నాయి. ఈ ల్యాప్ టాప్‌లకు వెనుక వైపు నానో టెక్చర్ వేయించుకునే సదుపాయం కూడా అందిస్తున్నారు. అందుకు గాను అదనంగా మరో రూ.15వేలు చెల్లించాలి. యాపిల్ స్టోర్ లొకేషన్లు, యాపిల్ ఆథరైజ్డ్ రీసెల్లర్లు ఈ ల్యాప్‌టాప్ లను విక్రయించనున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Apple | వినియోగదారులకు షాకివ్వనున్న యాపిల్.. ఐఫోన్ల ధరలు పెంపు..?
ఆగస్టు 24, 2026

POCO M8 Power 5G | 8000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, పవర్ఫుల్ డిస్ప్లేతో లాంచ్ అయిన పోకో కొత్త ఫోన్.. ధర ఎంతంటే..
ఆగస్టు 5, 2026

OnePlus | వన్‌ప్లస్ ఇండిపెండెన్స్ డే సేల్.. ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..
ఆగస్టు 4, 2026
తాజావార్తలు
- ●Drugs Smuggling | డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎయిర్ హోస్టెస్
- ●Shriya Saran | 19 ఏళ్ల తర్వాత తలైవాతో శ్రియా రొమాన్స్ - శివాజీ కాంబో రిపీట్
- ●Lava Virat V1 Pro 5G | లావా నుంచి మరో కొత్త 5జి ఫోన్.. రూ.2వేల లాంచింగ్ డిస్కౌంట్..
- ●Dera Baba | రేపిస్ట్‌కు మరోసారి పెరోల్.. 9 ఏళ్లలో 17వసారి
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. బంగారం కొనేందుకు మంచి చాన్స్..
- ●Hijab | ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదు.. అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Drugs Smuggling | డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎయిర్ హోస్టెస్

Shriya Saran | 19 ఏళ్ల తర్వాత తలైవాతో శ్రియా రొమాన్స్ - శివాజీ కాంబో రిపీట్

Lava Virat V1 Pro 5G | లావా నుంచి మరో కొత్త 5జి ఫోన్.. రూ.2వేల లాంచింగ్ డిస్కౌంట్..

Dera Baba | రేపిస్ట్‌కు మరోసారి పెరోల్.. 9 ఏళ్లలో 17వసారి



