త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Robbery | పోలీస్ స్టేష‌న్ ప‌క్క‌నే బంగారం దుకాణం.. గోడను ప‌గ‌ల‌గొట్టి ఆభ‌ర‌ణాలు చోరీ..

Robbery | మేడ్చ‌ల్ (Medchal)లో పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద ఉన్న ఓ బంగారం దుకాణంలో చోరీ (Robbery) జరిగింది. దుకాణం వెనుక గోడకు రంధ్రం చేసిన దుండ‌గులు బంగారం, వెండి ఆభ‌ర‌ణాలు ఎత్తుకెళ్లారు.

G

Flash news | Published On Nov 10, 2026, 1.07 pm IST

Robbery | పోలీస్ స్టేష‌న్ ప‌క్క‌నే బంగారం దుకాణం.. గోడను ప‌గ‌ల‌గొట్టి ఆభ‌ర‌ణాలు చోరీ..
Advertisement

Robbery | త్రినేత్ర న్యూస్‌: మేడ్చ‌ల్ (Medchal)లో పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద ఉన్న ఓ బంగారం దుకాణంలో చోరీ (Robbery) జరిగింది. దుకాణం వెనుక గోడకు రంధ్రం చేసిన దుండ‌గులు బంగారం, వెండి ఆభ‌ర‌ణాలు ఎత్తుకెళ్లారు. ఉదయం షాపు తెరవ‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

మేడ్చల్ ప‌ట్ట‌ణంలో పోలీస్ స్టేష‌న్ (Police Station) ప‌క్క‌నే శ్రీ జగదాంబ జ్యువెలర్స్ (Shree Jagadamba Jewellers) దుకాణం ఉంది. దుకాణం వెనుక భాగంలోని గది గోడకు రంధ్రం చేసిన దుండ‌గులు.. లోపలికి ప్రవేశించి విలువైన‌ వెండి, బంగారు ఆభ‌ర‌ణాలు, వస్తువులను అపహరించారు. రోజూ మాదిరిగానే మంగ‌ళ‌వారం ఉదయం దుకాణం తెరిచేందుకు వచ్చిన యజమాని శేషమాల్ చౌదరి కుమారుడు అజయ్ చౌదరి.. లోపల పరిస్థితిని చూసి అవాక్కయ్యాడు. దుకాణం వెనుక గోడకు రంధ్రం ఉండటం, వెండి వస్తువులు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించిన పోలీసులు కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ప‌రిస‌రాల్లో సీసీటీవీ కెమెరాల‌ను ప‌రిశీలిస్తున్నారు. కాగా, గతంలోనూ ఇదే దుకాణంలో చోరీ జరగ‌డం గ‌మ‌నార్హం.

Advertisement
Advertisement