Harish Rao | ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్‌పై అక్రమ కేసు పెట్టారు.. ఆయన మరణం దురదృష్టకరం
Harish Rao | ఉద్యమకారుడు లక్ష్మణ్‌గౌడ్(Activist Lakshman Goud)పై అక్రమ కేసు పెట్టారని.. ఆయన మరణం దురదృష్టకరమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) విచారం వ్యక్తం చేశారు.
- నీళ్లు, కరెంటు లేక అతని పొలం ఎండిపోయింది
- జానారెడ్డి పీఆర్వో ఒకరు భూమి విషయంలో ఇబ్బంది పెట్టాడు
- బాధిత కుటుంబానికి పల్లా అండగా ఉన్నాడు
- రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక అన్నిరకాలుగా ఆదుకుంటాం
- మాజీ మంత్రి హరీశ్ రావు భరోసా
Harish Rao | త్రినేత్ర న్యూస్: ఉద్యమకారుడు లక్ష్మణ్‌గౌడ్(Activist Lakshman Goud)పై అక్రమ కేసు పెట్టారని.. ఆయన మరణం దురదృష్టకరమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) విచారం వ్యక్తం చేశారు. నీళ్లు, కరెంటు లేక అతని పొలం ఎండిపోవడంతో పాటు జానారెడ్డి పీఆర్వో ఒకరు భూమి విషయంలో ఇబ్బంది పెట్టినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారని పేర్కొన్నారు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని వాపోయారు. బాధిత కుటుంబాన్ని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆదుకుంటున్నారన్నారు. జనగామ నియోజకవర్గం బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంలో ఇటీవల మరణించిన లక్ష్మణ్‌గౌడ్ కుటుంబాన్ని మంగళవారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడారు.
వాళ్లు మూడు కారణాలు చెప్పారు
లక్ష్మణ్‌గౌడ్ మృతి బాధాకరం, దురదృష్టకరం. కేసీఆర్ ఆదేశాలతో నేను, పల్లా రాజేశ్వర్‌రెడ్డి పరామర్శించాం. ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. అన్ని రకాలుగా ఆదుకుంటాం. ఆ కుటుంబాన్ని నూటికి నూరు శాతం నిలబెట్టుకుంటాం. లక్ష్మణ్‌గౌడ్ భార్యను, కుమారుడిని అడిగితే మూడు కారణాలు చెప్పారు. మొదటిది ఆయనకు జేసీబీ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనింగ్ కేసు పెట్టి.. సీజ్ చేసి నెలల పాటు పోలీస్‌స్టేషన్‌లో పెట్టారు. అడ్డగోలు ఫెనాల్టీలు వేస్తే ఆ వాహనం బయటికి తెచ్చుకోలేదు. దాంతోటి అప్పులు బాగా పెరిగిపోయినయ్.
రెండోది తన కుటుంబానికి ఉన్న ఏడెకరాలతో పాటు మరో ఆరు ఎకరాలు కౌలుకు తీసుకొని వానాకాలం పంట పెట్టారు. ప్రతి సంవత్సరం చెరువుల్లోకి నీళ్లు వచ్చేవి. దేవాదుల ద్వారా ప్రతి ఊరు చెరువులు నిండేవి. ఈ సంవత్సరం చెరువులకు నీళ్లు రాకపోగా కరెంటు కూడా సరిగా రాలేదు. బోర్ వేసినా అది ఫెయిల్ అయింది. పంట ఎండిపోయి పెట్టిన పెట్టుబడి కూడా చేతికి రాని పరిస్థితుల్లో కొత్త అప్పులు కూడా మీద పడ్డయ్. దేవాదుల ద్వారా చెరువు నింపకపోవడంతో పంటలకు నష్టం జరిగిందని కుటుంబ సభ్యులు చెప్తున్నరు.
మూడోది జానారెడ్డి పీఆర్‌వోగా చెప్తున్న వ్యక్తి ఒకరు ఈ భూమి మాదేనని దరఖాస్తు పెట్టాడంట. భూ భారతిలో గాని, అంతకుముందు ధరణిలో గాని.. రెవెన్యూ రికార్డులల్ల గానీ వాళ్ల తాత పేరు మీదున్న భూమి అది. రైతుబంధు వస్తున్న భూమిని సడెన్‌గా ప్రొహిబిషన్ లిస్ట్‌లో పెట్టడంతో ఆ భూమిని అమ్ముకునే అవకాశం కూడా పోయింది. జానారెడ్డి పీఆర్‌వోగా చెప్తున్న వ్యక్త దరఖాస్తు పెడితే కలెక్టర్ ఆ భూమిని ప్రొహిబిషన్ లిస్ట్‌లో పెట్టారు. దీంతో మరింత మనస్తాపానికి లోనయ్యాడు.
ఆర్థిక సాయం అందించాం..
కారణాలేదైనా మనిషి చనిపోవడం చాలా దురదృష్టకరం. గతంలో కూడా ఈ కుటుంబానికి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అండగా నిలబడ్డడు. నిజంగా ఈ విషయం మా దృష్టికి వచ్చుంటే లక్ష్మణ్‌గౌడ్‌ను కాపాడుకునేవాళ్లం. తమ్ముడు ధైర్యం కోల్పోయి ఈ రకంగా తప్పుడు నిర్ణయం తీసుకున్నడు. మృతుడి భార్యకు ఉద్యోగం ఇవ్వడంతో పాటు పిల్లల చదువు బాధ్యతను తీసుకుంటానని పల్లా భరోసా ఇచ్చారు. పార్టీ తరఫున కూడా ఆర్థిక సాయం అందించాం. రేపు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఆ కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటాం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Nitin Nabin | 18న రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.. కరీంనగర్లో మహా పాదయాత్ర
నవంబర్ 10, 2026

Revanth Reddy | పోలేపల్లి ఎల్లమ్మ తల్లిపై ఆన.. డిసెంబర్ నాటికి కొడంగల్ బీడు భూములు తడుపుతా
నవంబర్ 9, 2026

Road Accident | హుస్నాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, ఏడేళ్ల కుమార్తె దుర్మరణం
నవంబర్ 9, 2026
తాజావార్తలు
- ●Malayalam | సినిమా సెట్స్‌లో అస్వస్థత - ప్రముఖ మలయాళ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత
- ●PVNR Expressway | పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై ప్రమాదం.. భారీగా స్తంభించిన ట్రాఫిక్
- ●Nvidia | ఎన్విడియా వివాదం.. చైనా గూఢచర్య చరిత్రలో మరో కోణం..
- ●Donkey Fair | బాలీవుడ్ స్టార్స్ పేరుతో గాడిదల అమ్మకాలు.. రూ.72,000 పలికిన చుంకీ పాండే..!
- ●Jensen Huang | ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు విడాకులిస్తే భార్యకు రూ.5 లక్షల కోట్ల ఆస్తి?
- ●Nitin Nabin | 18న రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.. కరీంనగర్లో మహా పాదయాత్ర

Malayalam | సినిమా సెట్స్‌లో అస్వస్థత - ప్రముఖ మలయాళ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత

PVNR Expressway | పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై ప్రమాదం.. భారీగా స్తంభించిన ట్రాఫిక్

Nvidia | ఎన్విడియా వివాదం.. చైనా గూఢచర్య చరిత్రలో మరో కోణం..

Donkey Fair | బాలీవుడ్ స్టార్స్ పేరుతో గాడిదల అమ్మకాలు.. రూ.72,000 పలికిన చుంకీ పాండే..!





