Kommidi Narasimha Reddy | భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి ఇకలేరు
Kommidi Narasimha Reddy | ప్రత్యేక తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమకారుడు, భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిది నరసింహా రెడ్డి(Kommidi Narasimha Reddy ) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో తన పెద్ద కుమార్తె నివాసంలో మంగళవారం కన్నుమూశారు.
Kommidi Narasimha Reddy | త్రినేత్ర.న్యూస్ : ప్రత్యేక తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమకారుడు, భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహా రెడ్డి(Kommidi Narasimha Reddy ) తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో తన పెద్ద కుమార్తె నివాసంలో మంగళవారం కన్నుమూశారు. మాజీ ఎమ్మెల్యే మృతిపట్ల ఆయా పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొమ్మిడి నరసింహారెడ్డి అంత్యక్రియలు యాదాద్రి భువనగిరి జిల్లాలోని బ్రాహ్మణపల్లిలో బుధవారం జరగనున్నాయి.
ప్రస్తుతం కొమ్మిడి నరసింహారెడ్డి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం.. రామాంతపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పక్క గల్లీలోని పెద్ద కుమార్తె రజిని రెడ్డి నివాసంలో ఉంచారు. పలువురు నేతలు కొమ్మిడి భౌతికకాయానికి నివాళులర్పించి, ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.
సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభం
కొమ్మిడి నరసింహారెడ్డి రాజకీయ ప్రస్థానం సర్పంచ్ పదవి నుంచి ప్రారంభమైంది. బ్రాహ్మణపల్లి సర్పంచ్‌గా 1962 నుంచి 1970 వరకు పని చేశారు. 1978లో కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద భువనగిరి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1983లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1985 మధ్యంతర ఎన్నికల్లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా.. పోటీ నుంచి తప్పుకున్నారు.
300 ఎకరాల భూమి దానం.. సొంతిల్లు లేదు..
ఒకసారి సర్పంచ్‌గా, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా సేవలందించినప్పటికీ.. ఆయన ఆస్తులు వెనుకేసుకోలేదు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమించారు. వారసత్వంగా వచ్చిన 300 ఎకరాల భూమిని కూడా పేద ప్రజలకు పంచిపెట్టారు. నేటి వరకు ఆయనకు సొంతిల్లు లేదు. సొంత కారు కూడా లేదు. సాధారణ బజాజ్ చేతక్ స్కూటర్‌పైనే ప్రజల మధ్య తిరిగిన ప్రజానేతగా ఆయన కీర్తి గడించారు. పేద ప్రజలు ఆయనను ప్రేమతో భూదాన్ రెడ్డిగా పిలుచుకునేవారు.
2013లో ఆమరణ నిరాహార దీక్ష
300 ఎకరాల భూమిని దానం చేసి భూదాన్ రెడ్డిగా పేరుగాంచిన కొమ్మిడి నరసింహారెడ్డి ప్రజల కోసం అలుపెరగని పోరాటం చేశారు. భువనగిరి, ఆలేరు ప్రాంతాలకు సాగునీరు కోసం ఇచ్చంపల్లి బ్యారేజీ ఉద్యమం చేపట్టారు. గోదావరి జలాలను మూసీకి మళ్లించే ప్రణాళికపై నిరంతర ప్రచారం చేశారు. మూసీ నది కాలుష్య నిర్మూలన కోసం జీవితాంతం పోరాటం చేశారు. బీబీనగర్ నిమ్స్ ఏర్పాటు కోసం 2013లో ఆమరణ నిరాహార దీక్ష చేశారు. బొల్లేపల్లి కాలువలో భూమి కోల్పోయినా రైతులకు పరిహారం కోసం చివరి వరకు పోరాటం చేశారు. మొత్తంగా భువనగిరి రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ప్రజానాయకుడిగా కొమ్మిడి స్థానం సంపాదించుకున్నారు.
ప్రజల మనిషి కొమ్మిడి : కేసీఆర్
తొలిదశ తెలంగాణ ఉద్యమకారుడు, భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహా రెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. రాజకీయాల్లో నిరాడంబరత, నీతి నిజాయితీకి నిదర్శనంగా నిలిచిన ప్రజల మనిషి నర్సింహా రెడ్డి అనీ, వారి కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. భూదానోద్యమంలో తన వందలాది ఎకరాలను పేదలకు పంచిన నర్సింహా రెడ్డి, 1969లో తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో పాల్గొని, మూసి పరిరక్షణ కోసం, తెలంగాణ కు గోదావరి నదీ జలాల కోసం కృషి చేశారని తెలిపారు. శోక తప్తులైన కొమ్మిడి నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
తాజావార్తలు
- ●Seethakka | చిన్నారులున్న చోటుకే మొబైల్ అంగన్వాడి కేంద్రాలు
- ●Karur Stampede Case | సీఎం విజయ్‌కి భారీ ఊరట.. డీఎంకేపై సుప్రీంకోర్టు ఆగ్రహం
- ●Rashmika Mandanna | నాలుగోసారి జోడీ కుదిరిందా? - విజయ్, రష్మిక కాంబోలో బాలీవుడ్ మూవీ !
- ●Konda Surekha | కాంగ్రెస్‌లో మళ్లీ విభేదాలు.. కడియంపై హైకమాండ్‌కు కొండా సురేఖ ఫిర్యాదు
- ●Harsh Goenka | మీ జీవితాన్ని మార్చే 3-30-300 రూల్.. హర్ష్ గోయెంకా చెప్పిన సక్సెస్ సీక్రెట్..
- ●Mahesh Kumar Goud | కేటీఆర్.. మరి తొమ్మిదిన్నరేండ్లలో ఏం చేశారు..?

Seethakka | చిన్నారులున్న చోటుకే మొబైల్ అంగన్వాడి కేంద్రాలు

Karur Stampede Case | సీఎం విజయ్‌కి భారీ ఊరట.. డీఎంకేపై సుప్రీంకోర్టు ఆగ్రహం

Rashmika Mandanna | నాలుగోసారి జోడీ కుదిరిందా? - విజయ్, రష్మిక కాంబోలో బాలీవుడ్ మూవీ !

Konda Surekha | కాంగ్రెస్‌లో మళ్లీ విభేదాలు.. కడియంపై హైకమాండ్‌కు కొండా సురేఖ ఫిర్యాదు





