Woman Kidnapped | దారుణం.. తీసుకున్న అప్పు కట్టలేదని.. మహిళను కిడ్నాప్ చేసి, నగ్నంగా వీడియో తీసి
Woman Kidnapped | బెంగళూరులో (Bengaluru) దారుణం చోటు చేసుకుంది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదన్న కారణంతో ఓ మహిళను ముగ్గురు నిందితులు కిడ్నాప్ చేశారు. ఆమెను బంధించి చిత్రహింసలకు గురి చేశారు. అంతటితో ఆగని నిందితులు ఆమెను వివస్త్రను చేసి వీడియో తీసి బెదిరింపులకు పాల్పడ్డారు.
Woman Kidnapped | త్రినేత్ర.న్యూస్ : కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో దారుణ ఘటన వెలుగు చూసింది. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదన్న కారణంతో ఓ మహిళను కొందరు కిడ్నాప్ (Woman Kidnapped) చేశారు. ఆమెను ఓ చోట నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు. అంతేకాదు, బలవంతంగా ఆమెను వివస్త్రను చేసి వీడియో తీశారు. ఈ అమానుష ఘటన సుంకడకట్టే ప్రాంతంలో వెలుగు చూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 30 ఏళ్ల బాధిత మహిళ సుమారు రెండేళ్ల క్రితం రేష్మా బాను అనే మహిళ వద్ద రూ.లక్ష అప్పుగా తీసుకుంది. ఆ తర్వాత రేష్మా ద్వారానే నస్రత్ అనే మహిళ వద్ద మరో రూ.50 వేలు అప్పుగా తీసుకుంది. కొన్ని రోజులు వడ్డీ, రుణ వాయిదాలను క్రమం తప్పకుండా కట్టిన బాధితురాలు.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా గత ఆరు నెలలుగా వడ్డీ చెల్లించడం మానేసింది (non-payment of loan interest). రెండు నెలలుగా రుణ వాయిదాలు కూడా కట్టడంలేదు. దీంతో రేష్మా వైపు నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో ఆమె ఫోన్ నంబర్‌ను బాధితురాలు బ్లాక్ చేసింది. ఆ తర్వాత తన తల్లి ఇంటికి వెళ్లిపోయింది. ఆగస్టు 27న పని ఇప్పిస్తానని నమ్మించి బాధితురాలిని నస్రత్ తన ఇంటికి పిలిచింది.
ఆమె నస్రత్ ఇంటికి చేరుకోగానే.. రేష్మ, ఆమె భర్త సుహైల్ అక్కడికి వచ్చి బాధితురాలిపై దాడి చేశారు. అనంతరం ముగ్గురూ కత్తితో బెదిరించి బలవంతంగా ఆమెను ఆటోలో కుంబల్‌గోడు (Kumbalgodu) సమీపంలోని ఒక ఇంటికి తీసుకెళ్లి బంధించారు. అక్కడ ఆమెపై దాడి చేసి చిత్రహింసలకు గురి చేశారు. నిందితులు మహిళను బలవంతంగా వివస్త్రను చేసి వీడియో తీశారు. డబ్బులు త్వరగా చెల్లించకపోతే వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామంటూ బెదిరించారు.
మరోవైపు బయటకు వెళ్లిన మహిళ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లి కంగారు పడింది. ఈ మేరకు చంద్ర లేఅవుట్ పోలీస్ స్టేషన్ (Chandra Layout Police Station)లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మహిళ కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే బాధితురాలు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి ఆమెను రక్షించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారిపై కిడ్నాప్, దాడి, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
Also Read..
ఒకే యువతిని ప్రేమించిన ఇద్దరు స్నేహితులు.. ఒకరి దారుణ హత్య
కత్తితో కేక్ కట్ - స్టార్ డైరెక్టర్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌పై వివాదం
ఎర్ర అంచు.. చిలుకపచ్చ రంగు.. దసరాలోపే ఇందిరమ్మ చీరలు పంపిణీ
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Travel Bus | అనంతపురంలో ట్రావెల్స్ బస్సు దగ్ధం.. తప్పిన ప్రాణ నష్టం
సెప్టెంబర్ 4, 2026

Medical Emergency | దోహా నుంచి బెంగళూరు వస్తున్న ఇండిగో విమానం.. మస్కట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
సెప్టెంబర్ 3, 2026

Swine Flu | స్వైన్ ఫ్లూ కేసులు పెరుగుతున్నా, ఆందోళన అక్కర్లేదు: మాజీ ఐసీఎంఆర్ చీఫ్
ఆగస్టు 27, 2026
తాజావార్తలు
- ●Kamareddy | రెండు కార్ల మధ్య ఇరుక్కుపోయిన స్కూటర్.. 9వ తరగతి విద్యార్థి మృతి
- ●Both friends loved the same woman | ఒకే యువతిని ప్రేమించిన ఇద్దరు స్నేహితులు.. ఒకరి దారుణ హత్య
- ●Indiramma Sarees | ఎర్ర అంచు.. చిలుకపచ్చ రంగు.. దసరాలోపే ఇందిరమ్మ చీరలు పంపిణీ
- ●Vijay for PM | ప్రధాని అభ్యర్థిగా విజయ్.. కాంగ్రెస్‌తో విభేదాల వేళ సెప్టెంబర్ 9న కూటమి పక్షాలతో టీవీకే భేటీ!
- ●Engineering students | లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
- ●Bank of Baroda | బ్యాంక్ ఆఫ్ బరోడాలో వెల్త్ ఎగ్జిక్యూటివ్, క్రెడిట్ అనలిస్ట్ ఉద్యోగాలు.. 1100 పోస్టులతో నోటిఫికేషన్

Kamareddy | రెండు కార్ల మధ్య ఇరుక్కుపోయిన స్కూటర్.. 9వ తరగతి విద్యార్థి మృతి

Both friends loved the same woman | ఒకే యువతిని ప్రేమించిన ఇద్దరు స్నేహితులు.. ఒకరి దారుణ హత్య

Indiramma Sarees | ఎర్ర అంచు.. చిలుకపచ్చ రంగు.. దసరాలోపే ఇందిరమ్మ చీరలు పంపిణీ

Vijay for PM | ప్రధాని అభ్యర్థిగా విజయ్.. కాంగ్రెస్‌తో విభేదాల వేళ సెప్టెంబర్ 9న కూటమి పక్షాలతో టీవీకే భేటీ!



