C R Kesavan | బిలాంగింగ్ కాదు వైట్‌వాషింగ్ అని పెట్టాల్సింది.. సోనియా ఆత్మకథపై బీజేపీ విమర్శలు
C R Kesavan | సోనియా గాంధీ (Sonia Gandhi) రాసిన ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love)పై బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఈ పుస్తకానికి 'బిలాంగింగ్' కాకుండా 'వైట్‌వాషింగ్' (తప్పులను కప్పిపుచ్చడం) అని పేరు పెడితే బాగుండేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సి.ఆర్. కేశవన్ (C R Kesavan) విమర్శించారు. నెహ్రూ-గాంధీ కుటుంబం చేసిన చారిత్రక తప్పిదాలను, కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలను కప్పిపుచ్చేందుకు ఈ పుస్తకం ద్వారా ప్రయత్నించారని ఆయన ఆరోపించారు.
C R Kesavan | త్రినేత్ర న్యూస్ : కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ (Sonia Gandhi) రాసిన ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love) రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ బుక్‌పై బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. ఈ పుస్తకానికి 'బిలాంగింగ్' కాకుండా 'వైట్‌వాషింగ్' (తప్పులను కప్పిపుచ్చడం) అని పేరు పెడితే బాగుండేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సి.ఆర్. కేశవన్ (C R Kesavan) విమర్శించారు. నెహ్రూ-గాంధీ కుటుంబం చేసిన చారిత్రక తప్పిదాలను, కాంగ్రెస్ పార్టీ చేసిన పాపాలను కప్పిపుచ్చేందుకు ఈ పుస్తకం ద్వారా ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఇంధిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీని సమర్థించుకోవడానికి సోనియా ప్రయత్నించారని దుయ్యబట్టారు.
1975లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ (Indira Gandhi) విధించిన ఎమర్జెన్సీ తప్పేనని.. తన అత్తగారు కూడా చివరికి అదే అభిప్రాయానికి వచ్చారని సోనియా తన ఆత్మకథలో పేర్కొన్నారు. ఆ సమయంలో ఇందిరా గాంధీ తన చిన్న కుమారుడైన సంజయ్ గాంధీని అదుపులో ఉంచి ఉంటే ఎమర్జెన్సీ కాలంలో జరిగిన నష్టాన్ని చాలా వరకు నివారించి ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే, సోనియా వాదనను కేశవన్ ఖండించారు. సోనియా వ్యాఖ్యలు ప్రాథమిక హక్కుల రద్దు, పత్రికలపై ఆంక్షలు, ఇతర అణచివేత చర్యలను సమర్థించేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ పుస్తకం ద్వారా ఎమర్జెన్సీని సాధారణమైనదిగా చూపించే ప్రయత్నమని విమర్శించారు.
బాబ్రీ మసీదు కూల్చివేత సమయంలో సోనియా గాంధీ కన్నీరు పెట్టారని, కానీ 1984 సిక్కుల మారణహోమం జరిగినప్పుడు గానీ, 26/11 ముంబై ఉగ్రదాడుల సమయంలో గానీ ఆమె ఇలాంటి ఆవేదనను ఎందుకు చూపించలేదని కేశవన్ ప్రశ్నించారు. "బాబ్రీ మసీదు కూల్చివేతకు సోనియా గాంధీ కన్నీళ్లు పెట్టుకున్నానని తన ఆత్మకథలో రాసుకొచ్చారు. మరి కాంగ్రెస్ పాలనలోనే 1984లో సిక్కుల ఊచకోత జరిగి వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతే ఆమె కనీసం ఒక్క చుక్క కన్నీరైనా కార్చారా..?" అని ప్రశ్నించారు.
అదేవిధంగా 2008 బట్లా హౌస్ ఎన్‌కౌంటర్ వివాదాన్ని ప్రస్తావిస్తూ.. విధుల్లో ఉంటూ ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ (CRPF) సిబ్బంది పట్ల సోనియా గాంధీ ఎప్పుడైనా ఇలాగే ఆందోళన వ్యక్తం చేశారా..? అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన 26/11 ముంబై ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకుల కోసం ఆమె కన్నీళ్లు పెట్టారా..? అని ప్రశ్నించారు. ఉగ్ర దాడిపై యూపీఏ ప్రభుత్వం ఎందుకు ప్రతీకారం తీర్చుకోలేదో ఈ పుస్తకం సమాధానం ఇస్తుందా..? అని నిలదీశారు. దాదాపు 55 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. భారతదేశ రాజకీయాలకు, మన ప్రజాస్వామ్యానికి తీవ్రమైన గాయాలను మిగిల్చిందని కేశవన్ విమర్శించారు. కాంగ్రెస్ చేసిన ఆ చారిత్రక తప్పిదాలను, పాపాలను ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ సరిదిద్దుతున్నారని కొనియాడారు.
Also Read..
బాలీవుడ్ స్టార్స్ పేరుతో గాడిదల అమ్మకాలు.. రూ.72,000 పలికిన చుంకీ పాండే..!
18న రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.. కరీంనగర్‌లో మహా పాదయాత్ర
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sonia Gandhi | మోదీతో పెద్దగా పరిచయం లేదు.. ప్రధాని పదవి తిరస్కరణ వెనుక కారణం ఇదే.. ఆత్మకథలో సోనియా గాంధీ ఆసక్తికర విషయాలు
నవంబర్ 10, 2026

Delhi Air Pollution | ఢిల్లీలో కాలుష్యానికి ఆప్ నేతలు కుట్ర : బీజేపీ మంత్రి
నవంబర్ 9, 2026

Chirumarthi Lingaiah | సాగర్ ఎక్కడ.. కుప్పం ఎక్కడ? 72 టీఎంసీల నీళ్లు పోతుంటే ఏం చేస్తున్నారు?
నవంబర్ 6, 2026
తాజావార్తలు
- ●Malayalam | సినిమా సెట్స్‌లో అస్వస్థత - ప్రముఖ మలయాళ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత
- ●PVNR Expressway | పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై ప్రమాదం.. భారీగా స్తంభించిన ట్రాఫిక్
- ●Nvidia | ఎన్విడియా వివాదం.. చైనా గూఢచర్య చరిత్రలో మరో కోణం..
- ●Donkey Fair | బాలీవుడ్ స్టార్స్ పేరుతో గాడిదల అమ్మకాలు.. రూ.72,000 పలికిన చుంకీ పాండే..!
- ●Jensen Huang | ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు విడాకులిస్తే భార్యకు రూ.5 లక్షల కోట్ల ఆస్తి?
- ●Nitin Nabin | 18న రాష్ట్రానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్.. కరీంనగర్‌లో మహా పాదయాత్ర

Malayalam | సినిమా సెట్స్‌లో అస్వస్థత - ప్రముఖ మలయాళ సినిమాటోగ్రాఫర్ కన్నుమూత

PVNR Expressway | పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై ప్రమాదం.. భారీగా స్తంభించిన ట్రాఫిక్

Nvidia | ఎన్విడియా వివాదం.. చైనా గూఢచర్య చరిత్రలో మరో కోణం..

Donkey Fair | బాలీవుడ్ స్టార్స్ పేరుతో గాడిదల అమ్మకాలు.. రూ.72,000 పలికిన చుంకీ పాండే..!



