BRICS Summit | భారత్‌లో అడుగుపెట్టిన పుతిన్.. నేడు ప్రధాని మోదీతో భేటీ
BRICS Summit | 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమైంది. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ ప్రతిష్ఠాత్మక సదస్సు (BRICS Summit) శని, ఆదివారాల్లో (సెప్టెంబర్ 11, 12) జరుగనుంది.
BRICS Summit | త్రినేత్ర.న్యూస్: 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమైంది. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఈ ప్రతిష్ఠాత్మక సదస్సు (BRICS Summit) శని, ఆదివారాల్లో (సెప్టెంబర్ 11, 12) జరుగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. సమావేశాల్లో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఢిల్లీలో అడుగుపెట్టారు. శుక్రవారం తెల్లవారుజామున ప్రత్యేక విమానంలో పాలమ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌కు చేరుకున్న పుతిన్‌కు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్వాగతం పలికారు. ఆయన రాజధానిలో ఐటీసీ మౌర్యలో బస చేయనున్నారు. నేడు ప్రధాని మోదీతో సమావేశమవుతారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌తో యుద్ధం (Ukraine war) ప్రారంభమైన తర్వాత, రష్యా వెలుపల పుతిన్ స్వయంగా హాజరవుతున్న తొలి బ్రిక్స్ సదస్సు ఇదే కావడం గమనార్హం.

కీలక అంశాలపై మోదీ-పుతిన్ చర్చలు
శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని మోదీ (PM Modi), అధ్యక్షుడు పుతిన్ సమగ్ర ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ భేటీలో ప్రధానంగా.. వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, రక్షణ రంగాల్లో సహకారంపై దృష్టి సారిస్తారు. టెక్నాలజీ, ఔషధ రంగాలు (ఫార్మాస్యూటికల్స్), వ్యూహాత్మక వాణిజ్య స్థిరత్వం, సరిహద్దు చెల్లింపుల విధానాలపై ఇరు దేశాధినేతలు చర్చించనున్నారు.
శుక్రవారం జరగనున్న ‘బ్రిక్స్ బిజినెస్ ఫోరం’ను ఉద్దేశించి పుతిన్ ప్రసంగించడంతో పాటు ప్రధాని మోదీతో కలిసి ‘ఇన్నోప్రోమ్’ (INNOPROM) ప్రదర్శనను సందర్శిస్తారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో సహా పలువురు బ్రిక్స్ దేశాల నేతలతో పుతిన్ విడివిడిగా సమావేశాలు నిర్వహించనున్నారు.

జిన్‌పింగ్ కూడా..
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Xi Jinping) కూడా బ్రిక్స్ సదస్సుకు హాజరుకానున్నారు. 2019 తర్వాత ఆయన భారత్‌కు రానుండటం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో సమావేశమవనున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలు, ఇతర ద్వైపాక్షిక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక బ్రిక్స్ సమావేశానికి ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian), దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా (Cyril Ramaphosa), ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాం, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్‌దెల్ ఫతా ఎల్ సిసి, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహిం, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మహమద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్, ఇథియోఫియా ప్రధాని అబియ్ అహ్మద్ అలి, వియత్నామ్ ప్రధాని లీ మిన్ హుంగ్ తదితరులు హాజరుకానున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

PM Modi | భారత్‌లో ప్రైవేట్ అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది : ప్రధాని మోదీ
సెప్టెంబర్ 10, 2026

P Chidambaram | బ్రిక్స్‌తో భారత్‌కు ఒరిగిందేంటి..? : చిదంబరం
సెప్టెంబర్ 10, 2026

80s Vibes | సోషల్ మీడియాని షేక్ చేస్తున్న 80s ట్రెండ్.. వింటేజ్ లుక్‌లో ప్రధాని మోదీ, రాహుల్..
సెప్టెంబర్ 10, 2026
తాజావార్తలు
- ●Venus Transit | నక్షత్రాన్ని మార్చుకోనున్న శుక్రుడు.. మూడురాశులవారు జాగ్రత్తగా ఉండాల్సిందే..!
- ●Horoscope | సెప్టెంబర్ 11 రాశిఫలాలు.. ఊహించని సవాళ్లు ఎదురయ్యే అవకాశం!
- ●Dragon Fruit on Terrace | టెర్రస్‌పై డ్రాగన్ ఫ్రూట్ సాగు.. నెలకు రూ. 4 లక్షలు సంపాదిస్తున్న రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు
- ●NHRC | కాంగ్రెస్ సర్కార్‌పై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు
- ●Telangana DGP | ఆన్లైన్ బెట్టింగ్ ఉచ్చులో పడొద్దు.. అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవద్దు
- ●Varun Tej | కొడుకుతో మెగా హీరో - ఫొటోలు వైరల్

Venus Transit | నక్షత్రాన్ని మార్చుకోనున్న శుక్రుడు.. మూడురాశులవారు జాగ్రత్తగా ఉండాల్సిందే..!

Horoscope | సెప్టెంబర్ 11 రాశిఫలాలు.. ఊహించని సవాళ్లు ఎదురయ్యే అవకాశం!

Dragon Fruit on Terrace | టెర్రస్‌పై డ్రాగన్ ఫ్రూట్ సాగు.. నెలకు రూ. 4 లక్షలు సంపాదిస్తున్న రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు

NHRC | కాంగ్రెస్ సర్కార్‌పై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు



