Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.18వేలు తగ్గిన బంగారం ధర.. మళ్లీ పతనం దిశగా..?
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో రోజు రోజుకీ మరింత తీవ్రతరం అవుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా దేశీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా-ఇరాన్‌ల మధ్య కొద్ది రోజుల పాటు శాంతి చర్చల పేరుతో యుద్దానికి విరామం లభించే సరికి ఈక్విటీ మార్కెట్లు పుంజుకున్నాయి.
Gold And Silver Prices Today | పశ్చిమ ఆసియాలో రోజు రోజుకీ మరింత తీవ్రతరం అవుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా దేశీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా-ఇరాన్‌ల మధ్య కొద్ది రోజుల పాటు శాంతి చర్చల పేరుతో యుద్దానికి విరామం లభించే సరికి ఈక్విటీ మార్కెట్లు పుంజుకున్నాయి. కానీ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఇక ఇదే ప్రభావం బులియన్ మార్కెట్లపైనా పడుతోంది. పెట్టుబడిదారులు సేఫ్ హావెన్ ఆస్తులైన బంగారం, వెండిలపై పెట్టుబడులు పెట్టేందుకు బదులుగా లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఆయా లోహాల ధరలు సైతం భారీగా తగ్గుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర ఒక్క సెషన్‌లోనే 0.94 శాతం మేర పతనమై 4,431 డాలర్లకు చేరింది. వెండి ధర 1.15 శాతం మేర తగ్గి 66 డాలర్లకు చేరింది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు ఏకంగా 3వేల పాయింట్లకు పైగా పతనమై 1,52,767 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 4,691 పాయింట్లు తగ్గి 2,37,658 వద్ద ముగిసింది. దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,480 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,23, 840 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,54,800 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,48,000 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.18,600 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,190 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,13,520గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,41,900 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,19,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.17,000 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,610 ఉండగా, 8 గ్రాముల ధర రూ.92,880గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,16,100 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,61,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.13,900 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,50,000 ఉండగా, తులం ధర రూ.2,500గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,54,900 ఉండగా, తులం ధర రూ.2,549 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | ఇన్వెస్టర్లకు అలర్ట్.. బులియన్ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు..
సెప్టెంబర్ 4, 2026

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.33వేలు పెరిగిన బంగారం ధర.. పెట్టుబడిదారుల్లో ఉత్సాహం..
సెప్టెంబర్ 3, 2026

Gold And Silver Prices Today | యుద్ధం ఎఫెక్ట్.. పసిడి ధరలు భారీగా పతనం..
సెప్టెంబర్ 2, 2026
తాజావార్తలు
- ●Mutual Fund SIP | నెలకు రూ.25వేల సిప్ కడితే 10, 20, 30 ఏళ్లలో ఎంత జమ అవుతుంది..?
- ●Woman Kidnapped | దారుణం.. తీసుకున్న అప్పు కట్టలేదని.. మహిళను కిడ్నాప్ చేసి, నగ్నంగా వీడియో తీసి
- ●Kollywood | కత్తితో కేక్ కట్ - స్టార్ డైరెక్టర్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌పై వివాదం
- ●Kavitha | ప్రైవేటు, కార్పొరేట్ విద్యా వ్యాపారానికి కొమ్ముకాస్తున్న సీఎం.. ఫీజుల నియంత్రణ చట్టం ఇంకెప్పుడు?: కవిత
- ●Kamareddy | రెండు కార్ల మధ్య ఇరుక్కుపోయిన స్కూటర్.. 9వ తరగతి విద్యార్థి మృతి
- ●Both friends loved the same woman | ఒకే యువతిని ప్రేమించిన ఇద్దరు స్నేహితులు.. ఒకరి దారుణ హత్య

Mutual Fund SIP | నెలకు రూ.25వేల సిప్ కడితే 10, 20, 30 ఏళ్లలో ఎంత జమ అవుతుంది..?

Woman Kidnapped | దారుణం.. తీసుకున్న అప్పు కట్టలేదని.. మహిళను కిడ్నాప్ చేసి, నగ్నంగా వీడియో తీసి

Kollywood | కత్తితో కేక్ కట్ - స్టార్ డైరెక్టర్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌పై వివాదం

Kavitha | ప్రైవేటు, కార్పొరేట్ విద్యా వ్యాపారానికి కొమ్ముకాస్తున్న సీఎం.. ఫీజుల నియంత్రణ చట్టం ఇంకెప్పుడు?: కవిత



