Nepal Floods | వరదలకు కలుషితమైన నీరు.. నేపాల్ బాధితులను వెంటాడుతున్న అంటు వ్యాధుల ముప్పు
Nepal Floods | నేపాల్ వదరల్లో (Nepal Floods) మరణించిన వారి సంఖ్య 1,400కు చేరువైంది. ఘోర విపత్తు సంభవించిన 11 రోజుల తర్వాత కూడా ఇంకా 4,898 మంది ఆచూకీ తెలియరావడం లేదు. వీరిలో 200 మందికిపైగా భారతీయులు కూడా ఉన్నారు. అదే సమయంలో నేపాల్ బాధితులను అంటు వ్యాధుల ముప్పు వెంటాడుతోంది.
International | Published On Sep 5, 2026, 12.04 pm IST
Nepal Floods | త్రినేత్ర.న్యూస్ : నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల (Nepal Floods) కారణంగా మరణించిన వారి సంఖ్య శనివారం నాటికి 1,344కు చేరింది. ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. వేలాది మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. అదే సమయంలో నేపాల్ బాధితులను అంటు వ్యాధుల ముప్పు వెంటాడుతోంది.
నేపాల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటి వరకూ 843 మృతదేహాలను వెలికితీశారు. అందులో 85 మృతదేహాలు చిన్న పిల్లలివి కావడం కలచివేస్తోంది. వీటితోపాటూగా వరదల తీవ్రతకు తీవ్రంగా దెబ్బతిన్న, అవయవాలు విడిపోయిన (amputated) మరో 501 శరీర భాగాలను కూడా అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘోర విపత్తు సంభవించిన 11 రోజుల తర్వాత కూడా ఇంకా 4,898 మంది ఆచూకీ తెలియరావడం లేదు. వారి కోసం నేపాల్ ఆర్మీ సంయుక్తంగా గాలింపు చర్యలు కొనసాగిస్తోంది. గల్లంతైన వందలాది మంది భారతీయుల ఆచూకీ కూడా తెలియరాలేదు.
వెంటాడుతున్న అంటువ్యాధుల ముప్పు
ఇదిలా ఉండగా.. విపత్తు నుంచి ప్రాణాలతో బయటపడిన స్థానిక ప్రజలను మరో తీవ్రమైన ముప్పు వెంటాడుతోంది. ప్రభావిత ప్రాంతాల్లో వరదల కారణంగా తాగునీరు కలుషితమయ్యాయి. అంతేకాదు, ఎక్కడ చూసినా భవన శిథిలాలు, మృతదేహాలే ఉన్నాయి. దీంతో అక్కడ అంటు వ్యాధుల భయం వెంటాడుతోంది. తాగునీరు, ఆహారం విషయంలో అప్రమత్తంగా లేకపోతే వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, ఇప్పటికే ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని ప్రజారోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన స్థానిక యంత్రాంగం.. టీకాలు వేయాలని యోచిస్తోంది. దాదాపు లక్ష మంది ప్రజలకు కలరా, 75 వేల మందికి పైగా చిన్నారులకు మీజిల్స్ టీకాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ వరదలకు వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇళ్లు, బంధువులను కోల్పోయి నిరాశలో కూరుకుపోయారు. వారంతా ప్రస్తుతం తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. వారికి ప్రభుత్వం పప్పు, రొట్టెలు, ధాన్యం, తాగునీటి సీసాలు వంటి నిత్యావసరాలను అందిస్తోంది.
Also Read..
అరుణాచలం To రామేశ్వరం.. రూ.16 వేలకే ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనం
దారుణం.. తీసుకున్న అప్పు కట్టలేదని.. మహిళను కిడ్నాప్ చేసి, నగ్నంగా వీడియో తీసి
నీ పేరు ఎవరికి తెలియదని అవమానించారు - వైష్ణవి చైతన్య ఎమోషనల్ కామెంట్స్
సంబంధిత వార్తలు

Nepal Floods | నేపాల్ వరదల్లో అద్భుతం.. 9 రోజుల తర్వాత జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు కార్మికులు
సెప్టెంబర్ 4, 2026

Earthquake | జల ప్రళయం వేళ.. టిబెట్‌ను వణికించిన భారీ భూకంపం
సెప్టెంబర్ 3, 2026

Sonu Sood | నేపాల్ త్రిశూలి బజార్‌ను సందర్శించిన సోనూ సూద్
సెప్టెంబర్ 2, 2026
తాజావార్తలు
- ●EHS | నిమ్స్‌లో ఉచితంగానే ఈహెచ్ఎస్ ఓపీ సేవలు..
- ●IRCTC | అరుణాచలం To రామేశ్వరం.. రూ.16 వేలకే ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనం
- ●GPT-6 Astra | ఓపెన్ఏఐ నుంచి జీపీటీ-6 ఆస్ట్రా.. కంప్యూటర్ను మనిషిలా ఆపరేట్ చేసే కొత్త ఏఐ..
- ●Revanth Reddy | ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించేందుకు కుట్ర.. దొంగదెబ్బ తీస్తామంటే చూస్తూ ఊరుకునేవారు లేరు: సీఎం రేవంత్
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.18వేలు తగ్గిన బంగారం ధర.. మళ్లీ పతనం దిశగా..?
- ●టీ గ్లాసులో ‘యాంటిడోట్’: హెర్బల్ టీల కాలం చెల్లింది.. ఇప్పుడు ‘ఫంక్షనల్ డ్రింక్స్’ హవా!

EHS | నిమ్స్‌లో ఉచితంగానే ఈహెచ్ఎస్ ఓపీ సేవలు..

IRCTC | అరుణాచలం To రామేశ్వరం.. రూ.16 వేలకే ఏడు ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనం

GPT-6 Astra | ఓపెన్ఏఐ నుంచి జీపీటీ-6 ఆస్ట్రా.. కంప్యూటర్ను మనిషిలా ఆపరేట్ చేసే కొత్త ఏఐ..

Revanth Reddy | ఎస్ఐఆర్ పేరుతో ఓట్లు తొలగించేందుకు కుట్ర.. దొంగదెబ్బ తీస్తామంటే చూస్తూ ఊరుకునేవారు లేరు: సీఎం రేవంత్



