Sonu Sood | నేపాల్ త్రిశూలి బజార్‌ను సందర్శించిన సోనూ సూద్
Sonu Sood | వరదలతో అతలాకుతలమైన హిమాలయ దేశం నేపాల్ (Nepal)కు బాలీవుడ్ స్టార్ హీరో సోనూసూద్ (Sonu Sood) అండగా నిలుస్తున్నారు. వరదలకు తీవ్రంగా ప్రభావితమైన త్రిశూలి బాజర్‌ను సోనూ సూద్ తాజాగా సందర్శించారు. వరద బాధితుల పట్ల తన సానుభూతి వ్యక్తం చేశారు.
Sonu Sood | త్రినేత్ర.న్యూస్ : బాలీవుడ్ స్టార్ నటుడు, రియల్ హీరో సోనూసూద్ (Sonu Sood).. కరోనా కష్టకాలంలో తన పెద్ద మనసు చాటుకున్న విషయం తెలిసిందే. ఎంతో మందికి తనవంతు సాయం చేసి రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా నేపాల్ (Nepal) వరద బాధితులకు సైతం అండగా నిలుస్తున్నారు. వరద బాధితులకు సహాయం చేసేందుకు ఖాఠ్మాండూ వెళ్లారు.
ఈ సందర్భంగా వరదలకు తీవ్రంగా ప్రభావితమైన త్రిశూలి (Trishuli) బజార్‌ను సోనూ సూద్ సందర్శించారు. క్షేత్రస్థాయిలో అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. స్థానికులను కలిసి అక్కడి పరిస్థితిపై ఆరా తీశారు. వరద బాధితుల పట్ల తన సానుభూతి వ్యక్తం చేశారు. నేపాల్ పరిస్థితి చూస్తుంటే బాధేస్తోందన్నారు. ఈ సందర్భంగా కష్టకాలంలో పొరుగు దేశానికి అండగా నిలుస్తున్న భారత ప్రభుత్వాన్ని ఆయన అభినందించారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న సమస్య వారాల్లోనో, నెలల్లోనే పరిష్కారం కాదని చెప్పారు. నేపాల్‌కు నిరంతరం మద్దతు అవసరమని అభిప్రాయపడ్డారు. అప్పుడే వారు తిరిగి సాధారణ జీవితాన్ని గడపగలరని పేర్కొన్నారు.
#WATCH | Nepal: Bollywood actor Sonu Sood visits Trishuli Bazar, one of the most affected towns due to the flash floods.
He arrived in Kathmandu yesterday to distribute relief materials to Nepali flood victims. pic.twitter.com/1POLhtObyI
— ANI (@ANI) September 2, 2026
నేపాల్‌లో గత నెల 26న సంభవించిన ఆకస్మిక వరదలు (Nepal Flash Floods) పెను విషాదాన్ని మిగిల్చాయి. అనేక గ్రామాలు నామరూపం లేకుండా పోయాయి. ఇళ్లు, రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. జలవిద్యుత్ ప్రాజెక్టులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య బుధవారం నాటికి 1,127కు చేరుకుంది. చిత్వాన్ నుంచి 348, తూర్పు నవల్పరాసి నుంచి 217, పశ్చిమ నవల్పరాసి నుంచి 190, నువాకోట్ నుంచి 155, గోర్ఖా 66, ధాడింగ్ నుంచి 59, రసువా నుంచి 45, తనాహు నుంచి 38 మృతదేహాలను రెస్క్యూ టీమ్స్ వెలికితీశాయి. 1,113 మృతదేహాలకు పోస్టుమార్టం, చట్టపరమైన గుర్తింపు ప్రక్రియ పూర్తైనట్లు పోలీసులు తెలిపారు. వాటిలో 95 మృతదేహాలను బంధువులకు అప్పగించినట్లు వెల్లడించారు. అదేవిధంగా ప్రభావిత ప్రాంతాల నుంచి ఇప్పటి వరకూ 6,541 మందిని భద్రతా దళాలు రక్షించాయి. గల్లంతైన 4,858 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఫ్లాష్ ఫ్లడ్స్ (flash floods)కు వాతావరణ మార్పులే కారణమని ఆ దేశ ప్రధాని బలేంద్ర షా (Nepal PM Balendra Shah) తేల్చారు.
Also Read..
సీఎం విజయ్ సంచలన ప్రకటన.. వారిపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేత
ఆకస్మిక వరదలకు అదే కారణం.. తేల్చిన నేపాల్ ప్రధాని బలేంద్ర షా
దిశా సాలియన్ మృతి కేసు.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన బాంబే హైకోర్టు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Nepal Flash Floods | ఎప్పటికీ రాని తల్లిదండ్రుల కోసం ఎదురుచూపు.. నేపాల్ బాలుడి కన్నీటి గాథ
సెప్టెంబర్ 8, 2026

Nepal Floods | వరదలకు కలుషితమైన నీరు.. నేపాల్ బాధితులను వెంటాడుతున్న అంటు వ్యాధుల ముప్పు
సెప్టెంబర్ 5, 2026

Nepal Floods | నేపాల్ వరదల్లో అద్భుతం.. 9 రోజుల తర్వాత జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు కార్మికులు
సెప్టెంబర్ 4, 2026
తాజావార్తలు
- ●Uppal Ring Road | ఉప్పల్ రింగ్‌రోడ్డులో రెండు వైపుల తెరచుకున్న వరంగల్ రహదారులు
- ●Sangameshwara Temple | 37 రోజుల్లోనే.. బయటపడిన సంగమేశ్వర ఆలయ శిఖరం
- ●Jupiter Transit 2026 | 12 ఏళ్ల తర్వాత సింహరాశిలోకి గురుడు.. అదృష్టమంటే ఈ మూడురాశుల వారిదే.. మీ రాశి ఉందో చెక్ చేసుకోండి..!
- ●Horoscope | సెప్టెంబర్ 13 రాశిఫలాలు.. అదృష్టం కలిసి రావాలంటే మీ వంతు ప్రయత్నం చేయాల్సిందే!
- ●Palla Rajeshwar reddy | ఆ 29 ఎకరాల భూమి నాది అని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
- ●Harish Rao | 22ఏ నిషేధిత భూములపై పొంగులేటి అబద్దాల ప్రవాహాన్ని పారించారు

Uppal Ring Road | ఉప్పల్ రింగ్‌రోడ్డులో రెండు వైపుల తెరచుకున్న వరంగల్ రహదారులు

Sangameshwara Temple | 37 రోజుల్లోనే.. బయటపడిన సంగమేశ్వర ఆలయ శిఖరం

Jupiter Transit 2026 | 12 ఏళ్ల తర్వాత సింహరాశిలోకి గురుడు.. అదృష్టమంటే ఈ మూడురాశుల వారిదే.. మీ రాశి ఉందో చెక్ చేసుకోండి..!

Horoscope | సెప్టెంబర్ 13 రాశిఫలాలు.. అదృష్టం కలిసి రావాలంటే మీ వంతు ప్రయత్నం చేయాల్సిందే!



